కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యం గురించి ఆయనేమి బోధించాడు?

దేవుని రాజ్యం గురించి ఆయనేమి బోధించాడు?

యేసు ఏమి బోధించాడు?

దేవుని రాజ్యం గురించి ఆయనేమి బోధించాడు?

దేవుని రాజ్యమంటే ఏమిటి?

దేవుని రాజ్యం ఈ భూమినంతటినీ పరిపాలించే ఒక ప్రభుత్వం. యేసు ఇలా చెప్పాడు: “మీరీలాగు ప్రార్థనచేయుడి, . . . నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.”​—⁠మత్తయి 6:⁠9, 10; దానియేలు 2:​44.

దేవుని రాజ్య పరిపాలకులు ఎవరు?

దేవుని రాజ్యానికి రాజుగా ఉండడానికే యేసు పుట్టాడు. ఒక దేవదూత యేసు తల్లితో ఇలా చెప్పాడు: “ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన . . . ఏలును.” (లూకా 1:​30-33) అంతేకాక, యేసు తనతోపాటు పరిపాలించడానికి తన అనుచరుల్లో కొంతమందిని ఎంపిక చేసుకున్నాడు. ఆయన తన అపొస్తలులతో ఇలా చెప్పాడు: “నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే; గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా . . . నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.” (లూకా 22:​28, 29; దానియేలు 7:⁠27) యేసు అనుచరుల్లో 1,44,000 మంది ఆయనతోపాటు పరిపాలిస్తారు.​—⁠ప్రకటన 5:⁠9, 10; 14:⁠1.

ఆ ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది?

దేవుని రాజ్యం పరలోకం నుండి పరిపాలిస్తుంది. యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు: “నేను వెళ్లి [పరలోకంలో] మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును. . . . నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను.”​—⁠యోహాను 14:⁠2, 3, 12; దానియేలు 7:​13, 14.

దేవుని రాజ్యం దుష్టత్వాన్ని ఏమి చేస్తుంది?

యేసు ఈ భూమ్మీదనుండి దుష్టులను తొలగిస్తాడు. ఆయనిలా చెప్పాడు: ‘మనుష్యకుమారుడు [యేసు] సమస్త దూతలతో కలిసి తన మహిమతో వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; ఆయన వారిని వేరుపరచును. అనీతిమంతులు నిత్యశిక్షకును, నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు.’​—⁠మత్తయి 25:​31-34, 46.

ఆ రాజ్యపౌరులుగా ఎవరు ఈ భూమ్మీద నివసిస్తారు?

యేసు ఇలా చెప్పాడు: “సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.” (మత్తయి 5:⁠5; కీర్తన 37:​29; 72:⁠8) అప్పుడు భూవ్యాప్తంగా ఒకరినొకరు ప్రేమించుకునే ప్రజలు ఉంటారు, వారలా ప్రేమించడం ఇప్పటినుండే నేర్చుకుంటున్నారు. యేసు తన అనుచరులతో ఇలా చెప్పాడు: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.”​—⁠యోహాను 13:​34, 35.

దేవుని రాజ్యం భూమిపైవున్న మానవజాతి కోసం ఏమి చేస్తుంది?

యేసు మానవుల వ్యాధులన్నిటినీ స్వస్థపరుస్తాడు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు జనసమూహాలతో, “దేవుని రాజ్యమునుగూర్చి మాటలాడుచు, స్వస్థత కావలసినవారిని స్వస్థపరచెను.” (లూకా 9:​11) అపొస్తలుడైన యోహాను, పునరుత్థానం చేయబడిన యేసును ఒక దర్శనంలో చూసిన తర్వాత ఇలా చెప్పాడు: ‘నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. అప్పుడు, ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు అని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.’​—⁠ప్రకటన 21:​1-4.

దేవుని రాజ్యం భూమిని ఒక అందమైన తోటలా మారుస్తుంది. యేసుతోపాటు మ్రానుపై వ్రేలాడదీయబడిన నేరస్థుడు ఆయనతో ఇలా అన్నాడు: “యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుము.” దానికి యేసు అతనితో ఇలా అన్నాడు: ‘నీవు నాతోకూడ పరదైసులో [అందమైన తోటలో] ఉంటావని నిశ్చయముగా నేడు నీతో చెప్పుచున్నాను.’​—⁠లూకా 23:​42, 43; యెషయా 11:​4-9. (w 08 5/1)

మరింత సమాచారం కోసం బైబిలు బోధిస్తోంది పుస్తకంలోని 8వ అధ్యాయం చూడండి. a

[అధస్సూచి]

a యెహోవాసాక్షుల ప్రచురణ.