కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లలకు నేర్పించండి

ఒక నేరస్తుని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

ఒక నేరస్తుని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

ఇక్కడున్న చిత్రంలో యేసు ఒక నేరస్తునితో మాట్లాడుతున్నాడు కదా, అతని నుండి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. అతను గతంలో చేసిన నేరాల గురించి బాధపడ్డాడు. ‘నువ్వు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో’ అని అతను యేసును అడిగాడు. ఈ చిత్రంలో చూపించినట్లు అప్పుడే యేసు అతనితో మాట్లాడాడు. యేసు అతనితో ఏమంటున్నాడో తెలుసా? a యేసు అతనికి, ‘నువ్వు నాతో కూడ పరదైసులో ఉంటావని నిశ్చయంగా నీతో చెప్తున్నాను’ అని మాటిచ్చాడు.

పరదైసు అంటే ఎలా ఉంటుంది?— దాని సరైన జవాబు తెలుసుకోవడానికి మనం, మొట్టమొదటి మనుషులైన ఆదాముహవ్వల కోసం దేవుడు చేసిన పరదైసు గురించి మాట్లాడుకుందాం. ఆ పరదైసు ఎక్కడ ఉండేది? పరలోకంలోనా, భూమ్మీదా?

సరిగ్గా చెప్పావ్‌, భూమ్మీదే. కాబట్టి ఆ నేరస్తుడు “పరదైసులో” ఉంటాడంటే, ఈ భూమంతా పరదైసుగా మారిన తర్వాత ఇక్కడే ఉంటాడని అర్థం. మరి ఆ పరదైసు ఎలా ఉంటుంది?— దాని గురించి ఇప్పుడు చూద్దాం.

యెహోవా దేవుడు మొదటి మనుషులైన ఆదాముహవ్వలను చేసి, వాళ్లను ఇదే భూమ్మీద ఒక అందమైన తోటలో పెట్టాడని బైబిలు చెబుతోంది. అదే “ఏదెను తోట.” ఆ “ఏదెను తోట” ఎంత అందంగా ఉండేదో మీరు ఊహించుకోగలరా?— అది ఇప్పటివరకు ఎవ్వరూ చూడనంత అందంగా, చక్కగా ఉండేది!

మీరేం అంటారు? చేసిన తప్పులకు బాధపడ్డ ఆ నేరస్తునితో పాటు యేసు కూడా ఈ భూమ్మీదే ఉంటాడా?— ఉండడు, కానీ యేసు పరలోకంలోనే ఉంటూ పరదైసు భూమిని పరిపాలిస్తాడు. అయితే, చనిపోయిన అతనిని యేసు బతికించి, పరదైసు భూమ్మీద అతని అవసరాలు తీరుస్తాడు కాబట్టి ఒక రకంగా యేసు అతనితో ఉన్నట్లే. కానీ, యేసు ఒక నేరస్తుణ్ణి పరదైసులో ఎందుకు ఉండనిస్తాడు?— దాని గురించి ఇప్పుడు చూద్దాం.

నిజమే, ఆ నేరస్తుడు చాలా చెడ్డ పనులు చేశాడు. ఆయనే కాదు, భూమ్మీద జీవించిన కోట్లాదిమంది కూడా అలాంటి పనులే చేశారు. అయితే, వాళ్లలో చాలామందికి యెహోవా గురించి, ఆయన కోరుకునే వాటి గురించి ఎవరూ ఏమీ బోధించలేదు కాబట్టే చెడ్డ పనులు చేశారు.

యేసు మాటిచ్చిన ఆ నేరస్తునితో పాటు అలాంటి వాళ్లందరూ ఇదే పరదైసు భూమ్మీద తిరిగి జీవిస్తారు. దేవునికి ఏది ఇష్టమో అప్పుడు వాళ్లందరూ నేర్చుకుంటారు. యెహోవాను ప్రేమిస్తున్నామని చూపించే అవకాశం అప్పుడు వాళ్లకు దొరుకుతుంది.

యెహోవాను ప్రేమిస్తున్నామని వాళ్లెలా చూపిస్తారు?— దేవుడు చెప్పినట్టు జీవిస్తూ ఆయనను ప్రేమిస్తున్నామని వాళ్లు చూపిస్తారు. యెహోవాను, తోటివాళ్లను ప్రేమించే ప్రజలతో కలిసి ఈ పరదైసు భూమ్మీద జీవించడం ఎంత బాగుంటుందో! (w13-E 06/01)

మీ బైబిల్లో చదవండి

a మీరు చిన్నపిల్లలతో కలిసి చదువుతుంటే గీత ఉన్నచోట ఆగి, అక్కడున్న ప్రశ్నకు జవాబు చెప్పమని అడగండి.