కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రవచనం 3. వ్యాధులు

ప్రవచనం 3. వ్యాధులు

ప్రవచనం 3. వ్యాధులు

“పెద్దపెద్ద అంటువ్యాధులు వస్తాయి.”—లూకా 21:11.

● ఆఫ్రికాలో జరిగిన అంతర్యుద్ధం (civil war) వల్ల అక్కడ జీవిస్తున్న బొంజాలీ అనే ఆరోగ్య అధికారి ఇబ్బందులుపడ్డాడు. అతను ఉంటున్న ప్రాంతంలో, గనుల్లో పనిచేసే కార్మికులు ఒక ప్రాణాంతకమైన వైరస్‌ సోకి చనిపోతున్నారు. వాళ్లకు తన వంతు సహాయం చేస్తూనే, వాళ్లను ఆదుకోమని ఓ నగరంలోని అధికారులను వేడుకున్నాడు. కానీ ఆ అధికారులు స్పందించడానికి నాలుగు నెలలు పట్టింది. అప్పటికే ఆలస్యం అయిపోయింది. అతను కాపాడాలనుకున్న కార్మికుల ద్వారా వైరస్‌ సోకి బొంజాలీ ప్రాణాలు కోల్పోయాడు.

కొన్ని వాస్తవాలు: ప్రతీ సంవత్సరం నిమోనియా, డయేరియా, HIV/ఎయిడ్స్‌, టీబీ, మలేరియా వంటి వ్యాధులకు ఎంతోమంది బలైపోతున్నారు. ఈ ఐదు వ్యాధుల వల్ల కేవలం ఒక్క సంవత్సరంలోనే (2004), దాదాపు ఒక కోటి ఏడు లక్షల మంది చనిపోయారు. ఇంకోలా చెప్పాలంటే, వ్యాధుల వల్ల ఏడాది పొడవునా ప్రతీ మూడు సెకన్లకు కనీసం ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు.

కొంతమంది ఏమంటారు? జనాభా పెరుగుతుంది కాబట్టి, వ్యాధుల బారినపడే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతుంది.

అది నిజమేనా? ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది అన్నమాట వాస్తవమే. అయితే వ్యాధులను అదుపులో ఉంచి, చికిత్స అందించే సామర్థ్యం కూడా మనుషులకు ఉంది. అలా చూస్తే వ్యాధుల బారినపడే వాళ్ల సంఖ్య తగ్గాలి. కానీ ఆశ్చర్యకరంగా, ఆ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

మీరేమంటారు? బైబిలు ముందే చెప్పినట్టు ప్రజలు భయంకరమైన వ్యాధుల బారినపడుతున్నారా?

ఒకవైపు భూకంపాలు, కరువులు, వ్యాధులు వల్ల లక్షలమంది బాధలుపడుతున్నారు. ఇంకోవైపు లక్షలమంది సాటిమనుషుల వల్ల బాధలుపడుతున్నారు. వాళ్లను కాపాడాల్సిన మనుషులే మృగాల్లా మారి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిగురించి బైబిలు ముందే ఏం చెప్పిందో చూడండి.

[6వ పేజీలోని బ్లర్బ్‌]

“ఒక సింహం లేదా ఏదైనా క్రూర జంతువు మనమీద దాడి చేసి చంపితే ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. శరీరంలో ఉన్న ఒక వ్యాధి వల్ల ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణించి, ప్రాణాలు కోల్పోవడం కూడా అంతే భయంకరంగా ఉంటుంది. అదే వ్యాధి వల్ల మన కళ్లముందే వేరేవాళ్లు చనిపోవడం చూసినప్పుడు ఇంకా ఎక్కువ భయమేస్తుంది.”—ఎపిడమాలజిస్ట్‌ మైకల్‌ ఆస్టర్‌హోమ్‌.

[6వ పేజీలోని క్రెడిట్‌ లైను]

© William Daniels/​Panos Pictures