కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

యెరూషలేము దేవాలయంలో రూకలు మార్చే వ్యక్తులు ఎందుకు ఉండేవాళ్లు?

యేసు మరణించడానికి కొన్నిరోజుల ముందు, దేవాలయంలో జరుగుతున్న ఘోరమైన అన్యాయం గురించి మాట్లాడాడు. ఆ సందర్భం గురించి బైబిలు ఇలా చెబుతోంది, ‘యేసు దేవాలయములో క్రయవిక్రయములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోశాడు.’ ఆయన వాళ్లతో ఇలా అన్నాడు, “నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారు.”—మత్తయి 21:12, 13.

మొదటి శతాబ్దంలో యూదులు, యూదా మత ప్రవిష్టులు చాలా దేశాల నుండి, ప్రాంతాల నుండి యెరూషలేములోని దేవాలయానికి వచ్చేవాళ్లు. తమ ప్రాంతపు రూకలను తమతో తెచ్చుకునేవాళ్లు. వార్షిక ఆలయపన్ను కట్టడానికి తగిన రూకల కోసం, బలి అర్పించడానికి జంతువులను కొనడం కోసం, ఇతర స్వేచ్ఛార్పణలను అర్పించడం కోసం వాళ్లు తమ ప్రాంతపు రూకలను మార్చుకోవాల్సి వచ్చేది. కాబట్టి రూకలను మార్చే వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల రూకలను, వేర్వేరు మొత్తాల రూకలను తీసుకొని ఆ ప్రాంతపు రూకలను ఇచ్చేవాళ్లు. అలా చేయడానికి వాళ్లు కొంత రుసుము తీసుకునేవాళ్లు. యూదుల పండుగలు దగ్గరపడుతుండగా రూకలు మార్చే ఈ వ్యక్తులు ఆలయంలోని అన్యుల ఆవరణంలో తమ బల్లలు పెట్టుకునేవాళ్లు.

రూకలు మార్చేవాళ్లు ఆలయాన్ని ‘దొంగల గుహగా’ మారుస్తున్నారని యేసు చేసిన విమర్శను బట్టి, వాళ్లు రూకలు మార్చడానికి ఎక్కువ డబ్బును రుసుముగా తీసుకునేవాళ్లని తెలుస్తోంది. (w11-E 10/01)