కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేస్తుక్రీస్తు నిజంగా ఎవరు?

యేస్తుక్రీస్తు నిజంగా ఎవరు?

‘ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా—ఈయన ఎవరో అని కలవరపడింది. జనసమూహం—ఈయన గలిలయలోని నజరేతుకు చెందిన, ప్రవక్త అయిన యేసు అని చెప్పారు.’ —మత్తయి 21:10, 11.

యేసుక్రీస్తు a క్రీ.శ. 33వ సంవత్సరం వసంత రుతువులో ఒకరోజు యెరూషలేముకు వచ్చినప్పుడు ప్రజల్లో ఎందుకంత కలవరం రేగింది? యేసు గురించి, ఆయన చేసిన అసాధారణమైన పనుల గురించి ఆ పట్టణంలో చాలామంది అప్పటికే విన్నారు. వాళ్లు ఆయన గురించి ఇతరులకు చెప్పారు. (యోహాను 12:17-19) అయితే, వాళ్ల మధ్యవున్న ఆ వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి మీద ప్రభావం చూపిస్తాడని, ఆ ప్రభావం ఎన్నో శతాబ్దాలు గడిచి మనకాలం వరకూ ఉంటుందని వాళ్లకు తెలీదు.

మానవ చరిత్ర మీద యేసు చూపించిన విస్తృత ప్రభావం గురించి తెలియజేసే కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

  • ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో సాధారణంగా వాడే క్యాలెండరు యేసు పుట్టాడని అనుకుంటున్న సంవత్సరం ఆధారంగా తయారుచేసినదే.

  • దాదాపు రెండు వందల కోట్లమంది అంటే ప్రపంచ జనాభాలో మూడోవంతు క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు.

  • ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల కన్నా ఎక్కువ సంఖ్యలోవున్న ముస్లింలు యేసు ఒక గొప్ప ప్రవక్త అంటారు.

  • యేసు చెప్పిన జ్ఞానవంతమైన చాలా మాటలు మన రోజువారీ సంభాషణల్లో వివిధ రకాలుగా కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని:

    మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి.మత్తయి 5:37.

    ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపించు.మత్తయి 5:39.

    ఒక మైలు రమ్మంటే రెండు మైళ్లు వెళ్లు.మత్తయి 5:41.

    ఎవరూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు.మత్తయి 6:24.

    మీ ముత్యాలను పందుల ముందు వేయకండి.మత్తయి 7:6.

    మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అదే వాళ్లకు చేయండి.మత్తయి 7:12.

యేసు మానవ చరిత్ర మీద ప్రభావం చూపించాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ప్రజలకు ఆయన విషయంలో ఎంతో భిన్నమైన అభిప్రాయాలు, నమ్మకాలు ఉన్నాయి. కాబట్టి, ‘యేసుక్రీస్తు నిజంగా ఎవరు?’ అని మీరు అనుకుంటుండవచ్చు. ఆయన ఎక్కడ నుండి వచ్చాడో, ఎలా జీవించాడో, ఎందుకు చనిపోయాడో బైబిలు మాత్రమే వివరిస్తుంది. ఆయన గురించి ఆ సత్యాలు తెలుసుకోవడం ఇప్పుడు, భవిష్యత్తులో మీ జీవితం మీద గొప్ప ప్రభావం చూపిస్తుంది. (w11-E 04/01)

a నజరేతుకు చెందిన ఈ ప్రవక్త పేరు “యేసు.” ఈ పేరుకు “యెహోవాయే రక్షణ” అని అర్థం. “క్రీస్తు” అనే పదానికి “అభిషిక్తుడు” అని అర్థం. ఈ పదం యేసును యెహోవా అభిషేకించాడని, లేదా ఒక ప్రత్యేకమైన పనికోసం నియమించాడని సూచిస్తుంది.