కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంవత్సరంలో అత్యంత ప్రాముఖ్యమైన రోజు కోసం మీరు సిద్ధపడ్డారా?

సంవత్సరంలో అత్యంత ప్రాముఖ్యమైన రోజు కోసం మీరు సిద్ధపడ్డారా?

సంవత్సరంలో అత్యంత ప్రాముఖ్యమైన రోజు కోసం మీరు సిద్ధపడ్డారా?

యేసు చనిపోవడానికి కేవలం కొన్ని గంటల ముందు, శిష్యులు తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. ఈ ఆచరణనే “ప్రభువు రాత్రి భోజనము” అంటారు. (1 కొరింథీయులు 11:20) అదెంత ప్రాముఖ్యమైనదో తెలియజేస్తూ యేసు ఇలా ఆజ్ఞాపించాడు: ‘నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి.’ (లూకా 22:19) మీరు మీ జీవితంలో యేసు చెప్పింది చేయాలనుకుంటున్నారా? అలాగైతే, యేసు చనిపోయిన రోజును మీరు సంవత్సరంలో అత్యంత ప్రాముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు.

అయితే, దీన్ని ఖచ్చితంగా ఎప్పుడు జరుపుకోవాలి? ఆ రోజుకున్న ప్రాముఖ్యతను అర్థంచేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామని ఎలా చూపించవచ్చు? ఈ ప్రశ్నల గురించి ప్రతీ క్రైస్తవుడు జాగ్రత్తగా ఆలోచించాలి.

ఎంత తరచుగా ఆచరించాలి?

ప్రాముఖ్యమైన సంఘటనలను మనం సాధారణంగా సంవత్సరానికి ఒక్కసారే గుర్తుచేసుకుంటాం. ఉదాహరణకు, 2001 సెప్టెంబరు 11న వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ మీద జరిగిన దాడిలో తమ ప్రియమైన వాళ్లను పోగొట్టుకున్న చాలామంది అమెరికన్ల మదిలో ఆ విషాద సంఘటనలు ఎప్పుడూ మెదులుతూ ఉంటాయి. అయినా, ప్రతీ సంవత్సరం ఆ తారీఖు వాళ్ల దృష్టిలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.

అదే విధంగా, బైబిలు కాలాల్లో కూడా ముఖ్యమైన సంఘటనలను సంవత్సరానికి ఒకసారి గుర్తుచేసుకునేవారు. (ఎస్తేరు 9:21, 27) ఐగుప్తు బానిసత్వం నుండి అద్భుతంగా విడిపించిన దానికి గుర్తుగా ప్రతీ సంవత్సరం పండుగ జరుపుకోమని యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు. బైబిలు దాన్ని పస్కా అంటోంది. ఇశ్రాయేలీయులు సంవత్సరానికి ఒక్కసారే దాన్ని ఆచరించేవారు, అదీ వాళ్లు ఐగుప్తు బానిసత్వం నుండి ఏ తేదీన విడిపించబడ్డారో ఆ తేదీననే ఆచరించేవారు.—నిర్గమకాండము 12:24-27; 13:10.

యేసు తన అపొస్తలులతో కలిసి పస్కాను ఆచరించిన వెంటనే తన మరణాన్ని ఎలా జ్ఞాపకం చేసుకోవాలో చూపించడానికి ఈ ప్రత్యేకమైన ఆచరణను పరిచయం చేశాడు. (లూకా 22:7-20) పస్కాను సంవత్సరానికి ఒక్కసారే ఆచరించేవారు. అందుకే పస్కాకు బదులు జరుపుకునే ఈ కొత్త ఆచరణను కూడా సంవత్సరానికి ఒక్కసారే ఆచరించాలి. అయితే ఏ తేదీన?

ఎప్పుడు ఆచరించాలి?

ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడానికి మనం రెండు విషయాలు అర్థంచేసుకోవాలి. మొదటిగా, బైబిలు కాలాల్లో రోజు, సూర్యాస్తమయంతో మొదలై మరుసటి రోజు సూర్యాస్తమయానికి ముగిసేది. అలా సాయంకాలం నుండి సాయంకాలం వరకు ఒక రోజుగా లెక్కించేవారు.—లేవీయకాండము 23:32.

రెండవదిగా, బైబిల్లో వాడిన క్యాలెండరు మనం వాడే క్యాలెండరు ఒకటి కాదు. మార్చి, ఏప్రిల్‌ వంటి నెలల గురించి కాకుండా అదారు, నీసాను వంటి నెలల గురించి బైబిలు మాట్లాడుతోంది. (ఎస్తేరు 3:7) యూదులు, అమావాస్య నుండి అమావాస్య వరకు ఒక నెలగా లెక్కించేవారు. వాళ్ల క్యాలెండరులో మొదటి నెల నీసాను. ఆ నెల 14వ తేదీన వాళ్లు పస్కాను ఆచరించేవారు. (లేవీయకాండము 23:5; సంఖ్యాకాండము 28:16) సరిగ్గా అదే రోజున అంటే నీసాను 14న మన ప్రభువైన యేసుక్రీస్తును రోమీయులు మ్రానుమీద వేలాడదీశారు. ఇశ్రాయేలీయులు మొదటి పస్కాను ఆచరించిన 1,545 సంవత్సరాలకు యేసు చనిపోయాడు. నీసాను 14వ తేదీ ఎంత ప్రాముఖ్యమైనదో కదా!

అయితే మన క్యాలెండరు ప్రకారం నీసాను 14 ఎప్పుడొస్తుంది? చిన్న లెక్క వేస్తే అసలైన తారీఖును తెలుసుకోవచ్చు. మార్చి నెలలోని మొదటి వారం తర్వాత కొన్ని రోజులకు వచ్చే అమావాస్య రోజున (ఉత్తరార్థ గోళంలో వసంత రుతువు ప్రారంభం) నీసాను నెల మొదలౌతుంది. అప్పటినుండి పధ్నాలుగు రోజులు లెక్కిస్తే నీసాను 14 వస్తుంది. ఈ తేదీ సాధారణంగా పౌర్ణమి రోజు వస్తుంది. దీన్నిబట్టి, నీసాను 14 ఈ సంవత్సరం ఏప్రిల్‌ 5 గురువారం సూర్యాస్తమయం తర్వాత మొదలౌతుంది.

ఈ సంవత్సరం, యెహోవాసాక్షులతో పాటు ఆసక్తి ఉన్న వాళ్లంతా యేసు మరణ జ్ఞాపకార్థానికి హాజరవ్వడానికి సిద్ధమౌతున్నారు. తమతోపాటు హాజరవ్వమని వాళ్లు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అది జరిగే సమయం, స్థలం తెలుసుకోవడానికి దయచేసి మీ ప్రాంతంలోవున్న యెహోవాసాక్షులను సంప్రదించండి. వాళ్లు ఈ ఆచరణను ఉదయమో మధ్యాహ్నమో కాదుగానీ సూర్యాస్తమయం తర్వాతే జరుపుకుంటారు. ఎందుకని? ఎందుకంటే, బైబిలు చెబుతున్నట్లు ఇది, “రాత్రి భోజనము.” (1 కొరింథీయులు 11:20) 1,979 సంవత్సరాల క్రితం యేసు మొదలుపెట్టిన ప్రత్యేక ఆచరణకు, 2012 ఏప్రిల్‌ 5 గురువారం సూర్యాస్తమయం తర్వాత జరిగే ఆచరణ ‘వార్షిక ఆచరణ.’ అప్పుడే నీసాను 14 అంటే యేసు చనిపోయిన రోజు మొదలౌతుంది. ఆయన మరణాన్ని గుర్తుచేసుకోవడానికి ఇంతకన్నా తగిన రోజు ఇంకొకటి ఉంటుందా?

ఎలా సిద్ధపడాలి?

సంవత్సరానికి ఒక్కసారే వచ్చే ఈ ఆచరణకు ఇప్పటినుండే మనమెలా సిద్ధపడవచ్చు? యేసు మనకోసం చేసినవాటి గురించి ధ్యానించండి. యేసు ఎందుకు చనిపోయాడో తెలుసుకుని దానిపట్ల కృతజ్ఞతను పెంచుకోవడానికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? a పుస్తకం లక్షలాదిమందికి సహాయం చేసింది.—మత్తయి 20:28.

యేసు భూమ్మీద జీవించిన చివరి రోజుల్లో జరిగిన సంఘటనల గురించి చదవడం ద్వారా కూడా ఈ ప్రత్యేక ఆచరణ కోసం మన మనసులను సిద్ధంచేసుకోవచ్చు. తర్వాతి పేజీల్లో ఒక చార్టు ఉంది. యేసు చనిపోవడానికి ముందు జరిగిన సంఘటనలకు సంబంధించిన బైబిలు లేఖనాలు కుడివైపు కాలమ్‌లో ఉన్నాయి. అంతేకాదు, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి b పుస్తకంలోని ఆ సంఘటనలను వివరించే అధ్యాయాలు కూడా దానిలో ఉన్నాయి.

ఆ సంఘటనలు జరిగిన రోజులు, ఈ సంవత్సరం ఏ తేదీల్లో వస్తాయో ఎడమవైపు కాలమ్‌లో ఉంది. ప్రభువు రాత్రి భోజన ఆచరణ వచ్చేంతవరకు ఆయా రోజుల్లో ఏయే సంఘటనలు జరిగాయో తెలుసుకోవడానికి ప్రతీరోజు కొన్ని లేఖనాలనైనా చదవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు సంవత్సరంలో అత్యంత ప్రాముఖ్యమైన రోజు కోసం సిద్ధంగా ఉంటారు. (w11-E 02/01)

[అధస్సూచీలు]

a దీనిని యెహోవాసాక్షులు ప్రచురించారు. ఈ పుస్తకంలోని 47-56, 206-208 పేజీలు చూడండి. దీన్ని మీరు www.watchtower.org వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

b దీనిని యెహోవాసాక్షులు ప్రచురించారు.

[20వ పేజీలోని బ్లర్బ్‌]

యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి 2012, ఏప్రిల్‌ 5, గురువారం

[21, 22 పేజీల్లోని చార్టు/చిత్రాలు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

చివరి వారం

2012 శని. మార్చి 31

సబ్బాతు

యోహాను 11:55–12:1

gt 101, 2-4 పేరాలు c

నీసాను 9 ( ర్యాస్తమయంతో మొదలౌతుంది)

బైబిలు కాలాల్లో రోజు, సూర్యాస్తమయంతో మొదలై మరుసటి రోజు సూర్యాస్తమయంతో ముగిసేది

కుష్ఠరోగి అయిన సీమోనుతో విందు

మరియ అత్తరుతో అభిషేకించింది

యూదులు యేసును, లూకా లాజరును కలవడానికి వచ్చారు

మత్తయి 26:6-13

మార్కు 14:3-9

యోహాను 12:2-11

gt 101, 5-9 పేరాలు

2012 ఆది. ఏప్రిల్‌ 1

▪ విజయోత్సాహంతో యెరూషలేములోకి వచ్చాడు

ఆలయంలో బోధించాడు

మత్తయి 21:1-11, 14-17

మార్కు 11:1-11

లూకా 19:29-44

యోహాను 12:12-19

gt 102

నీసాను 10 (సూర్యాస్తమయంతో మొదలౌతుంది)

తనియలో రాత్రి

2012 సోమ. ఏప్రిల్‌ 2

▪ ఉదయాన్నే యెరూషలేముకు వెళ్లాడు

▪ ఆలయంలో క్రయవిక్రయాలు చేస్తున్న వాళ్లను వెళ్లగొట్టాడు

▪ పరలోకం నుండి యెహోవా మాట్లాడాడు

మత్తయి 21:12, 13, 18, 19

మార్కు 11:12-19

లూకా 19:45-48

యోహాను 12:20-50

gt 103, 104

నీసాను 11 (సూర్యాస్తమయంతో మొదలౌతుంది)

2012 మంగళ. ఏప్రిల్‌ 3

▪ దేవాలయంలో ఉపమానాలతో బోధించాడు

▪ పరిసయ్యులను ఖండించాడు

▪ పేద విధవరాలు కానుక వేయడం గమనించాడు

▪ యెరూషలేము నాశనమౌతుందని ప్రవచించాడు

▪ తన ప్రత్యక్షత గురించి సూచన ఇచ్చాడు

మత్తయి 21:19–25:46

మార్కు 11:20–13:37

లూకా 20:1–21:38

gt 105 నుండి 112, 1వ పేరా

నీసాను 12 ( ర్యాస్తమయంతో మొదలౌతుంది)

2012 బుధ. ఏప్రిల్‌ 4

 తనియలో శిష్యులతో ప్రశాంతంగా రోజు గడిపాడు

▪ ఆయన్ని అప్పగించడానికి యూదా పన్నాగం పన్నాడు

మత్తయి 26:1-5, 14-16

మార్కు 14:1, 2, 10, 11

లూకా 22:1-6

gt 112, 2-4 పేరాలు

నీసాను 13 (సూర్యాస్తమయంతో మొదలౌతుంది)

2012 గురు. ఏప్రిల్‌ 5

▪ పేతురు, యోహాను పస్కా సిద్ధం చేశారు

▪ ఆ సాయంకాలం యేసు, మిగతా 10 మంది అపొస్తలులు కూడా వెళ్లారు

మత్తయి 26:17-19

మార్కు 14:12-16

లూకా 22:7-13

gt 112, 5వ పేరా నుండి 113, 1వ పేరా

నీసాను 14 (సూర్యాస్తమయంతో మొదలౌతుంది)

 స్కాను ఆచరించాడు

▪ అపొస్తలుల పాదాలు కడిగాడు

▪ యూదాను బయటకు పంపించేశాడు

▪ తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను మొదలుపెట్టాడు

మత్తయి 26:20-35

మార్కు 14:17-31

లూకా 22:14-38

యోహాను 13:1–17:26

gt 113, 2వ పేరా నుండి 116 చివరి వరకు

అర్థరాత్రి

2012 శుక్ర. ఏప్రిల్‌ 6

▪ గెత్సేమనే తోటలో అప్పగించబడి, బంధించబడ్డాడు

▪ అపొస్తలులు పారిపోయారు

▪ మహా సభ ఆయనను విచారించింది

▪ పేతురు యేసును ఎరుగనన్నాడు

మత్తయి 26:36-75

మార్కు 14:32-72

లూకా 22:39-62

యోహాను 18:1-27

gt 117 నుండి 120 చివరి వరకు

▪ మరోసారి మహా సభ ముందు నిలబడ్డాడు

▪ పిలాతు దగ్గరకు, తర్వాత హేరోదు దగ్గరకు, మళ్లీ పిలాతు దగ్గరకు తీసుకువెళ్లారు

▪ మరణశిక్ష వేసి మ్రాను మీద వేలాడదీశారు

▪ మధ్యాహ్నం దాదాపు 3 గంటల ప్రాంతంలో చనిపోయాడు

▪ శరీరాన్ని కిందకు దించి సమాధి చేశారు

మత్తయి 27:1-61

మార్కు 15:1-47

లూకా 22:63–23:56

యోహాను 18:28-40

gt 121 నుండి 127, 7వ పేరా

నీసాను 15 (సూర్యాస్తమయంతో మొదలౌతుంది)

▪ సబ్బాతు

2012 శని. ఏప్రిల్‌ 7

▪ యేసు సమాధి దగ్గర కాపలా పెట్టడానికి పిలాతు అంగీకరించాడు

మత్తయి 27:62-66

gt 127, 8-9 పేరాలు

నీసాను 16 (సూర్యాస్తమయంతో మొదలౌతుంది)

2012 ఆది. ఏప్రిల్‌ 8

▪ పునరుత్థానం అయ్యాడు

▪ శిష్యులకు కనిపించాడు

మత్తయి 28:1-15

మార్కు 16:1-8

లూకా 24:1-49

యోహాను 20:1-25

gt 127, 10వ పేరా నుండి 129, 10వ పేరా

[అధస్సూచి]

c ఇవి, జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి (gt) పుస్తకంలోని అధ్యాయాల నంబర్లు. యేసు తుది పరిచర్యకు సంబంధించిన మరిన్ని లేఖనాల కోసం, ‘ప్రతీ లేఖనం దైవావేశం వల్ల కలిగినది, ప్రయోజనకరమైనది’ (ఆంగ్లం) పుస్తకంలోని 290వ పేజీలోవున్న చార్టు చూడండి. ఈ పుస్తకాన్ని యెహోవాసాక్షులు ప్రచురించారు.