కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జ్యోతిష్యం, జాతకాలు—భవిష్యత్తును చూడడానికి మార్గాలా?

జ్యోతిష్యం, జాతకాలు—భవిష్యత్తును చూడడానికి మార్గాలా?

జ్యోతిష్యం

జ్యోతిష్యం కూడా మంత్రతంత్రాలలో ఒక భాగమే. నక్షత్రాలు, చంద్రుడు, గ్రహాలు భూమి మీద ఉన్న ప్రజల జీవితాలపై ప్రభావం చూపిస్తాయనే నమ్మకం మీద జ్యోతిష్యం ఆధారపడి ఉంది. ఒక మనిషి పుట్టేటప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాల, గ్రహాల స్థానాలను బట్టి అతని లేదా ఆమె వ్యక్తిత్వం, భవిష్యత్తు రూపుదిద్దుకుంటాయని జ్యోతిష్యులు నమ్ముతారు.

జ్యోతిష్యం పూర్వకాలంలో ప్రాచీన బబులోనులో ఎప్పుడో మొదలైంది, కానీ ఇప్పటికీ అది చాలా ప్రాచుర్యంలో ఉంది. భారతీయ జనాభాలో సైన్‌టిస్టులతో పాటు, 90 శాతం కన్నా ఎక్కువమంది, జ్యోతిష్యాన్ని నమ్ముతారని అంచనా వేయబడింది. మరి జ్యోతిష్యం నిజంగా విజ్ఞాన సంబంధమైనదేనా? కాదు. ఎందుకో చూడండి.

  • జ్యోతిష్యులు చెప్తున్న విధంగా గ్రహాలు, నక్షత్రాలు మనుషుల జీవితాలపైన ప్రభావం చూపించే ఏ విధమైన శక్తిని ప్రసరింపచేయవు.

  • చాలావరకు జ్యోతిష్యంలో ఎవరికైనా సరిపోయే మామూలు విషయాలే ఉంటాయి.

  • భూమి చుట్టూ గ్రహాలు తిరుగుతాయని పూర్వం ప్రజలు నమ్మిన నమ్మకాన్నిబట్టి ఇప్పుడున్న జ్యోతిష్యశాస్త్ర సంఖ్యలు లేదా లెక్కలు తయారు చేయబడ్డాయి. కానీ నిజానికి గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి.

  • ఒకే వ్యక్తికి సంబంధించి వేర్వేరు జ్యోతిష్యులు చెప్పిన విషయాలు కలవవు.

  • పుట్టిన తేదీ ప్రకారం జ్యోతిష్యం మనుషుల్ని 12 భాగాల్లో లేదా 12 జన్మరాశుల్లో ఏదైనా ఒక దానిలో చేరుస్తుంది. వందల సంవత్సరాలుగా అంతరిక్షంలో భూమి స్థానంలో మార్పులు వచ్చాయి. కాబట్టి సూర్యుడు ఒక నక్షత్రరాశి ద్వారా వెళ్లడాన్నిబట్టి నిర్ణయించిన జన్మరాశులు వాటికి సంబంధించిన తేదీలు మారిపోయాయి.

నక్షత్రరాశులు మనిషి వ్యక్తిత్వానికి సంబంధించిన ఆధారాలు ఇస్తాయని అంటారు. కానీ నిజానికి ఒకే రోజు పుట్టిన వాళ్లకు ఒకే లక్షణాలు ఉండవు. ఒకతను లేదా ఆమె పుట్టిన రోజు వాళ్ల గురించి గానీ వాళ్ల వ్యక్తిత్వం గురించి గానీ ఏమీ చెప్పదు. మనుషుల్ని ఉన్న విధంగా చూసే బదులు జ్యోతిష్యులు మనిషి వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని వాళ్లు పెట్టుకున్న అంచణాల ప్రకారం నిర్ణయిస్తారు. ఇది ఒక విధమైన వివక్ష కాదా?

జాతకం

పూర్వకాలాల నుండి ప్రజలు జ్యోతిష్యులు దగ్గరకు వెళ్తూ ఉన్నారు. కొంతమంది జంతువుల లేదా మనుషుల శరీరం లోపలి భాగాలను చూడడం ద్వారా, లేదా కోడి పుంజు ధాన్యం గింజలను తినే విధానాన్ని బట్టి అర్థాలు వెదికేవాళ్లు. ఇంకొంతమంది కాఫీ లేదా టీ తాగాక కప్పులో మిగిలిన టీ ఆకులు, లేదా కాఫీ పొడితో ఏర్పడిన గీతలను, ఆకృతులను బట్టి జాతకం చదువుతారు. నేడు టారో కార్డులు, క్రిస్టల్‌ బంతులు, పాచికలు, చిలక జ్యోష్యం ద్వారా మనిషి భవిష్యత్తును “చదువుతారు.” మరి జాతకాలు చూడడం ద్వారా భవిష్యత్తును ఖచ్చితంగా తెలుసుకోగలమా? లేదు, తెలుసుకోలేము. ఎందుకో ఇలా ఆలోచించి చూడండి.

జాతకాలన్నీ ఒకేలా ఉంటాయా వేర్వేరుగా ఉంటాయా అనే విషయాన్ని ఆలోచించండి. వేర్వేరు పద్ధతుల్లో చెప్పిన జాతకం ఒక దానికి ఒకటి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఒకే పద్ధతిని ఉపయోగించినా కూడా జాతకాలు వేర్వేరుగా వస్తాయి. ఉదాహరణకు ఒకతను ఇద్దరు జ్యోతిష్యులు దగ్గరకు వెళ్లి, ఒకే కార్డుల ద్వారా వాళ్లు “చదివిన” భవిష్యత్తు గురించి ఏదైనా ప్రశ్న అడిగాడు అనుకోండి, దానికి వాళ్లిద్దరు చెప్పే జవాబులు ఒకేలా ఉండాలి. కానీ చాలావరకు అవి ఒకేలా ఉండవు.

ఇప్పుడు జ్యోతిష్యుల పద్ధతుల్ని, ఉద్దేశాల్ని ఎక్కువమంది అనుమానిస్తున్నారు. కార్డులైనా, క్రిస్టల్‌ బంతులైనా పేరుకు మాత్రమే వాడే వస్తువులని, ఆ వస్తువులు కన్నా జ్యోతిష్యుడు అతని దగ్గరకు వెళ్లిన వాళ్ల హావభావాలనే ఎక్కువ చదువుతాడని విమర్శకులు అంటున్నారు. ఉదాహరణకు జాతకాలు చెప్పడం బాగా నేర్చుకున్నవాళ్లు కొన్ని సాధారణ ప్రశ్నలు అడుగుతారు. అడిగాక, జాతకం చెప్పించుకునే వాళ్ల గురించిన సమాచారాన్ని రాబట్టడానికి వాళ్ల మాటల్ని లేదా వేరే విషయాల్ని జాగ్రత్తగా గమనిస్తారు. అప్పుడు ఆ జ్యోతిష్యుడు వాళ్ల దగ్గర నుండి రాబట్టిన విషయాల్ని, పరిస్థితుల్ని అతనే సొంతగా కనిపెట్టినట్లు భ్రమింపచేస్తాడు. ఒకసారి అతని దగ్గరకు వెళ్లిన వాళ్ల నమ్మకాన్ని సంపాదించుకున్నాక కొంతమంది జ్యోతిష్యులు వాళ్ల దగ్గర నుండి డబ్బుల్ని కుప్పలు కుప్పలుగా సంపాదించుకుంటారు.

బైబిలు మనకు ఏమి చెప్తుంది

జ్యోతిష్యమైనా, జాతకమైనా మన భవిష్యత్తు ముందే రాయబడింది లేదా నిర్ణయించబడింది అనే విషయాన్ని సూచిస్తుంది. అది నిజమేనా. మనం ఏమి నమ్మాలి, ఏమి చేయాలి అని నిర్ణయించుకునే స్వేచ్ఛ మనకు ఉందని, మన నిర్ణయాలను బట్టే మన భవిష్యత్తు ఉంటుందని బైబిలు చెప్తుంది.—యెహోషువ 24:15.

దేవున్ని ఆరాధించేవాళ్లు జ్యోతిష్యానికి, జాతకాలకు దూరంగా ఉండడానికి మరో కారణం కూడా ఉంది. దేవుడు అన్నిరకాల మంత్రతంత్రాలను ఖండిస్తున్నాడు. బైబిల్లో ఈ మాటలు ఉన్నాయి: “శకునముచెప్పు సోదెగానినైనను, మేఘశకునములనుగాని సర్ప శకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు * హేయుడు.”—ద్వితీయోపదేశకాండము 18:10-12.

^ భూమి అంతటిపైన ‘మహోన్నతుని’ పేరు.—కీర్తన 83:18.