కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు

దేవుని పేరు ఏమిటి?

మన ఇంట్లో అందరికీ పేర్లు ఉంటాయి. చివరికి మనం ముద్దుగా పెంచుకునే జంతువులకు కూడా పేర్లు ఉంటాయి! మరి అలాంటప్పుడు దేవునికి కూడా ఒక పేరు ఉండాలి కదా? బైబిల్లో దేవునికి సర్వశక్తిగల దేవుడు, సర్వాధికారియైన ప్రభువు, సృష్టికర్త మొదలైన బిరుదులు చాలా ఉన్నాయి, అయితే ఆయనకంటూ ఒక పేరు కూడా ఉంది.—యెషయా 42:8 చదవండి.

చాలా బైబిలు అనువాదాల్లో దేవుని పేరు కీర్తన 83:18లో ఉంది. ఉదాహరణకు, పరిశుద్ధ గ్రంథంలో ఆ వచనం ఇలా ఉంది: “యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక.”

దేవుని పేరును మనం ఎందుకు ఉపయోగించాలి?

మనం ఆయన పేరు ఉపయోగించాలని దేవుడే కోరుతున్నాడు. మనం మన సన్నిహిత మిత్రులతోగానీ, ఆప్తులతోగానీ మాట్లాడేటప్పుడు, వాళ్ల పేర్లు ఉపయోగిస్తాం కదా! కొన్నిసార్లు తమను పేరు పెట్టి పిలవమని వాళ్లే చెప్తారు. దేవునితో మాట్లాడేటప్పుడు కూడా అదే వర్తించదా? యేసుక్రీస్తు కూడా దేవుని పేరు ఉపయోగించమని ప్రోత్సహించాడు.—మత్తయి 6:9; యోహాను 17:26 చదవండి.

అయితే, దేవునికి స్నేహితునిగా ఉండాలంటే ఆయన పేరే కాదు, ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు, ఆయన ఎలాంటి దేవుడు? మనం నిజంగా దేవునికి దగ్గరవ్వగలమా? ఆ ప్రశ్నలకు బైబిల్లో జవాబులు ఉన్నాయి. (w13-E 01/01)