కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు తెలుసా?

మీకు తెలుసా?

యేసు కుష్ఠరోగులతో వ్యవహిరించిన తీరు ఎందుకు ప్రత్యేకంగా ఉంది?

బైబిలు కాలాల్లో ఒక రకమైన కుష్ఠురోగం చాలా ఎక్కువగా ఉండేది. ప్రాచీన కాలాల్లో ఉన్న యూదులకు ఆ జబ్బు అంటే చాలా భయం. ఆ వ్యాధి నాడి చివర్ల మీద దాడి చేస్తుంది. వాటిని పూర్తిగా తినేసి, శరీరాన్ని వికారంగా మార్చేస్తుంది. ఆ రోజుల్లో కుష్ఠ వ్యాధికి సరైన నివారణ లేదు. ఆ వ్యాధి సోకిన వాళ్లు అందరికీ దూరంగా ఉండాలి, ఆ జబ్బు ఉన్నట్టు ముందే అందరికీ చెప్పాల్సిన బాధ్యత కూడా కుష్ఠరోగులకు ఉంది.—లేవీయకాండము 13:45, 46.

ఈ వ్యాధికి సంబంధించి ఆ రోజుల్లో మత నాయకులు చాలా నియమాలు పెట్టేవాళ్లు. అవి బైబిల్లో ఉన్న నియమాలను కూడా దాటిపోయి ఆ జబ్బు ఉన్న వాళ్ల జీవితాన్ని మరీ కష్టతరం చేశాయి. ఉదాహరణకు రబ్బీలు పెట్టే నిబంధనల వల్ల కుష్ఠ రోగం ఉన్నవాళ్లు 4 మూరలు (6 అడుగులు, లేదా 2 మీటర్లు) దూరంలో నిలబడాలి. దగ్గరికి రాకూడదు. ఒకవేళ గాలి వీస్తుంటే ఆ కుష్ఠరోగి 100 మూరలు (150 అడుగులు, లేదా 45 మీటర్లు) దూరంలో ఉండాలి. దేవుడు ఇచ్చిన నియమాల ప్రకారం కుష్ఠరోగి “పాళెము వెలుపల” ఉండాలి. దాన్ని, టాల్మూడ్‌ విద్వాంసులు పట్టణాల్లోకి రాకూడదు అన్నట్లు చెప్పేవాళ్లు. అందుకే పట్టణంలో కుష్ఠరోగిని చూసినప్పుడు ఒక రబ్బీ, రాళ్లు విసురుతూ “మీ చోటకు వెళ్లిపో, వేరేవాళ్లను అపవిత్రం చేయవద్దు” అని అరిచేవాడు.

కానీ యేసు వాళ్లలా లేడు. కుష్ఠ రోగుల్ని తరమకుండా యేసు వాళ్లను ముట్టుకున్నాడు, వాళ్లను బాగు చేశాడు.—మత్తయి 8:3.▪ (w16-E No. 4)

యూదా మతగురువులు దేన్నిబట్టి విడాకులకు అనుమతి ఇచ్చేవాళ్లు?

క్రీస్తు శకం 71/72 కాలం నాటి విడాకుల పత్రం

క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఉన్న మత గురువుల్లో విడాకుల గురించి చాలా చర్చలు జరిగేవి. అందుకే ఒక సందర్భంలో పరిసయ్యులు వచ్చి యేసును ఇలా ప్రశ్నిస్తారు, “ఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా?”—మత్తయి 19:3.

మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక భర్తకు భార్యలో వ్యభిచార సూచన ఏదైనా కనబడితే ఆమెకు విడాకులు ఇవ్వవచ్చు. (ద్వితీయోపదేశకాండము 24:1) యేసు కాలంలో రెండు రకాల రబ్బీ పాఠశాలలు ఉండేవి. ఆ రెండు పాఠశాలల్లో ధర్మశాస్త్రాన్ని వేర్వేరుగా వివరించేవాళ్లు. షమ్మయ్‌ పాఠశాలలు చాలా ఖచ్చితంగా ఉండేవి. వాటిలో విడాకులకు కారణం “అపవిత్రత” లేదా వ్యభిచారం అని మాత్రమే చెప్పేవాళ్లు. హిల్లెల్‌ పాఠశాలల్లో మాత్రం ఏ కారణానికైనా, చిన్నదానికైనా చట్టబద్ధంగా విడాకులు ఇవ్వవచ్చు అని చెప్పేవాళ్లు. ఒకవేళ భార్య ఒకరోజు సరిగ్గా వంట చేయకపోయినా లేదా ఆయన ఇంకో అందమైన స్త్రీని పెళ్లి చేసుకోవాలనుకున్నా విడాకులు ఇచ్చేయవచ్చు అని వాళ్లు చెప్పేవాళ్లు.

మరి యేసు పరిసయ్యులు అడిగిన ప్రశ్నకు ఎలా జవాబిచ్చాడు? ఆయన స్పష్టంగా ఇలా చెప్పాడు: “మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడు.”—మత్తయి 19:6, 9.▪ (w16-E No. 4)