కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నోవహు, జలప్రళయం కథ కాదు, వాస్తవం

నోవహు, జలప్రళయం కథ కాదు, వాస్తవం

నోవహు, జలప్రళయం కథ కాదు, వాస్తవం

యుద్ధాలు, నేరాలు, అన్యాయాలు లేకుండా, ప్రజలందరూ శాంతియుతంగా కలసిమెలసి జీవించే, మరింత మంచిలోకం కోసం మీరు ఎదురుచూస్తున్నారా? అలాగైతే బహుశా మీకు బాగా తెలిసిన ఒక చారిత్రక వృత్తాంతం నుండి మీరు ప్రోత్సాహాన్ని పొందవచ్చు. అది నోవహు గురించిన వృత్తాంతం, ఆయన నిజంగా మంచి వ్యక్తి. తాను, తన కుటుంబం భూవ్యాప్త జలప్రళయం నుండి కాపాడబడేలా ఆయన ఒక ఓడను నిర్మించాడు, ఆ జలప్రళయంలో దుష్టులందరూ నాశనమయ్యారు.

ఈ వృత్తాంతం చాలామందికి సుపరిచితమే. నోవహు ఎలా కాపాడబడ్డాడో బైబిల్లోవున్న ఆదికాండము అనే పుస్తకంలోని 6 నుండి 9 అధ్యాయాల్లో వ్రాయబడివుంది. అది ఖురాన్‌లోను, భూవ్యాప్తంగా లెక్కలేనంతమంది నమ్మే పురాణాల్లోను తిరిగి చెప్పబడింది. జలప్రళయం నిజంగా వచ్చిందా లేక అది సరైనది చేయమని ప్రజలను ప్రోత్సహించడానికి అల్లబడిన కట్టుకథ మాత్రమేనా? శతాబ్దాలనుండి ఈ ప్రశ్నపై దైవశాస్త్ర పండితులకు, విజ్ఞాన శాస్త్రవేత్తలకు మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే దేవుని వాక్యమైన బైబిలు ఎలాంటి సందేహానికి తావివ్వడం లేదు. ఆ వృత్తాంతం నిజంగా జరిగిందే, కట్టుకథ కాదు. వీటిని పరిశీలించండి:

ఆదికాండములోని వృత్తాంతం, ఖచ్చితంగా ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ రోజున జలప్రళయం ప్రారంభమయ్యిందో, ఆ ఓడ ఎప్పుడు, ఎక్కడ నిలిచిందో, భూమి ఎప్పుడు ఆరిందో చెబుతోంది. ఆ ఓడ నమూనా, కొలతలు, దాన్ని నిర్మించడానికి ఉపయోగించిన సామగ్రి వంటి వివరాలన్నీ ఖచ్చితంగా ఇవ్వబడ్డాయి. అయితే, కట్టుకథల్లో సాధారణంగా వివరాలన్నీ స్పష్టంగా ఇవ్వబడవు.

బైబిల్లోని వంశావళులకు సంబంధించిన రెండు వృత్తాంతాలు నోవహు నిజమైన వ్యక్తని ధృవీకరిస్తున్నాయి. (1 దినవృత్తాంతములు 1:⁠4; లూకా 3:⁠36) ఈ వంశావళులను సేకరించి, వ్రాసిపెట్టిన ఎజ్రా, నెహెమ్యాలు జాగ్రత్తపరులైన పరిశోధకులు. యేసుక్రీస్తు నోవహు వంశావళి నుండి వచ్చాడని లూకా స్పష్టం చేశాడు.

ప్రవక్తలైన యెషయా, యెహెజ్కేలు, క్రైస్తవ అపొస్తలులైన పౌలు, పేతురు నోవహు గురించి లేదా జలప్రళయం గురించి నివేదించారు.​—⁠యెషయా 54:⁠9; యెహెజ్కేలు 14:​14, 20; హెబ్రీయులు 11:⁠7; 1 పేతురు 3:​19, 20; 2 పేతురు 2:⁠5.

యేసుక్రీస్తు ఆ జలప్రళయం గురించి మాట్లాడుతూ ఇలా చెప్పాడు: “నోవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనముచేసెను.” (లూకా 17:​26, 27) ఒకవేళ జలప్రళయం వచ్చి ఉండకపోతే “మనుష్యకుమారుని దినముల” గురించి యేసు చేసిన వ్యాఖ్యానం అర్థరహిత​మైనదిగా ఉంటుంది.

బైబిలు చెబుతున్నదానిని అలక్ష్యం చేసే “అపహాసకులు” వస్తారని అపొస్తలుడైన పేతురు ముందుగానే చెప్పాడు. పేతురు ఇలా వ్రాశాడు: ‘ఆ నీళ్లవలన [నోవహు కాలంలోని] లోకము నీటివరదలో మునిగి నశించెనను వాస్తవమును వారు బుద్ధిపూర్వకముగా మరతురు.’ మనం కూడా ‘ఆ వాస్తవాన్ని’ బుద్ధిపూర్వకంగా మరచిపోవడం సరైనదేనా? ఎంతమాత్రం కాదు. ఎందుకంటే పేతురు ఇంకా ఇలా చెబుతున్నాడు: “ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడి[యున్నవి].”​—⁠2 పేతురు 3:​3-7.

మళ్ళీ, దేవుడు దుష్టులను నాశనం చేస్తాడు. మళ్ళీ, కొందరు కాపాడబడతారు. మనం నోవహు మాదిరిని అనుసరించి జీవిస్తే మరింత మంచి లోకంలో జీవించగలుగుతాం. (w 08 6/1)