కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యం అంటే ఏమిటి?

దేవుని రాజ్యం అంటే ఏమిటి?

దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి

దేవుని రాజ్యం అంటే ఏమిటి?

ఈ ఆర్టికల్‌ సాధారణంగా మీకు వచ్చే సందేహాలను ప్రస్తావిస్తుంది. అంతేకాదు, వాటికి జవాబులు మీ బైబిల్లో ఎక్కడ ఉన్నాయో కూడా ఈ ఆర్టికల్‌ తెలియజేస్తుంది. ఆ జవాబులను మీతో చర్చించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.

1. దేవుని రాజ్యం అంటే ఏమిటి?

దేవుని రాజ్యం పరలోకం నుండి పరిపాలించే ఒక ప్రభుత్వం. ఇది ఇతర ప్రభుత్వాలన్నిటినీ తీసివేస్తుంది. పరలోకం విషయంలో, భూమి విషయంలో దేవుడు అనుకున్నది జరిగేలా చేస్తుంది. మంచి ప్రభుత్వం మనందరికీ అవసరం, దాన్ని దేవుని రాజ్యం తీరుస్తుంది.దానియేలు 2:44; మత్తయి 6:9, 10 చదవండి.

రాజ్యానికి ఒక రాజు ఉండాలి. తన రాజ్యానికి రాజుగా యెహోవా దేవుడు తన కుమారుడైన యేసును నియమించాడు.లూకా 1:30-33 చదవండి.

2. యేసు శ్రేష్ఠమైన పరిపాలకుడని ఎందుకు చెప్పవచ్చు?

దేవుని కుమారుడు శ్రేష్ఠమైన రాజు. ఎందుకంటే ఆయన దయగలవాడు, నీతి నియమాలకు కట్టుబడి ఉంటాడు, ప్రజలకు సహాయం చేసే శక్తి ఆయనకుంది. (మత్తయి 11:28-30) యెహోవా దేవుడు ఆయనను తిరిగి బ్రతికించిన తర్వాత యేసు పరలోకానికి వెళ్లి దేవుని కుడి ప్రక్కన వేచివున్నాడు. (హెబ్రీయులు 10:12, 13) ఆ తర్వాత పరలోకం నుండి పరిపాలన మొదలుపెట్టడానికి దేవుడు ఆయనకు అధికారమిచ్చాడు.దానియేలు 7:13, 14 చదవండి.

3. యేసుతోపాటు ఇంకా ఎవరు పరిపాలిస్తారు?

యేసుతోపాటు పరలోకం నుండి పరిపాలించడానికి యెహోవా దేవుడు “పరిశుద్ధుల” గుంపును ఎంపిక చేశాడు. (దానియేలు 7:27) ఆయన మొదటిగా యేసు నమ్మకమైన అపొస్తలులను ఎంపిక చేశాడు. అలాంటి నమ్మకమైన స్త్రీపురుషులను యెహోవా ఇప్పటివరకు ఎంపిక చేస్తూనే ఉన్నాడు. దేవుడు వాళ్లను కూడా యేసులా ఆత్మ శరీరంతో బ్రతికిస్తాడు.యోహాను 14:1-3; 1 కొరింథీయులు 15:42-45 చదవండి.

అయితే, పరలోకానికి ఎంతమంది వెళ్తారు? “చిన్న మంద” పరలోకానికి వెళ్తుందని యేసు చెప్పాడు. (లూకా 12:32) అందులో మొత్తం 1,44,000 మంది ఉంటారు. వాళ్లు యేసుతోపాటు భూమిని పరిపాలిస్తారు.ప్రకటన 5:9, 10; 14:1 చదవండి.

4. దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు మొదలైంది?

యేసు 1914లో రాజయ్యాడు. a ఆ వెంటనే ఆయన సాతానును, అతని దయ్యాలను భూమ్మీద పడేశాడు. (ప్రకటన 12:7-10, 12) అప్పటినుండి మానవుల కష్టాలు చాలా ఎక్కువయ్యాయి. ఈ లోకం అంత్యదినాల్లో ఉందని చెప్పడానికి మనం చూస్తున్న యుద్ధాలు, భూకంపాలు, కరువులు, రోగాలు, అన్యాయాలు, అక్రమాలే నిదర్శనం. (2 తిమోతి 3:1-5) దేవుని రాజ్యం నుండి ప్రయోజనం పొందాలనుకునే వాళ్లు, దాని రాజైన యేసుకు ఎలా అనుచరులు కావచ్చో తెలుసుకోవాలి.లూకా 21:7, 10, 11, 31, 34, 35 చదవండి.

5. దేవుని రాజ్యం ఏమి సాధిస్తుంది?

దేవుని రాజ్యం, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనా పని ద్వారా దేవుని మార్గాల గురించి తెలుసుకునేలా అన్ని దేశాల్లోవున్న లక్షలాదిమంది ప్రజలకు ఇప్పటికే సహాయం చేస్తోంది. (మత్తయి 24:14) అది ఈ భూమ్మీదున్న చెడును తీసివేసినప్పుడు, యేసు అధికారానికి లోబడే ‘ఒక గొప్ప సమూహాన్ని’ రక్షిస్తుంది.ప్రకటన 7:9, 10, 13-17 చదవండి.

వెయ్యేండ్ల కాలంలో ఆ రాజ్యం ఈ భూమిని క్రమేణా అందమైన తోటగా మారుస్తుంది. చివరకు యేసు, రాజ్యాన్ని తన తండ్రికి తిరిగి అప్పగిస్తాడు. (1 కొరింథీయులు 15:24-26) దేవుని రాజ్యం గురించి మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా?కీర్తన 37:10, 11, 29 చదవండి. (w11-E 07/01)

ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే, యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ పుస్తకంలోని, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?, 8, 9 అధ్యాయాలు చూడండి.

[అధస్సూచి]

a ఆయన 1914లో రాజయ్యాడని బైబిలు ప్రవచనాలు ఎలా చూపిస్తున్నాయో తెలుసుకోవడానికి, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 215-218 పేజీలు చూడండి. దీన్ని యెహోవాసాక్షులు ప్రచురించారు.