కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రైస్తవులమని చెప్పుకునే వాళ్లందరూ క్రైస్తవులేనా?

క్రైస్తవులమని చెప్పుకునే వాళ్లందరూ క్రైస్తవులేనా?

క్రైస్తవులమని చెప్పుకునే వాళ్లందరూ క్రైస్తవులేనా?

ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? అట్లాస్‌ ఆఫ్‌ గ్లోబల్‌ క్రిస్టియానిటీ ప్రకారం, 2010 లో దాదాపు 230 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అయితే వాళ్లు 41,000 కన్నా ఎక్కువ శాఖల్లో ఉన్నారని అదే నివేదిక చెప్తుంది. ప్రతీ శాఖకు సొంత సిద్ధాంతాలు, ప్రవర్తన నియమాలు ఉన్నాయి. క్రైస్తవులమని చెప్పుకునేవాళ్లలో ఇన్ని వేర్వేరు శాఖలు ఉండడం చూసి చాలామంది అయోమయానికి, నిరుత్సాహానికి గురౌతున్నారు. వాళ్లు, ‘క్రైస్తవులమని చెప్పుకునే వాళ్లందరూ నిజంగా క్రైస్తవులేనా?’ అని ఆలోచిస్తుండవచ్చు.

దీన్ని మరో కోణం నుండి చూద్దాం. వేరే దేశానికి ప్రయాణించే వ్యక్తి, సరిహద్దు దగ్గరున్న అధికారులకు తాను ఏ దేశ పౌరుడో చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు దానికి రుజువులు ఇవ్వాలి, అంటే పాస్‌పోర్ట్‌ లాంటి ఏదోక గుర్తింపు కార్డు చూపించాలి. అలాగే ఒక నిజ క్రైస్తవుడు తాను క్రైస్తవుడినని కేవలం చెప్పుకుంటే సరిపోదు. అతని దగ్గర వేరే రుజువులు కూడా ఉండాలి. ఏంటవి?

“క్రైస్తవులు” అనే మాట క్రీ.శ. 44 తర్వాత మొదటిసారిగా ఉపయోగించబడింది. బైబిలు చరిత్రకారుడైన లూకా ఇలా రాశాడు: “దేవుని నిర్దేశం ప్రకారం శిష్యులు క్రైస్తవులని మొట్టమొదట పిలవబడింది అంతియొకలోనే.” (అపొస్తలుల కార్యాలు 11:26) అలా క్రైస్తవులని పిలవబడినవాళ్లు క్రీస్తు శిష్యులు అని గమనించండి. ఒక వ్యక్తి యేసుక్రీస్తుకు శిష్యుడు ఎలా అవుతాడు? ద న్యూ ఇంటర్నేషనల్‌ డిక్షనరీ ఆఫ్‌ న్యూ టెస్టమెంట్‌ థియాలజీ ఇలా వివరిస్తుంది: “ఒక వ్యక్తి శిష్యునిగా అనుసరించడం అంటే, ఎలాంటి షరతులు పెట్టకుండా బ్రతికున్నంత కాలం తన పూర్తి జీవితాన్ని త్యాగం చేయడమే.” కాబట్టి, క్రైస్తవత్వాన్ని స్థాపించిన యేసు బోధలు, నిర్దేశాలన్నిటినీ ఎలాంటి షరతులు పెట్టకుండా పాటించే వ్యక్తే నిజ క్రైస్తవుడు.

ఈ రోజుల్లో క్రైస్తవులమని చెప్పుకునే కోట్లమందిలో అలాంటి నిజ క్రైస్తవులను కనుగొనడం సాధ్యమేనా? తన నిజమైన అనుచరుల్ని ఎలా గుర్తుపట్టాలని యేసు చెప్పాడు? ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు పరిశీలించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రాబోయే ఆర్టికల్స్‌లో, తన నిజమైన అనుచరుల్ని గుర్తించడానికి సహాయం చేసే, యేసు చెప్పిన ఐదు గుర్తుల్ని చూస్తాం. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు తమకు ఆ గుర్తులు ఉన్నాయని ఎలా చూపించారో గమనిస్తాం. అలాగే, నేడు క్రైస్తవులమని చెప్పుకునే కోట్లమందిలో ఎవరికి ఆ గుర్తులు ఉన్నాయో కూడా చూస్తాం.