కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

త్రిక ముఖ్యాంశం | ఆందోళనలను ఎలా తట్టుకోవాలి?

ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన

ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన

“ఆహారం కోసం వెళ్తే షాప్‌లో బిస్కెట్లే ఉన్నాయి. అది కూడా మామూలు ధర కన్నా 10,000 రెట్లు ఎక్కువ. తర్వాత రోజు షాపుల్లో అసలేమీ లేవు.”—పాల్‌, జింబాబ్వే.

“నా భర్త నన్ను కూర్చోపెట్టి, ‘నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నాను అని చెప్పాడు.’ ఆ నమ్మకద్రోహాన్ని ఎలా తట్టుకోవాలి? నా పిల్లల పరిస్థితి ఏంటి?”—జానెట్‌, అమెరికా.

“సైరన్‌లు మోగినప్పుడల్లా తలదాచుకోవడానికి పరిగెత్తుతాను. బాంబులు పేలుతుంటే నేలపై పడుకుంటాను. కొన్ని గంటల తర్వాత కూడా నా చేతులు వణుకుతూనే ఉంటాయి.”—అలోనా, ఇజ్రాయిల్‌.

ఆందోళనలతో నిండిన “అపాయకరమైన” కాలంలో మనం జీవిస్తున్నాం. (2 తిమోతి 3:1) ఆర్థిక సమస్యలు, కుటుంబంలో గొడవలు, యుద్ధాలు, ప్రాణాంతక రోగాలు, ప్రకృతి విపత్తులు, మనుషుల తప్పుల వల్ల కలిగే ప్రమాదాలతో చాలామంది తల్లడిల్లిపోతున్నారు. వీటికితోడు ‘నా ఒంటిమీద వచ్చిన ఈ కణితి క్యాన్సర్‌లా మారుతుందా?’ ‘నా మనవళ్ల సమయానికి ఈ లోకం ఏమైపోతుంది? వాళ్లెలా బ్రతుకుతారు?’ వంటి జీవన చింతలు కూడా ఉంటాయి.

కొన్ని విషయాల్లో ఆందోళన పడడం తప్పేం కాదు. పరీక్షలప్పుడు, పదిమంది ముందు ఏదైనా చేయాల్సినప్పుడు, ఇంటర్వ్యూకు వెళ్లేప్పుడు సహజంగానే మనం ఒత్తిడికి లోనవుతాం. ప్రమాదాలు జరగుతాయనే భయం ఉంటే జాగ్రత్తగా ఉంటాం. అయితే తీవ్రంగా లేదా అస్తమానం ఉండే ఆందోళనలు, భయాలు అస్సలు మంచివి కావు. ప్రతీదానికి ఆందోళన పడడం వల్ల చిన్నవయసులోనే చనిపోయే ప్రమాదం ఉందని 68,000 మంది మీద చేసిన తాజా పరిశోధనల్లో తెలిసింది. “చింతించి తన జీవితకాలాన్ని ఒక్క ఘడియ పొడిగించగలవాడు మీలో ఎవరైనా ఉన్నారా?” అని యేసు సరిగ్గానే అడిగాడు. అవును, చింతలు జీవితకాలాన్ని పొడిగించవు. అందుకే యేసు “చింతించకండి” అని చెప్పాడు. (మత్తయి 6:25, 27, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అయితే చింతించకుండా ఎలా ఉండగలం?

మనకు కష్టాలు లేకపోయినా, భవిష్యత్తులో ఏ సమస్యా రాదని చెప్పలేం. చింతించకుండా ఉండడానికి సరైన జ్ఞానంతో జీవించాలి, దేవునిపై బలమైన నమ్మకం పెంచుకోవాలి, భవిష్యత్తు బాగుంటుందని దేవుడు చెప్తున్న మాటపై నమ్మకం చూపిస్తూ ఉండాలి. పాల్‌, జానెట్‌, అలోనాలకు ఈ మూడు విషయాలు ఎలా సహాయం చేశాయో తెలుసుకుందాం. (w15-E 07/01)