కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

• తల్లి గర్భంలోనే చనిపోయిన బిడ్డ పునరుత్థానం అయ్యే అవకాశం ఉందా?

గర్భధారణ సమయంలోనే జీవం ప్రారంభమౌతుంది. “దేవునికి సమస్తమును సాధ్యమే” కాబట్టి ఒక వ్యక్తి ఏ దశలో ఉన్నప్పటికీ యెహోవా పునరుత్థానం చేయగలడు. (మార్కు 10:27) కానీ గర్భంలోనే చనిపోయిన పిల్లలు పునరుత్థానం చేయబడతారో లేదో బైబిలు సూటిగా చెప్పడం లేదు.—4/15, 12-13 పేజీలు.

• చీమలను, చిన్న కుందేలును, మిడతలను, గెకో బల్లిని చూసి మనం ఏమి నేర్చుకోవచ్చు?

ఈ నాలుగు జీవులు సహజసిద్ధమైన జ్ఞానానికి ఉదాహరణలు. కాబట్టే, అవి దేవుని జ్ఞానాన్ని చాటుతున్నాయి. (సామె. 30:24-28)—4/15, 16-19 పేజీలు.

• మౌనంగా ఉండడం మంచిదని బైబిలు ఎందుకు చెబుతుంది?

మౌనము గౌరవానికి గుర్తుగా, ధ్యానానికి సహాయకంగా, జ్ఞాన వివేచనలకు నిదర్శనంగా ఉంటుంది. (కీర్త. 37:7; 63:6; సామె. 11:12)—5/15, 3-5 పేజీలు.

• ఎంతమంది యూదా రాజులు సత్యారాధనపట్ల ఎంతో ఆసక్తి చూపించారు?

దక్షిణ రాజ్యమైన యూదాను 19 రాజులు పరిపాలించారు. వారిలో నలుగురు రాజులు అంటే ఆసా, యెహోషాపాతు, హిజ్కియా, యోషీయాలు సత్యారాధనపట్ల ఎంతో ఆసక్తిని చూపించారు.—6/15, 7-11 పేజీలు.

• ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే పనిలో ఈ భూమ్మీదున్న అభిషిక్త క్రైస్తవులందరూ పాలుపంచుకుంటారా?

లేదు. దేవుని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారందరూ నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతిలో భాగంగా ఉంటారు. కానీ పరిపాలక సభ సభ్యులు మాత్రమే ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే పనిని పర్యవేక్షిస్తారు.—6/15, 22-24 పేజీలు.

• యేసు బోధనాపద్ధతికీ మతనాయకుల బోధనాపద్ధతికీ మధ్యనున్న తేడా ప్రేమేనని ఎలా చెప్పొచ్చు?

యూదా మతనాయకులు సామాన్య ప్రజలను ప్రేమించే బదులు వారిని చిన్నచూపు చూశారు. అంతేకాక వారు దేవుణ్ణి ప్రేమించలేదు. యేసు తన తండ్రిని ప్రేమించాడు, ప్రజల మీద కనికరపడ్డాడు. (మత్త. 9:36) యేసు వారిపట్ల ఆప్యాయత, ప్రేమ, దయ వంటి లక్షణాలను చూపించాడు.—7/15, 15వ పేజీ.