కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పత్రిక ముఖ్యాంశం | ప్రియమైనవాళ్లు చనిపోయినప్పుడు. . .

చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారు!

చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారు!

ముందు ఆర్టికల్‌లో చెప్పిన గాల్‌ అనే ఆమెని గుర్తుచేసుకోండి, ఆమె భర్త రాబ్‌ లేని జీవితం ఆమె వల్ల కావట్లేదని చెప్పింది. అయితే, దేవుడు వాగ్దానం చేసిన కొత్త లోకంలో ఆయనను తిరిగి చూడాలని ఎదురుచూస్తుంది. ఆమె ఇలా అంటోంది: “నాకు బాగా ఇష్టమైన వచనాలు ప్రకటన 21:3, 4.” అక్కడ ఇలా ఉంది: “దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”

గాల్‌ ఇంకా ఇలా అంటోంది: “ఈ వాగ్దానం నాకు నిరీక్షణ ఇచ్చింది. ఆప్తులను కోల్పోయిన కొంతమందిని చూస్తే నాకు బాధగా ఉంటుంది. ఎందుకంటే చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారనే విషయం వాళ్లకు తెలీదు.” గాల్‌తాను నమ్మిన వాటిని బట్టి స్వచ్ఛందంగా దేవుని సేవ చేస్తూ ఉంది. “మరణము ఇక ఉండని” జీవితం గురించిన దేవుని వాగ్దానాన్ని తోటివాళ్లకు చెప్తూ ఎక్కువ సమయం గడుపుతుంది.

తాను తిరిగి బ్రతుకుతాననే నమ్మకం యోబుకు ఉంది

మీరు నమ్మలేకపోతున్నారా! యోబు అనే అతని ఉదాహరణ చూడండి. ఆయనకు ఘోరమైన జబ్బు వచ్చింది. (యోబు 2:7) ఒకవేళ చనిపోయినా, దేవుడు భూమి మీద మళ్లీ బ్రతికిస్తాడనే నమ్మకం ఆయనకు ఉంది. పూర్తి నమ్మకంతో ఇలా అన్నాడు: “నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలు . . . నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.” (యోబు 14:13, 15) దేవుడు తనని మర్చిపోడని తప్పకుండా తిరిగి బ్రతికిస్తాడనే నమ్మకం యోబుకు ఉంది.

త్వరలోనే ఈ భూమి పరదైసుగా మారినప్పుడు దేవుడు యోబుని అలాంటి ఎంతోమందిని తిరిగి బ్రతికిస్తాడు. (లూకా 23:42, 43) “పునరుత్థానము కలుగబోవుచున్నదని” బైబిల్లో అపొస్తలుల కార్యములు 24:14, 15లో ఉంది. “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని . . . బయటికి వచ్చెదరు” అని యేసు మనకు అభయం ఇస్తున్నాడు. (యోహాను 5:28, 29) ఆ వాగ్దానం నెరవేరడాన్ని యోబు చూస్తాడు. ఆయనకు “తన చిన్ననాటిస్థితి” తిరిగి వస్తుంది. అతని శరీరం “బాలురమాంసముకన్న ఆరోగ్యముగా” ఉంటుంది. (యోబు 33:24, 25) ప్రేమతో దేవుడు ఈ భూమ్మీద ఏర్పాటు చేసిన పునరుత్థాన నిరీక్షణకు కృతజ్ఞతతో స్పందించిన వాళ్లందరికి కూడా ఇలానే జరుగుతుంది.

ప్రియమైనవాళ్లు చనిపోయి మీరు బాధలోవుంటే, ఇప్పటివరకు చూసిన విషయాలు మీ బాధను పూర్తిగా తీసివేయకపోవచ్చు. కానీ బైబిల్లో దేవుడు వాగ్దానం చేసిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు నిరీక్షణతో ఉండవచ్చు, తట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని పొందవచ్చు.—1 థెస్సలొనీకయులు 4:13.

ఈ బాధను ఎలా తట్టుకోవాలో ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నారా? లేదా దీనికి సంబంధించి, “దేవుడు చెడును, బాధను ఎందుకు ఉండనిస్తున్నాడు?” లాంటి ప్రశ్నలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? దయచేసి మా వెబ్‌సైట్‌ jw.orgను చూడండి. ఆదరణ, నిరీక్షణ ఇచ్చే బైబిలు జవాబులు అందులో ఉన్నాయి.▪ (w16-E No. 3)