కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

బైబిల్లో ప్రస్తావించబడిన కుష్ఠువ్యాధి, నేడు కుష్ఠువ్యాధి అని పిలవబడుతున్న వ్యాధి ఒకటేనా?

సూక్ష్మక్రిముల ద్వారా మనుషులకు సోకే అంటురోగాన్ని సూచించడానికి నేడు “కుష్ఠువ్యాధి” అనే వైద్య సంబంధమైన పదం ఉపయోగించబడుతోంది. కుష్ఠువ్యాధిని కల్గించే సూక్ష్మక్రిమిని (మైకోబాక్టీరియమ్‌ లెప్రె) మొట్టమొదటిసారిగా డాక్టర్‌ జి.ఎ. హాన్సన్‌ 1873లో కనుగొన్నారు. ఈ వ్యాధికారక క్రిములు, శరీరం బయట అంటే మనిషి చీదిన చీమిడిలో కూడా దాదాపు 9 రోజులపాటు బ్రతికేవుంటాయని పరిశోధకులు తెలుసుకున్నారు. కుష్ఠువ్యాధి వచ్చిన వారికి దగ్గర్లో ఉండేవాళ్లకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందనీ వాళ్లు వాడిన బట్టల ద్వారా ఈ అంటురోగం వ్యాపించే అవకాశం ఉందనీ కూడా పరిశోధకులు తెలుసుకున్నారు. 2007లో 2,20,000కన్నా ఎక్కువ మందికి కొత్తగా ఈ వ్యాధి సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది.

బైబిలు కాలాల్లో, మధ్య ప్రాచ్య దేశాల్లోని ప్రజలకు ఈ వ్యాధి సోకిందనడంలో సందేహం లేదు, వ్యాధి సోకిన వాళ్లు సమాజం బయట ఉండాలని మోషే ధర్మశాస్త్రం చెప్పింది. (లేవీయకాండము 13:4, 5) అయితే, “కుష్ఠువ్యాధి” అని అనువదించబడిన ట్సరేయాత్‌ అనే హీబ్రూ పదం కేవలం మనుషులకు వచ్చే రోగాన్ని మాత్రమే సూచించడంలేదు. ఆ రోజుల్లో, ట్సరేయాత్‌ అనేది బట్టలమీద, ఇంటి గోడలమీద కనిపించేది. ఇలాంటి కుష్ఠువ్యాధి ఉన్ని లేదా నార దుస్తుల్లో లేదా తోలుతో చేయబడినవాటిలో కనిపించేది. కొన్ని సందర్భాల్లో ఇది ఉతకడంతో పోయేది. కానీ, ఒకవేళ అది “పచ్చగా కానీ ఎర్రగా కానీ” ఉంటే వాటిని తగులబెట్టాలి. (లేవీయకాండము 13:47-52, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఇది ఇళ్లలోనైతే గోడలమీద “పచ్చటి లేక ఎర్రటి” గుంతల్లా కనిపించేది. అలాంటి గుంతలున్న రాళ్లను, జిగటమట్టిని తీసేసి ప్రజలు నివసించే ప్రాంతానికి దూరంగా పారేయాలి. అది మళ్లీ ఇంటి గోడలమీద కనిపిస్తే, ఆ ఇల్లు పూర్తిగా కూలగొట్టి, అలా కూలగొట్టిన వాటన్నిటినీ పారేయాలి. (లేవీయకాండము 14:33-45) బట్టల మీద, ఇంటి గోడలమీద కనిపించే ఆ రోగం ఇప్పుడు మనకాలంలో మనం చూసే బూజు అయుండొచ్చని కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా, దీనిగురించి ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. (w09 2/1)