కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను చదివి ఆనందించారా? ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

• నిజ క్రైస్తవులు దేవుని పేరును తాయెత్తులా ఉపయోగిస్తారా?

కొంతమంది ఏదైనా వస్తువును లేదా చిహ్నాన్ని, తమను అద్భుతరీతిలో కాపాడే తాయెత్తులా భావిస్తారు. అయితే దేవుని ప్రజలు ఆయన పేరును తాయెత్తులా ఎంచరు. బదులుగా వారు యెహోవాపై నమ్మకముంచి, ఆయన చిత్తం చేయడానికి ప్రయత్నిస్తారు. అలా ఆయన నామాన్ని ఆశ్రయిస్తారు. (జెఫ. 3:12, 13)—1/15, 5-6 పేజీలు.

• సౌలు రాజును యెహోవా ఎందుకు తిరస్కరించాడు?

బలి అర్పించడానికి దేవుని ప్రవక్త వచ్చేంతవరకు సౌలు వేచివుండాలి. కానీ సౌలు తానే బలి అర్పించడం ద్వారా అవిధేయత చూపించాడు. తర్వాత, శత్రు జనాంగాన్ని తుడిచిపెట్టమని యెహోవా ఇచ్చిన ఆజ్ఞను సౌలు పాటించలేదు.—2/15, 22-23 పేజీలు.

• మనం దుర్నీతిని ద్వేషిస్తున్నామని ఎలా చూపించవచ్చు?

మనం మద్యపాన దుర్వినియోగం చేయం, భూతప్రేత వ్యవహారాలకు దూరంగా ఉంటాం, అనైతికత విషయంలో యేసు ఇచ్చిన హెచ్చరికను పాటిస్తాం. ఉదాహరణకు మనం అశ్లీల చిత్రాలు చూడం, వాటి గురించి పగటి కలలు కనం. (మత్త. 5:27, 28) అంతేకాక, సంఘం నుండి బహిష్కరించబడిన వారితో సహవాసం చేయం.—2/15, 29-32 పేజీలు.

• యిర్మీయా ఏవిధంగా ‘జలముల యొద్ద నాటబడి, వేళ్లు తన్ను’ చెట్టులా ఉన్నాడు? (యిర్మీ. 17:7, 8)

ఆయన ఎప్పుడూ ఫలించడం మానలేదు. అంతేకాక, అపహాసకులు తనను ప్రభావితం చేసేందుకు అనుమతించలేదు. బదులుగా, ఆయన దేవుడు చెప్పినదాన్ని పాటించడం ద్వారా జీవజలముల ఊటను హత్తుకొని ఉన్నాడు.—3/15, 14వ పేజీ.