కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నమ్మకమైన గృహనిర్వాహకుడు అతని పరిపాలక సభ

నమ్మకమైన గృహనిర్వాహకుడు అతని పరిపాలక సభ

నమ్మకమైన గృహనిర్వాహకుడు అతని పరిపాలక సభ

“తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు?”—లూకా 12:42.

1, 2. అంత్యదినాల గురించి చెబుతున్నప్పుడు యేసు ఏ ప్రాముఖ్యమైన ప్రశ్న అడిగాడు?

అం త్యదినాలను గుర్తించేందుకు వివిధ సూచనలను ఇస్తూ యేసు ఇలా అడిగాడు: “యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?” అలా అడిగిన తర్వాత, ఆ దాసుడు నమ్మకంగా ఉన్నందుకు యజమాని తన ఆస్తి అంతటిమీద అతణ్ణి నియమిస్తాడని యేసు చెప్పాడు.—మత్త. 24:45-47.

2 అంతకుముందు పర్ణశాల పండుగప్పుడు యేసు అలాంటి ప్రశ్నే వేశాడు. (లూకా 12:42-44 చదవండి.) ఆయన ఆ సందర్భంలో, దాసుణ్ణి ‘గృహనిర్వాహకుడు’ అని పిలిచాడు. గృహనిర్వాహకుడంటే ఇంటి పనివారిమీద నియమించబడిన వ్యక్తి. అయితే గృహనిర్వాహకుడు కూడ సేవకుడే. ఈ దాసుడు లేక గృహనిర్వాహకుడు ఎవరు? ఈ దాసుడు ఎలా ‘తగినవేళ అన్నము పెడతాడు?’ మనకు ఆధ్యాత్మిక ఆహారం ఎవరి ద్వారా అందుతుంది? వంటి విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం.

3. (ఎ) ‘దాసుని’ తరగతి గురించి యేసు చెప్పిన విషయాలను క్రైస్తవ వ్యాఖ్యానకర్తలు ఎలా వివరిస్తున్నారు? (బి) ‘గృహనిర్వాహకుడు’ లేక “దాసుడు” ఎవరు? “ఇంటివారు” ఎవరు?

3 యేసు చెప్పిన ఈ మాటలు క్రైస్తవులమని చెప్పుకునేవారిలో బాధ్యతాయుత స్థానాల్లోవున్న వారిని సూచిస్తున్నాయని సాధారణంగా క్రైస్తవ వ్యాఖ్యానకర్తలు అనుకుంటారు. ఈ ఉపమానంలోని ‘యజమాని’ అయిన యేసు, క్రైస్తవమత సామ్రాజ్యంలోని వివిధ శాఖల్లో అనేకమంది దాసులు ఉంటారని చెప్పలేదు గానీ, తనకు కలిగిన దానంతటిమీద ఒకే ఒక ‘గృహనిర్వాహకుణ్ణి’ లేక ‘దాసుణ్ణి’ నియమిస్తానని స్పష్టంగా చెప్పాడు. అయితే, ఈ పత్రిక పదేపదే వివరించినట్లు గృహనిర్వాహకుడు ఒక వర్గంగా లేక ఒక గుంపుగా అభిషిక్త శిష్యులకు చెందిన ‘చిన్నమందకు’ ప్రాతినిధ్యం వహిస్తుండాలి. లూకా సువార్తలో యేసు చెప్పిన సందర్భాన్ని బట్టి చూస్తే ఆయన ఆ గుంపు గురించే మాట్లాడుతున్నాడని తెలుస్తుంది. (లూకా 12:32) మత్తయి, లూకా సువార్తల్లో ప్రస్తావించబడిన “ఇంటివారు” ఈ గుంపునే సూచిస్తున్నా ఆ మాట వారిలో ప్రతి ఒక్కరూ చేసే పనిని నొక్కి చెబుతోంది. అయితే ఆసక్తి రేకెత్తించే ప్రశ్నేమిటంటే, తగినవేళ ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే పనిలో ఈ దాసుని తరగతిలోని ప్రతీ ఒక్కరూ పాలుపంచుకుంటారా? దీని గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో క్షుణ్ణంగా పరిశోధిస్తే మనకు జవాబు తెలుస్తుంది.

గతంలో యెహోవా సేవకులు

4. ప్రాచీన ఇశ్రాయేలు జనాంగాన్ని యెహోవా ఏమని పిలిచాడు? ఆ జనాంగం విషయంలో గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటి?

4 యెహోవా తన ప్రజలైన ప్రాచీన ఇశ్రాయేలు జనాంగాన్ని సేవకుడు అని పిలిచాడు. “మీరును [బహువచనం] నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును [ఏకవచనం] నాకు సాక్షులు [బహువచనం].” (యెష. 43:10) దేవుడు ఇశ్రాయేలు జనాంగమంతటిని సేవకుడు అని పిలిచాడు. అయితే యాజకులతోపాటు యాజకులుకాని లేవీయులకు మాత్రమే జనాంగానికి ధర్మశాస్త్రాన్ని బోధించే పని అప్పగించబడిందనే విషయాన్ని గుర్తుంచుకోండి.—2 దిన. 35:3; మలా. 2:7.

5. యేసు చెప్పినట్లు ఏ ప్రాముఖ్యమైన మార్పు జరిగింది?

5 ఇశ్రాయేలు జనాంగాన్నే యేసు దాసుడు అని పిలిచాడా? లేదు. ఎందుకంటే “దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడును” అని తన కాలంలోని యూదులతో యేసు అన్నాడని మనకు తెలుసు. (మత్త. 21:43) ఈ విషయంలో మార్పు జరిగిందని స్పష్టమౌతుంది. యెహోవా ఒక కొత్త జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే, ఆధ్యాత్మిక అంశాలను బోధించే విషయానికొస్తే యేసు ఉపమానంలోని దాసుడు ప్రాచీన ఇశ్రాయేలులోని ‘సేవకునిలాగే’ పనిచేస్తాడు.

నమ్మకమైన దాసుడు కనిపించాడు

6. సా.శ. 33 పెంతెకొస్తు దినాన ఏ కొత్త జనాంగం పుట్టింది? దానిలో ఎవరు భాగమయ్యారు?

6 ఆ కొత్త జనాంగంలో అంటే ‘దేవుని ఇశ్రాయేలులో’ అభిషిక్త క్రైస్తవులు ఉన్నారు. (గల. 6:16; రోమా. 2:28, 29; 9:6) సా.శ. 33 పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ఆ కొత్త జనాంగం పుట్టింది. ఆ తర్వాత, ఆత్మాభిషిక్త క్రైస్తవులంతా ఆ జనాంగంలో భాగమయ్యారు. వారు యజమాని అయిన యేసుక్రీస్తు నియమించిన దాసుని తరగతిలా ఇప్పుడు పనిచేస్తున్నారు. సువార్త ప్రకటించి శిష్యులను చేయమనే ఆజ్ఞ ఆ జనాంగంలోని ప్రతీ ఒక్కరికి ఇవ్వబడింది. (మత్త. 28:19, 20) అయితే, తగినవేళ ఆధ్యాత్మిక ఆహారాన్ని ఆ గుంపులోని ప్రతీ ఒక్కరు అందిస్తున్నారా? దీనికి లేఖనాలు ఏమి చెబుతున్నాయో చూద్దాం.

7. అపొస్తలులకు ప్రారంభంలో ఏ ప్రాముఖ్యమైన పని అప్పగించబడింది? ఆ తర్వాత వారికి ఏ అదనపు బాధ్యత అప్పగించబడింది?

7 యేసు తన 12 మంది అపొస్తలులను నియమించినప్పుడు వారికి ప్రాముఖ్యంగా ఇతరులకు సువార్త ప్రకటించే పనిని అప్పగించాడు. (మార్కు 3:13-15 చదవండి.) గ్రీకులో “పంపించబడిన” అనే అర్థంవచ్చే క్రియా పదం నుండి అపొస్టొలస్‌ అనే పదం వచ్చింది. ఆ అర్థానికి తగినట్లే అపొస్తలులు ప్రకటనా పని కోసం పంపించబడ్డారు. అయితే, కాలం గడుస్తున్నకొద్దీ ఇక క్రైస్తవ సంఘం స్థాపించబడుతుందనగా అపొస్తలులకు “ఉద్యోగం [‘పర్యవేక్షించే బాధ్యత,’ NW]” అప్పగించబడింది.—అపొ. 1:20-26.

8, 9. (ఎ) పన్నెండుమంది అపొస్తలులు ఏ పనికి ప్రాధాన్యతనిచ్చారు? (బి) పరిపాలక సభ ఆమోదించిన ప్రకారం ఎవరికి కూడా అదనపు బాధ్యతలు అప్పగించబడ్డాయి?

8 పన్నెండుమంది అపొస్తలులు ఏ పనికి ప్రాధాన్యతనిచ్చారు? ఆ విషయం పెంతెకొస్తు తర్వాత జరిగిన సంఘటనలను చూస్తే మనకు తెలుస్తుంది. విధవరాళ్లకు ప్రతీరోజు ఆహారాన్ని పంచిపెట్టే విషయంలో వివాదం తలెత్తినప్పుడు 12 మంది అపొస్తలులు శిష్యులను పిలిచి, “మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తముకాదు” అని అన్నారు. (అపొస్తలుల కార్యములు 6:1-6 చదవండి.) తాము ‘వాక్యపరిచర్య’ కోసం పూర్తి సమయాన్ని, శక్తిని వెచ్చించేలా అపొస్తలులు “ఆ పనిని” అర్హులైన ఇతర సహోదరులకు అప్పగించారు. అలా చేయడాన్ని యెహోవా ఆశీర్వదించాడు. ఎందుకంటే, ‘దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది.’ (అపొ. 6:7) కాబట్టి ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే పనిని ప్రాముఖ్యంగా అపొస్తలులే చూసుకున్నారు.—అపొ. 2:42.

9 కొంతకాలానికి, బరువైన బాధ్యతలు ఇతరులకు అప్పగించబడ్డాయి. పరిశుద్ధాత్మ నిర్దేశంతో అంతియొకయలోని సంఘం పౌలు, బర్నబాలను మిషనరీలుగా పంపించింది. మొదట్లో ఎంపిక చేయబడిన 12 మంది అపొస్తలుల్లో వారు లేకపోయినా తర్వాత వారు కూడా అపొస్తలులుగా పేరుపొందారు. (అపొ. 13:1-3; 14:14; గల. 1:19) యెరూషలేములోని పరిపాలక సభ వారి నియామకాన్ని ఆమోదించింది. (గల. 2:7-10) పరిపాలక సభ ఆమోదాన్ని పొందిన తర్వాత పౌలు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే పనిలో పాల్గొన్నాడు. అలా ఆయన దైవ ప్రేరణతో మొదటి పత్రికను రాశాడు.

10. మొదటి శతాబ్దంలో, ఆధ్యాత్మిక ఆహారాన్ని సిద్ధం చేసే బాధ్యతను ఆత్మాభిషిక్త క్రైస్తవులందరూ చూసుకున్నారా? వివరించండి.

10 అయితే, ప్రకటనా పనిని పర్యవేక్షించడం, ఆధ్యాత్మిక ఆహారాన్ని సిద్ధం చేయడం వంటి బాధ్యతలను ఆత్మాభిషిక్త క్రైస్తవులందరూ చూసుకుంటారా? లేదు. ఎందుకంటే అపొస్తలుడైన పౌలు, “అందరూ అపొస్తలులు కారు. అందరూ ప్రవక్తలు కారు. అందరూ బోధించే వాళ్లు కారు. అందరూ అద్భుతాలు చేసేవాళ్ళు కారు” అని చెప్పాడు. (1 కొరిం. 12:29, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ప్రకటనా పనిలో ఆత్మాభిషిక్త క్రైస్తవులందరూ భాగం వహించినా క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని 27 పుస్తకాలను రాయడానికి కేవలం కొద్దిమందినే అంటే ఎనిమిదిమందినే దేవుడు ఉపయోగించుకున్నాడు.

మన కాలంలోని నమ్మకమైన దాసుడు

11. ఏ ‘ఆస్తిని’ చూసుకోవాల్సిన బాధ్యత దాసునికి అప్పగించబడింది?

11 అంత్యదినాల్లో కూడా భూమ్మీద నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ఉంటుందని మత్తయి 24:45లోని యేసు మాటలు సూచిస్తున్నాయి. వారిని స్త్రీ సంతానములోని “శేషించిన వారు” అని ప్రకటన 12:17 పిలుస్తోంది. ఒక గుంపుగా శేషించినవారిని క్రీస్తు భూమ్మీద తన యావదాస్తిమీద నియమించాడు. యజమాని భూమ్మీదున్న తన ‘యావదాస్తిని’ చూసుకునే బాధ్యతను నమ్మకమైన గృహనిర్వాహకునికి అప్పగించాడు. అంటే తన రాజ్యంలోని పౌరులను, సువార్తను ప్రకటించడానికి ఉపయోగించే వసతులను చూసుకోవాల్సిన బాధ్యతను ఆ గృహనిర్వాహకునికి అప్పగించాడు.

12, 13. తమకు పరలోక పిలుపు ఉందో లేదో ఒక క్రైస్తవునికి ఎలా తెలుస్తుంది?

12 తనకు పరలోక నిరీక్షణ ఉందో లేదో, తాను ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయుల్లోని శేషించిన వారిలో ఉన్నాడో లేడో ఒక క్రైస్తవునికి ఎలా తెలుస్తుంది? దానికి జవాబును అపొస్తలుడైన పౌలు తనలా పరలోక నిరీక్షణ ఉన్నవారితో అన్న మాటల్లో చూస్తాం. ఆయన ఇలా అన్నాడు: “దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము—అబ్బా తండ్రీ అని మొఱ్ఱ పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.”—రోమా. 8:14-17.

13 ఒక్క మాటలో చెప్పాలంటే, వీరు దేవుని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి పరలోక సంబంధమైన “పిలుపు” పొందుతారు. (హెబ్రీ. 3:1) వ్యక్తిగతంగా వారికి దేవుని నుండి ఆహ్వానం అందుతుంది. ఎలాంటి అనుమానాలు, భయాలు లేకుండా దేవుని కుమారులయ్యే ఆహ్వానాన్ని వారు స్వీకరిస్తారు. (1 యోహాను 2:20, 21 చదవండి.) పరలోక నిరీక్షణ ఉందని తమకు తామే నిర్ణయించుకోరు కానీ యెహోవాయే వారిమీద తన ముద్రను వేస్తాడు లేక వారికి పరిశుద్ధాత్మను ఇస్తాడు.—2 కొరిం. 1:21, 22; 1 పేతు. 1:3, 4.

సరైన అభిప్రాయం

14. పరలోక పిలుపుకు సంబంధించి అభిషిక్త క్రైస్తవులు దేన్ని మనసులో ఉంచుకోవాలి?

14 పరలోక బహుమానాన్ని పొందడానికి వేచివున్న సమయంలో ఈ అభిషిక్తులు దేన్ని మనసులో ఉంచుకోవాలి? తమకు అద్భుతమైన పిలుపు వచ్చినా అది కేవలం ఆహ్వానం మాత్రమేనని గుర్తుంచుకుంటారు. ఆ బహుమానాన్ని పొందాలంటే వారు మరణించేంత వరకూ నమ్మకంగా ఉండాలి. వినయంతో వారు పౌలు చెప్పిన మాటలతో ఏకీభవిస్తారు. ఆయన, “సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను” అని అన్నాడు. (ఫిలి. 3:13, 14) అభిషిక్త శేషం “భయముతోను వణకుతోను” తాము ‘పిలువబడిన పిలుపునకు తగినట్లుగా సంపూర్ణవినయముతో నడుచుకోవడానికి’ శాయశక్తులా కృషిచేయాలి.—ఎఫె. 4:1-3; ఫిలి. 2:12; 1 థెస్స. 2:12.

15. జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన చిహ్నాలను తీసుకునే వారిని ఇతర క్రైస్తవులు ఎలా చూడాలి? తమ గురించి అభిషిక్త క్రైస్తవులు ఏమి అనుకోకూడదు?

15 అలాగైతే, తమకు ఈ పిలుపు వచ్చిందని చెప్పుకుని జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన చిహ్నాలను తీసుకునే వారిని ఇతర క్రైస్తవులు ఎలా చూడాలి? వారికి తీర్పుతీర్చకూడదు. అది ఆ వ్యక్తికి, యెహోవాకు మధ్యవున్న విషయం. (రోమా. 14:11, 12) అయితే నిజంగా అభిషేకించబడిన క్రైస్తవులు తమను ఇతరులు ప్రత్యేకంగా చూడాలని కోరుకోరు. తాము అభిషిక్తులం కాబట్టి “గొప్పసమూహం”లోని అనుభవజ్ఞులైన కొంతమందికన్నా తమకే ఎక్కువ విషయాలు తెలుస్తాయని అనుకోరు. (ప్రక. 7:9) తమ సహచరులైన ‘వేరే గొర్రెలకన్నా’ ఖచ్చితంగా తమకే ఎక్కువ పరిశుద్ధాత్మ సహాయం ఉంటుందని వారు అనుకోరు. (యోహా. 10:16) వారిని ప్రజలు ప్రత్యేకంగా చూడాలని కోరుకోరు. చిహ్నాల్లో పాలుపంచుకుంటున్నాం కాబట్టి సంఘంలోని నియమిత పెద్దలకన్నా తాము గొప్పవారమని అనుకోరు.

16-18. (ఎ) అభిషిక్త క్రైస్తవులందరూ ఒకరినొకరు సంప్రదించుకొని బైబిలు అవగాహనలో వచ్చిన మార్పులను తెలియజేస్తారా? వివరించండి. (బి) జ్ఞాపకార్థ చిహ్నాలు తీసుకునే వారందరినీ సంప్రదించాల్సిన అవసరం పరిపాలక సభకు ఎందుకు లేదు?

16 ప్రపంచవ్యాప్తంగావున్న ఈ అభిషిక్త క్రైస్తవులందరూ ఒకరినొకరు సంప్రదించుకొని బైబిలు అవగాహనలో వచ్చిన మార్పులను తెలియజేస్తున్నారా? లేదు. క్రీస్తు ఆత్మాభిషిక్త అనుచరులకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే బాధ్యత దాసుని తరగతిలోని వారందరికీ ఉన్నా దానిలోవున్న వారందరికీ ఒకే విధమైన బాధ్యత లేక పని అప్పగించబడదు. (1 కొరింథీయులు 12:14-18 చదవండి.) ముందు పేరాల్లో చూసినట్లు మొదటి శతాబ్దంలోని వారంతా ప్రాముఖ్యమైన ప్రకటనా పనిని చేశారు. కానీ బైబిలు పుస్తకాలను రాయడానికీ క్రైస్తవ సంఘాలను పర్యవేక్షించడానికీ కేవలం కొద్దిమంది మాత్రమే ఉపయోగించబడ్డారు.

17 ఉదాహరణకు, కొన్నిసార్లు “సంఘమే” న్యాయపరమైన చర్య తీసుకున్నట్లు బైబిలు చెబుతోంది. (మత్త. 18:17) అయితే, నిజం చెప్పాలంటే సంఘానికి ప్రతినిధులుగా సంఘ పెద్దలే ఆ చర్య తీసుకుంటారు. వారు ఆ నిర్ణయం తీసుకోవడానికి సంఘంలోని అందరి అభిప్రాయాన్ని సేకరించరు. దైవపరిపాలనా సంబంధమైన తమ బాధ్యతలను నిర్వర్తించి సంఘమంతటి తరఫున వారు పనిచేస్తారు.

18 అదే విధంగా, నేడు కూడా అభిషిక్త సహోదరుల్లోని కొద్దిమందికి మాత్రమే అంటే యెహోవాసాక్షుల పరిపాలక సభలోని సభ్యులకు మాత్రమే దాసుని తరగతికి ప్రాతినిధ్యం వహించే బాధ్యతవుంది. ఈ ఆత్మాభిషిక్త సహోదరులు ప్రకటనా పనినీ ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే పనినీ పర్యవేక్షిస్తారు. మొదటి శతాబ్దపు పరిపాలక సభలాగే వారు నిర్ణయాలు తీసుకునే ముందు దాసుని తరగతిలోని ప్రతీ ఒక్కరినీ సంప్రదించరు. (అపొస్తలుల కార్యములు 16:4, 5 చదవండి.) ఏదేమైనా, అభిషిక్త సాక్షులందరూ ఇప్పుడు జరుగుతున్న ప్రాముఖ్యమైన కోతపనిలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఒక తరగతిగా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ఒకే శరీరంలోని అవయవాల్లాంటి వారే అయినా వారిలో ప్రతీ ఒక్కరూ వేర్వేరు పనులు చేస్తారు.—1 కొరిం. 12:19-26.

19, 20. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” విషయంలో, అతని పరిపాలక సభ విషయంలో గొప్ప సమూహంలోని సభ్యులకు ఎలాంటి అభిప్రాయం ఉండాలి? ఎలాంటి అభిప్రాయం ఉండకూడదు?

19 భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణవున్న గొప్పసమూహం రోజురోజుకీ పెరుగుతుంది. ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని వారు ఏమి చేయాలి? రాజు ఆస్తిలో భాగంగావున్న ఈ గొప్ప సమూహపువారు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” తరగతికి ప్రాతినిధ్యం వహించే పరిపాలక సభ చేసే ఏర్పాట్లన్నింటికి సంతోషంగా సహకరిస్తున్నారు. పరిపాలక సభ నిర్దేశంలో సిద్ధం చేయబడిన ఆధ్యాత్మిక ఆహారానికి గొప్ప సమూహపువారు ఎంతో విలువిస్తారు. ఒక గుంపుగా దాసుని తరగతిని వారు గౌరవిస్తారు. అదే సమయంలో ఆ దాసుని తరగతివారమని చెప్పుకుంటున్నవారికి ప్రత్యేక గౌరవం ఇవ్వకుండా జాగ్రత్తపడతారు. దేవుని పరిశుద్ధాత్మతో నిజంగా అభిషేకించబడిన ఏ క్రైస్తవుడూ అలాంటి గౌరవాన్ని కోరుకోడు లేక ఆశించడు.—అపొ. 10:25, 26; 14:14, 15.

20 మనం అభిషిక్త శేషానికి చెందిన ‘ఇంటివారమైనా,’ లేక గొప్ప సమూహంలోని సభ్యులమైనా నమ్మకమైన గృహనిర్వాహకుడు అతని పరిపాలక సభతో పూర్తిగా సహకరించాలనే కృతనిశ్చయంతో ఉందాం. మనలో ప్రతీ ఒక్కరం “మెలకువగా” ఉంటూ అంతం వరకూ నమ్మకంగా ఉందాం.—మత్త. 24:13, 42.

మీకు గుర్తున్నాయా?

• ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ ఎవరు? ఇంటివారు ఎవరు?

• తనకు పరలోక పిలుపు ఉందో లేదో ఒక వ్యక్తికి ఎలా తెలుస్తుంది?

• తాజా ఆధ్యాత్మిక ఆహారాన్ని సిద్ధంచేసే బాధ్యత ప్రాముఖ్యంగా ఎవరిది?

• ఒక అభిషిక్త క్రైస్తవునికి తన గురించి ఎలాంటి అభిప్రాయం ఉండాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[23వ పేజీలోని చిత్రం]

నేడు పరిపాలక సభ నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మొదటి శతాబ్దంలో కూడా అలాంటి ఏర్పాటే ఉండేది