కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రవచనం 5. నాశనమౌతున్న భూమి

ప్రవచనం 5. నాశనమౌతున్న భూమి

ప్రవచనం 5. నాశనమౌతున్న భూమి

‘భూమిని నాశనం చేస్తున్న వాళ్లను [దేవుడు] నాశనం చేస్తాడు.’—ప్రకటన 11:18.

● నైజర్‌ డెల్టా ప్రాంతంలో, పిర్రి అనే వ్యక్తి తాటికళ్లు తీస్తూ జీవనం సాగించేవాడు. అయితే, ఆయిల్‌ స్పిల్‌ వల్ల అతని వ్యాపారం దెబ్బతింది. (ఆయిల్‌ స్పిల్‌ అంటే, సముద్రంలో ఆయిల్‌ ట్యాంకర్లు ప్రమాదానికి గురైనప్పుడు నూనె సముద్రంలోకి కారి నీటిపై పొరలా ఏర్పడుతుంది). పిర్రి ఇలా చెప్పాడు, “అలాంటి ప్రమాదాల వల్ల చేపలు చచ్చిపోతాయి, మాకు చర్మవ్యాధులు వస్తాయి, నీళ్లు కలుషితమౌతాయి. నేను నా జీవనాధారాన్ని కోల్పోయాను.”

కొన్ని వాస్తవాలు: కొంతమంది నిపుణుల ప్రకారం, ప్రతీ సంవత్సరం 65 లక్షల టన్నుల చెత్త సముద్రాల్లో కలుస్తుంది. ఆ చెత్తలో యాభై శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఉంటాయి. అవి కరిగి భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ఈ విధంగా మనుషులు భూమిని కలుషితం చేస్తున్నారు. దాంతోపాటు భూవనరులను చాలా విపరీతంగా వాడేస్తున్నారు. ఒక సంవత్సరంలో మనం వాడిన వనరులను తిరిగి ఉత్పత్తి చేయాలంటే, భూమికి ఒక సంవత్సరం ఐదు నెలలు పడుతుందని కొంతమంది నిపుణులు అంటారు. “ఒకవేళ ప్రపంచ జనాభా ఇలాగే పెరుగుతూ ఉండి, భూవనరులను ఇదే స్థాయిలో వాడుతూ పోతే 2035 కల్లా మనకు కావాల్సిన వనరులను ఉత్పత్తి చేయడానికి రెండు భూములు అవసరమౌతాయి” అని సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ అనే ఆస్ట్రేలియన్‌ న్యూస్‌ పేపర్‌ రాసింది.

కొంతమంది ఏమంటారు? మనుషులు తెలివైనవాళ్లు. మనకు సమస్యల్ని పరిష్కరించే సామర్థ్యం ఉంది కాబట్టి భూమిని కాపాడుకోగలం.

అది నిజమేనా? కాలుష్యాన్ని తగ్గించడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కాలుష్యం ఒక తీరని సమస్యలానే ఉంది.

మీరేమంటారు? భూమిని కాపాడతానని దేవుడు మాటిచ్చాడు. మరి భూమిని కాపాడడానికి దేవుని సహాయం అవసరమంటారా?

అయితే, చివరిరోజుల్లో ఒక మంచి విషయం జరుగుతుందని కూడా బైబిలు ముందే చెప్పింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

[8వ పేజీలోని బ్లర్బ్‌]

“నేను ఉంటున్న ప్రాంతం చాలా అందమైనదని అనుకున్నాను. కానీ అది విషపూరితమైన చెత్తతో నిండిపోయిందని ఇప్పుడు అనిపిస్తుంది.”—ఎరిన్‌ టాంబర్‌, గల్ఫ్‌కోస్ట్‌ నివాసి, యునైటెడ్‌ స్టేట్స్‌, 2010⁠లో గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో జరిగిన ఆయిల్‌ స్పిల్‌ని ఉద్దేశించి చెప్పిన మాటలు.

[8వ పేజీలోని బాక్సు]

దేవుడు బాధ్యుడా?

మనకాలంలో జరుగుతున్న చెడు విషయాల గురించి బైబిలు ముందే చెప్పింది కాబట్టి, వాటన్నిటికి దేవుడే బాధ్యుడా? ఆయన మనల్ని బాధలుపెడతాడా? వీటికి జవాబులు తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? పుస్తకంలోని 11వ అధ్యాయం చూడండి.

[8వ పేజీలోని క్రెడిట్‌ లైను]

U.S. Coast Guard photo