కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని నియమాలు మనకెలా మేలు చేస్తాయి?

దేవుని నియమాలు మనకెలా మేలు చేస్తాయి?

దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి

దేవుని నియమాలు మనకెలా మేలు చేస్తాయి?

ఈ ఆర్టికల్‌సాధారణంగా మీకు వచ్చే సందేహాలను ప్రస్తావిస్తుంది. అంతేకాదు, వాటికి జవాబులు మీ బైబిల్లో ఎక్కడ ఉన్నాయో కూడా ఈ ఆర్టికల్‌తెలియజేస్తుంది. ఆ జవాబులను మీతో చర్చించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.

1. మనం దేవునికి ఎందుకు లోబడాలి?

దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి మనం ఆయనకు లోబడాలి. యేసు కూడా ఎల్లప్పుడూ ఆయనకు లోబడ్డాడు. (యోహాను 6:38; ప్రకటన 4:10, 11) దేవుని నియమాలకు లోబడడం ద్వారా మనం ఆయనను ప్రేమిస్తున్నామని చూపించవచ్చు.—1 యోహాను 5:3 చదవండి.

యెహోవా పెట్టిన నియమాలన్నీ మన మంచికోసమే. ఇప్పుడు శ్రేష్ఠమైన విధంగా ఎలా జీవించాలో, భవిష్యత్తులో శాశ్వత ఆశీర్వాదాలు పొందాలంటే ఏమి చేయాలో అవి మనకు నేర్పిస్తాయి.—కీర్తన 19:7, 11; యెషయా 48:17, 18 చదవండి.

2. దేవుని నియమాలు మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి?

తాగుబోతుతనం తప్పు అని బైబిలు చెబుతోంది. ఆ నియమాన్ని పాటిస్తే ప్రాణాంతకమైన రోగాల, ప్రమాదాల బారిన పడకుండా ఉంటాం. తాగుబోతులు మద్యానికి బానిసలౌతారు, తెలివితక్కువగా ప్రవర్తిస్తారు. (సామెతలు 23:20, 29, 30) మద్యాన్ని సేవించకూడదని యెహోవా చెప్పడం లేదు, కానీ మితంగా మాత్రమే సేవించాలని చెబుతున్నాడు.—కీర్తన 104:15; 1 కొరింథీయులు 6:10 చదవండి.

అసూయ, తీవ్రమైన కోపం వంటి హానికరమైన లక్షణాలు చూపించకూడదని కూడా యెహోవా మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం ఆయన నియమాలను ఎంత బాగా పాటిస్తే మన ఆరోగ్యానికి అంత మేలు జరుగుతుంది.—సామెతలు 14:30; 22:24, 25 చదవండి.

3. దేవుని నియమాలు మనల్ని ఎలా కాపాడతాయి?

వివాహేతర సంబంధాలను బైబిలు ఖండిస్తోంది. (హెబ్రీయులు 13:4) దంపతులు ఈ ఆజ్ఞను పాటించినప్పుడు సురక్షితంగా ఉన్నామన్న భావన వాళ్లలో కలుగుతుంది, అంతేకాదు పిల్లలు ఎదగడానికి అనువైన వాతావరణం నెలకొంటుంది. ఆ ఆజ్ఞను పాటించకపోతే రోగాలు, విడాకులు, హింస, మానసిక క్షోభ వంటి సమస్యలు పీడిస్తాయి. తల్లి లేదా తండ్రి లేని కుటుంబాలు ఏర్పడతాయి.—సామెతలు 5:1-9 చదవండి.

వివాహేతర సంబంధాలకు దారితీసే పరిస్థితులకు దూరంగా ఉంటే దేవునితో మనకున్న స్నేహం చెక్కుచెదరదు. అలాగే మనవల్ల ఇతరులకు ఏ హానీ జరగదు.—1 థెస్సలొనీకయులు 4:3-6 చదవండి.

4. జీవం పట్ల గౌరవం చూపించడం వల్ల మనకెలా మేలు జరుగుతుంది?

జీవం దేవుడిచ్చిన బహుమానం. దాన్ని గౌరవించి, పొగతాగడం వంటి ప్రాణాంతకమైన దురలవాట్లను మానేసిన వాళ్లకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది. (2 కొరింథీయులు 7:1) గర్భంలో ఎదిగే శిశువు జీవం కూడా దేవుని దృష్టిలో విలువైనదే. (నిర్గమకాండము 21:22, 23) అందుకే కడుపులో ఉన్న శిశువును ఉద్దేశపూర్వకంగా చంపకూడదు. దేవునిలాగే జీవాన్ని విలువైనదిగా ఎంచేవాళ్లు పనిస్థలాల్లో, ఇంట్లో ఉన్నప్పుడు, కారులో ప్రయాణిస్తున్నప్పుడు సురక్షితంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. (ద్వితీయోపదేశకాండము 22:8) జీవం దేవుడిచ్చిన బహుమానం కాబట్టి సరదా కోసం వాళ్లు తమ ప్రాణాన్ని ప్రమాదంలో పడేసుకోరు.—కీర్తన 36:9 చదవండి.

5. రక్తాన్ని పవిత్రంగా ఎంచడం వల్ల మనకెలా మేలు జరుగుతుంది?

రక్తం ప్రాణానికి ప్రతీక అని దేవుడు చెబుతున్నాడు, కాబట్టి అది పవిత్రమైనది. (ఆదికాండము 9:3, 4) రక్తం ప్రాణంతో సమానమని దేవుని నియమం చెబుతోంది. ఆ నియమం ఆధారంగా దేవుడు మన పాపక్షమాపణకు మార్గాన్ని తెరిచాడు.—లేవీయకాండము 17:11-13; హెబ్రీయులు 9:22 చదవండి.

ఏవిధంగా? తన కుమారుని రక్తం ద్వారా మనల్ని పాపమరణాల నుండి విడిపించడానికి యెహోవా ఆయనను భూమ్మీదకు పంపించాడు. యేసు పరిపూర్ణుడు కాబట్టి ఆయన రక్తం చాలా విలువైనదని చెప్పవచ్చు. యేసు, తన ప్రాణానికి ప్రతీకగా ఉన్న తన రక్తాన్ని దేవునికి అర్పించాడు. (హెబ్రీయులు 9:12) ఆయన చిందించిన రక్తం మనం నిరంతరం జీవించడానికి మార్గాన్ని తెరిచింది.మత్తయి 26:28; యోహాను 3:16 చదవండి. (w11-E 11/01)

ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ పుస్తకంలోని, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?, 12, 13 అధ్యాయాలు చూడండి.