కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక యువకుడి ధైర్యం

ఒక యువకుడి ధైర్యం

మన యువతకు

ఒక యువకుడి ధైర్యం

సూచనలు: ప్రశాంతంగా ఉండే పరిసరాల్లో కూర్చుని ఈ బైబిలు వచనాలను చదవండి. అలా చదువుతున్నప్పుడు ఆ వృత్తాంతాల్లోని వ్యక్తుల మధ్య మీరూ ఉన్నారనుకోండి. అందులోని సంఘటనలను కళ్ళారా చూస్తున్నట్లు, వారి మాటలు వింటున్నట్లు, ఆ వృత్తాంతాలు మీ ఎదుటే జరుగుతున్నట్లు ఊహించుకోండి. అందులోని ప్రధాన పాత్రల భావాలు ఎలా ఉండివుంటాయో ఆలోచించండి.

సన్నివేశాన్ని విశ్లేషించండి.—1 సమూయేలు 17:1-11, 26, 32-51 చదవండి.

గొల్యాతు రూపం, స్వరం ఎలా ఉన్నట్లు మీరు ఊహించుకున్నారో వర్ణించండి. _______

దావీదు ఇశ్రాయేలు సైన్యంలో లేకపోయినా, గొల్యాతుతో యుద్ధం చేయడానికి ఎందుకు సిద్ధపడ్డాడు? (26వ వచనం చూడండి.)

_______

యెహోవా తనకు సహాయం చేస్తాడని దావీదు ఎందుకు నమ్మాడు? (34-37 వచనాలను మళ్లీ చదవండి.)

_______

మరింత పరిశోధన చేయండి.

మీకు అందుబాటులో ఉన్నవాటితో పరిశోధించి, ఈ క్రింది విషయాలను కనిపెట్టండి

(1) గొల్యాతు ఎత్తు. (1 సమూయేలు 17:4)

ఆరు మూళ్ల జేనెడు = _______.

(2) గొల్యాతు యుద్ధ కవచం బరువు. (1 సమూయేలు 17:5)

5,000 తులముల రాగి = _________.

(3) గొల్యాతు ఈటె బరువు. (1 సమూయేలు 17:7)

600 తులముల ఇనుము = _________.

మీరు నేర్చుకున్న విషయాలను అన్వయించుకోండి. మీరు ఈ క్రింది విషయాల గురించి ఏమి నేర్చుకున్నారో రాయండి . . .

ధైర్యం.

_______

మీ స్వశక్తిపై కాకుండా యెహోవాపై ఆధారపడడం.

_______

మీరు నేర్చుకున్న విషయాలను ఇంకా ఏయే విధాలుగా అన్వయించుకోవచ్చు.

గొల్యాతులా కనిపించే ఎలాంటి అడ్డంకులు మీకున్నాయి?

_______

యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టడని ఏ అనుభవాలు (మీవైనా, ఇతరులవైనా) మిమ్మల్ని ఒప్పిస్తున్నాయి?

_______

ఈ వృత్తాంతంలో ఏది మీ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనదని మీకు అనిపించింది, ఎందుకు?

_______ (w09 1/1)