కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

‘విజయోత్సవంతో ఊరేగించడం’ గురించి మాట్లాడినప్పుడు పౌలు మనసులో ఏమి ఉంది?

పౌలు ఇలా రాశాడు: “మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును . . . విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము. నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము.”—2 కొరిం. 2:14-16.

సైనిక అధికారి శత్రువులపై సాధించిన విజయానికి ఆయనను ఘనపరుస్తూ ఊరేగించే ఆచారం రోమన్లకు ఉండేది. అపొస్తలుడైన పౌలు దాని గురించే మాట్లాడాడు. అలాంటి సందర్భాల్లో, వారు యుద్ధంలో గెలుచుకున్న దోపుడు సొమ్మును, యుద్ధ ఖైదీలను అందరికీ చూపించేవారు. అంతేకాక గెలిచిన అధికారిని, అతని సైన్యాన్ని ప్రజలు అభినందించేవారు. ఆ సమయంలో ఎడ్లను కూడా తీసుకెళ్లేవారు. ఊరేగింపు అయిపోయిన తర్వాత ఎడ్లను బలి అర్పించేవారు, బహుశా యుద్ధ ఖైదీలను కూడా చంపేసేవారు.

కొందరికి రక్షణను, మరికొందరికి నాశనాన్ని సూచించే “క్రీస్తు సువాసన” అనే రూపకాలంకారం, “ఊరేగిస్తున్న సమయంలో ధూపం వేసే రోమన్ల ఆచారం నుండి వచ్చివుంటుంది. గెలిచినవారి విజయానికి గుర్తుగా ఉండే ఆ ధూపపు సువాసన, చెరపట్టబడిన ఖైదీలకు బహుశా తాము చంపబడతామనే విషయాన్ని గుర్తుచేసేది” అని ది ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ బైబిల్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. (w10-E 08/01)

[28వ పేజీలోని చిత్రం]

సా.శ. 2వ శతాబ్దంలో చెక్కబడిన శిల్ప ఖండంలోని ఈ భాగం రోమన్ల విజయోత్సవపు ఊరేగింపును చూపిస్తోంది

[క్రెడిట్‌ లైను]

Photograph taken by courtesy of the British Museum