కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసుక్రీస్తు ఆయన సందేశం ఎంతవరకు వ్యాపించింది?

యేసుక్రీస్తు ఆయన సందేశం ఎంతవరకు వ్యాపించింది?

యేసుక్రీస్తు ఆయన సందేశం ఎంతవరకు వ్యాపించింది?

“కపెర్నహూముకు చెందిన జ్ఞాని (యేసుక్రీస్తు) ఈ భూమ్మీద జీవించాడని చెప్పడానికి అన్నిటికన్నా గొప్ప రుజువు ఏమిటంటే, ఆయన ప్రజల హృదయాలను, మనస్సులను ఇప్పటికీ సున్నితంగా కట్టిపడేయగల్గుతున్నాడు.” a—గ్రెగ్‌ ఈస్టర్‌బ్రుక్‌, రచయిత.

మాటలకు శక్తివుంది. జ్ఞానంతో చక్కగా ఎంపిక చేసుకున్న మాటలు హృదయాలను కదిలిస్తాయి, భవిష్యత్తు మీద ఆశను చిగురింపజేస్తాయి, జీవితాలను మారుస్తాయి. యేసుక్రీస్తు మాటలు చూపించినంత ప్రభావం ఎవ్వరి మాటలూ ఎప్పుడూ చూపించలేదు. యేసు ఇచ్చిన ఒక సుప్రసిద్ధ ప్రసంగాన్ని విన్నవాళ్లలో ఒకరు ఇలా రాశారు: ‘యేసు ఈ మాటలు చెప్పి ముగించిన తర్వాత జనసమూహాలు ఆయన బోధకు ఆశ్చర్యపోయారు.’—మత్తయి 7:28.

నేటి వరకూ యేసు చెప్పిన మాటలు ప్రపంచమంతటా ఉన్న చాలామందికి సుపరిచితమే. ఆయన చెప్పినవాటిలో ఎంతో అర్థమున్న కొన్ని వాక్యాలను పరిశీలించండి.

‘మీరు దేవునికీ, సిరికీ దాసులుగా ఉండలేరు.’—మత్తయి 6:24.

‘మనుష్యులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో మీరూ వారికి అలాగే చేయండి.’—మత్తయి 7:12.

‘చక్రవర్తికి చెందింది చక్రవర్తికి ఇవ్వండి. దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి.’—మత్తయి 22:21, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

‘తీసుకోవడం కంటే ఇవ్వడమే ధన్యం.’—అపొస్తలుల కార్యములు 20:35, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

యేసు గుర్తుంచుకోదగ్గ మాటల్ని మాత్రమే చెప్పలేదు. ఆయన ప్రకటించిన సందేశం ఎంతో శక్తివంతమైనది. ఎందుకంటే అది దేవుని గురించి సత్యాన్ని తెలియజేసింది, జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో బోధించింది, మానవుల బాధలన్నిటినీ దేవుని రాజ్యం మాత్రమే తీసివేయగలదని స్పష్టంగా చూపించింది. తర్వాతి పేజీల్లో మనం ఈ సందేశాన్ని పరిశీలిస్తున్నప్పుడు, యేసు “ప్రజల హృదయాలను, మనస్సులను ఇప్పటికీ సున్నితంగా” ఎందుకు కట్టిపడేయగల్గుతున్నాడో మనకు అర్థమౌతుంది. (w10-E 04/01)

[అధస్సూచి]

a గలిలయ ప్రాంతంలోవున్న కపెర్నహూము యేసు సొంత ఊరుగా పరిగణించబడింది.—మార్కు 2:1, 2.