కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కష్టాల మధ్య నిరీక్షణ

కష్టాల మధ్య నిరీక్షణ

కష్టాల మధ్య నిరీక్షణ

“చివరి రోజుల్లో ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి.”—2 తిమోతి 3:1.

ఇలాంటి విషాదకరమైన సంఘటనలు ఏవైనా మీరు విన్నారా లేదా చూశారా?

● ఒక మరణాంతకమైన వ్యాధి సోకి ఎంతోమంది చనిపోవడం.

● కరువు వల్ల ఆకలితో అలమటించి వందలమంది కన్నుమూయడం.

● భూకంపంలో వేలమంది చనిపోవడం, ఉన్నదంతా కోల్పోవడం.

ఇలాంటి సంఘటనల గురించి ఆసక్తికరమైన వాస్తవాలను మీరు ఈ పత్రికలో తెలుసుకుంటారు. ‘చివరి రోజులు’ అని వర్ణించబడిన కాలంలో ఇలాంటి సంఘటనలు జరగడం గురించి బైబిలు ముందే చెప్పిందని కూడా మీరు తెలుసుకుంటారు.

మనం కష్టాల మధ్య జీవిస్తున్నామని తెలియజేయడం ఈ ఆర్టికల్స్‌ ఉద్దేశం కాదు. ఎందుకంటే, అది అందరికీ తెలిసిన వాస్తవమే. ఈ ఆర్టికల్స్‌ ఉద్దేశం మీలో నిరీక్షణను నింపడం. బైబిలు చెప్తున్న ఈ ఆరు ప్రవచనాలు నెరవేరడం, మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నామని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి. కానీ మనం చివరి రోజుల్లో జీవిస్తున్నామని చాలామంది ఒప్పుకోరు. అయితే అతిత్వరలో మన కష్టాలన్నీ పోయి, మంచిరోజులు వస్తాయని ఎందుకు నమ్మవచ్చో ఈ ఆర్టికల్స్‌ వివరిస్తాయి.