కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యానికి సంబంధించిన సత్యం

దేవుని రాజ్యానికి సంబంధించిన సత్యం

యేసు తన శిష్యులకు ఇలా ప్రార్థించమని నేర్పించాడు, “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి. నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలో నెరవేరుతున్నట్టు భూమ్మీద కూడా నెరవేరాలి.” (మత్తయి 6:9, 10) దేవుని రాజ్యం అంటే ఏంటి? అది ఏం చేస్తుంది? దానికోసం మనం ఎందుకు ప్రార్థించాలి?

దేవుని రాజ్యానికి రాజు యేసు.

లూకా 1:31-33: “ఆయనకు నువ్వు యేసు అని పేరు పెట్టాలి. ఆయన గొప్పవాడిగా ఉంటాడు, సర్వోన్నతుని కుమారుడని పిలువబడతాడు. ఆయన తండ్రైన దావీదు సింహాసనాన్ని యెహోవా దేవుడు ఆయనకు ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థుల్ని ఎప్పటికీ రాజుగా పరిపాలిస్తాడు, ఆయన రాజ్యానికి అంతం ఉండదు.”

యేసు ముఖ్యంగా దేవుని రాజ్యం గురించే ప్రజలకు చెప్పాడు.

మత్తయి 9:35: “యేసు అన్ని నగరాల్లో, గ్రామాల్లో ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఆయన అలా వెళ్తూ వాళ్ల సభామందిరాల్లో బోధిస్తూ, రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ, అన్నిరకాల జబ్బుల్ని, అనారోగ్యాల్ని బాగుచేస్తూ ఉన్నాడు.”

దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి యేసు తన శిష్యులకు ఒక గుర్తు చెప్పాడు.

మత్తయి 24:7: “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి. ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు, భూకంపాలు వస్తాయి.”

యేసు శిష్యులు దేవుని రాజ్యం గురించి ఇప్పుడు భూమంతటా చెప్తున్నారు.

మత్తయి 24:14: “అన్ని దేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, రాజ్యం గురించిన మంచివార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.”