కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు మనల్ని విలువైనవారిగా పరిగణిస్తాడు

దేవుడు మనల్ని విలువైనవారిగా పరిగణిస్తాడు

దేవునికి దగ్గరవ్వండి

దేవుడు మనల్ని విలువైనవారిగా పరిగణిస్తాడు

లూకా 12:​6, 7

‘మన హృదయము మనయందు దోషారోపణ చేయును.’ బైబిలు ఆ మాటలతో, కొన్నిసార్లు మన హృదయం మనల్నిమనం అతిగా విమర్శించుకునేలా చేస్తుందని అంగీకరిస్తోంది. మనం దేవుని ప్రేమకు, శ్రద్ధకు తగినవారం కాదనే భావాలను మన హృదయం మనలో కలిగిస్తుంది. కానీ, బైబిలు మనకిలా హామీనిస్తోంది: “దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు.” (1 యోహాను 3:​19, 20) దేవునికి, మన గురించి మనకు తెలిసినదానికంటే ఎక్కువ తెలుసు. మనల్నిమనం దృష్టించుకునే విధానానికి దేవుడు మనల్ని దృష్టించే విధానానికి ఎంతో తేడా ఉంటుంది. అయితే, యెహోవా దేవుని దృష్టిలో మనమెలా ఉన్నామన్నదే అత్యంత ప్రాముఖ్యం కాబట్టి, ఆయన దృష్టిలో మన విలువేమిటి? రెండు వేర్వేరు సందర్భాల్లో యేసు చెప్పిన, మనసును తాకే దృష్టాంతంలో దానికి సమాధానం దొరుకుతుంది.

ఒక సందర్భంలో యేసు ‘రెండు పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడతాయి’ అని చెప్పాడు. (మత్తయి 10:​29, 31) లూకా 12:⁠6, 7 ప్రకారం, యేసు ఇలా కూడా చెప్పాడు: “అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు. . . . భయ​పడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.” యెహోవా తన ఆరాధకుల్లో ప్రతీ ఒక్కరినీ ఎలా దృష్టిస్తాడో సులభంగా అర్థంచేసుకునేలా ఉన్న, అదే సమయంలో శక్తివంతంగా ఉన్న ఈ దృష్టాంతం బోధిస్తోంది.

ఆహారానికి ఉపయోగించే పక్షులన్నిటిలో పిచ్చుకలే చాలా చవక. పేద స్త్రీలు, బహుశా తన తల్లి కూడా, తమ కుటుంబం కోసం వంటచేయడానికి బజారుకువెళ్ళి ఈ చిన్నపక్షులను కొంటున్నప్పుడు యేసు గమనించే ఉంటాడు. ఒక అస్సారియోన్‌కు, అంటే ఇప్పుడున్న విలువ ప్రకారం, దాదాపు రెండు రూపాయలకు రెండు పిచ్చుకలు కొనుక్కోవచ్చు. ఆ పిచ్చుకలు ఎంత చవకంటే దాదాపు రెండు కాసులకు నాలుగు కాదుకానీ ఐదు పిచ్చుకలు వచ్చేవి, ఆ ఐదవది ఉచితంగా వచ్చేది.

ఒక్క పిచ్చుకకూడా ‘దేవునియెదుట మరువబడదు’ లేదా తండ్రికి తెలియకుండా “నేలనుపడదు” అని యేసు వివరించాడు. (మత్తయి 10:​29) పక్షులు గాయమై భూమ్మీద పడిన ప్రతీసారి లేదా ఆహారం కోసం నేలమీద వాలిన ప్రతీసారి యెహోవా వాటిని గమనిస్తాడు. అంత ప్రాముఖ్యం కానివన్నట్లు కనిపించే పక్షులను సృష్టించేటప్పుడు యెహోవా వాటిని అల్పమైనవిగా ఎంచలేదు, వాటిని గుర్తుంచుకునే విషయంలో కూడా ఆయన వాటిని అల్పమైనవిగా ఎంచడు. నిజానికి అవి అమూల్యమైన ప్రాణులు కాబట్టి ఆయన వాటిని విలువైనవిగా ఎంచుతాడు. యేసు ఆ దృష్టాంతంద్వారా ఏమి చెప్పాలనుకున్నాడో మీరు గ్రహించారా?

యేసు బోధిస్తున్నప్పుడు తరచూ పోలికను ఉపయోగిస్తూ, ఏదైనా ఒక మామూలు విషయాన్ని చెప్పి అదే విషయం అత్యంత ప్రాముఖ్యమైన విషయాలకు ఎలా అన్వయిస్తుందో వివరించేవాడు. ఉదాహరణకు యేసు ఇలా కూడా చెప్పాడు: ‘కాకులు విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టులేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు.’ (లూకా 12:​24) ఇప్పుడు పిచ్చుకల గురించి యేసు చెప్పింది మరింత స్పష్టమవుతోంది: యెహోవా ఈ చిన్న పక్షుల గురించే ఇంత శ్రద్ధ తీసుకుంటునప్పుడు, తనను ప్రేమించి ఆరాధించే మానవుల పట్ల ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడో కదా!

యేసు మాటలను బట్టి, “మన హృదయాలకంటే అధికుడైన” దేవుడు మనలను గమనించడానికి, మన పట్ల శ్రద్ధ కలిగివుండడానికి మనం అర్హులం కానంత అల్పులమని భావించ​నవసరం లేదు. మనలో మనకు కనిపించని గుణాలను మన సృష్టికర్త మనలో చూడవచ్చని తెలుసుకోవడం ఓదార్పుకరంగా లేదా? (w 08 4/1)

[25వ పేజీలోని చిత్రసౌజన్యం]

పిచ్చుకలు: © ARCO/D. Usher/age fotostock