కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రపంచాన్ని మార్చిన వ్యక్తి

ప్రపంచాన్ని మార్చిన వ్యక్తి

ప్రపంచాన్ని మార్చిన వ్యక్తి

కోట్లాదిమంది ప్రజలు ఈ భూమ్మీద జీవించారు, చనిపోయారు. వీళ్లలో చాలామంది చరిత్రలో తమ పేర్లు నిలిచిపోయే గొప్ప పనులేమీ చేయలేదు. కొందరు మాత్రం చరిత్ర గమనాన్నే మార్చేశారు, మన రోజువారీ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారు.

సాధారణంగా మీరు ఉదయాన్నే నిద్రలేచి పనికి వెళ్లడానికి సిద్ధమవుతారు. తయారయేటప్పుడు లైట్లు వేసుకుంటారు. బస్సులో చదువుకోవడానికి ఏదోక పుస్తకం తీసుకుంటారు. నలతగా ఉంటే డాక్టరు రాసిచ్చిన ఆంటీబయోటిక్స్‌ గుర్తుపెట్టుకుని తీసుకుంటారు. అలా రోజు మొదలయ్యీ కాకముందే, కొంతమంది గొప్పవాళ్లు సాధించిన వాటివల్ల మీరు ప్రయోజనం పొందారు.

మైఖేల్‌ ఫారడే: 1791లో ఇంగ్లాండులో పుట్టిన ఈ భౌతిక శాస్త్రవేత్త విద్యుత్‌ మోటారును, డైనమోను (యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే యంత్రం) కనుక్కున్నాడు. ఆయన కనుక్కున్న వాటివల్ల ప్రజలు విద్యుచ్ఛక్తిని మరింత ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఏర్పడింది.

ట్సై లూన్‌: చైనా చక్రవర్తి సభలో అధికారిగా ఉన్న ఈయన దాదాపు సా.శ. 105లో కాగితాన్ని తయారుచేసే విధానాన్ని కనుగొన్నాడు. దానివల్ల పెద్దమొత్తంలో కాగితాన్ని తయారుచేయడం సాధ్యపడింది.

జొహన్నస్‌ గూటెన్‌బర్గ్‌: దాదాపు 1450లో ఈ జర్మనీ దేశస్థుడు మొదటి మూవబుల్‌ రకం ముద్రణా యంత్రాన్ని తయారుచేశాడు. ఈ యంత్రంవల్ల ఎక్కువ ఖర్చు లేకుండా ముద్రించడం సాధ్యమయింది. దాంతో చాలా విషయాల గురించి ఎంతో సమాచారాన్ని చాలా ఎక్కువమంది చదివి తెలుసుకునే అవకాశం ఏర్పడింది.

అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌: స్కాట్లాండ్‌ దేశస్థుడైన ఈ పరిశోధకుడు 1928లో ఒక ఆంటీబయోటిక్‌ (క్రిమినాశక పదార్థం) కనుగొని దానికి పెన్సిలిన్‌ అని పేరు పెట్టాడు. ఇప్పుడు సూక్ష్మక్రిములు సోకకుండా జాగ్రత్త తీసుకోవడానికి ఆంటీబయోటిక్స్‌ విరివిగా ఉపయోగిస్తున్నారు.

కొంతమంది కనుగొన్న వాటివల్ల కోట్లాదిమంది ప్రయోజనం పొందుతున్నారు లేదా మెరుగైన ఆరోగ్యంతో ఉండగలుగుతున్నారు.

అయితే, వీళ్లందరికీ భిన్నమైన వ్యక్తి ఒకరున్నారు. ఆయన వైజ్ఞానికంగా లేదా వైద్యపరంగా ఎలాంటి కొత్త విషయాలు కనిపెట్టలేదు. కానీ సామాన్య కుటుంబంలో పుట్టి, దాదాపు 2,000 సంవత్సరాల క్రితం చనిపోయిన ఈ వ్యక్తి భవిష్యత్తు మీద ఆశను, ఓదార్పును కలిగించే ఒక శక్తివంతమైన సందేశాన్ని ప్రకటించాడు. మిగతావారితో పోలిస్తే ఆయనిచ్చిన సందేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల జీవితాలను ఎంతగానో మార్చేసింది. దీన్నిబట్టి, ప్రపంచాన్ని మార్చిన వ్యక్తి నిజంగా ఈయనే అని చాలామంది ఒప్పుకుంటారు.

ఆయనే యేసుక్రీస్తు. ఆయన ఏ సందేశాన్ని ప్రకటించాడు? ఆ సందేశం మీ జీవితాన్ని ఎలా మార్చగలదు? (w10-E 04/01)