కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 20-21

“మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు మీకు సేవకుడిగా ఉండాలి”

“మీలో గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు మీకు సేవకుడిగా ఉండాలి”

20:28

గర్విష్ఠులైన శాస్త్రులు, పరిసయ్యులు సంత వీధుల్లో తమను అందరూ గుర్తించాలని, వాళ్లకు నమస్కారం చేయాలని కోరుకునేవాళ్లు

గర్విష్ఠులైన శాస్త్రులు, పరిసయ్యులు ఇతరులను మెప్పించాలని, అందరిలో గొప్పవాళ్లుగా ఉండాలని కోరుకునేవాళ్లు. (మత్త 23:5-7) కానీ యేసు అలా కాదు. “మానవ కుమారుడు కూడా సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవచేయడానికి . . . వచ్చాడు.” (మత్త 20:28) ఆరాధనకు సంబంధించిన పనుల్లో, మనకు ఎక్కువగా గుర్తింపు, ఘనత తెచ్చే వాటినే చేయడానికి ప్రయత్నిస్తున్నామా? ఇతరులకు ఏ విషయాల్లో సహాయం అవసరమో వాటిని చేస్తే, యెహోవా దగ్గర యేసు లాంటి గొప్ప పేరు సంపాదించుకుంటాం. అలాంటి పనులు ఎక్కువగా ఇతరులకు కనిపించవు, కానీ యెహోవా వాటిని గమనిస్తాడు. (మత్త 6:1-4) వినయంగల సేవకులు ఇలా చేస్తారు . . .

  • రాజ్యమందిరాన్ని శుభ్రం చేసి దాన్ని మంచి స్థితిలో ఉంచడానికి సహాయం చేస్తారు

  • పెద్దవాళ్లకు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు

  • రాజ్యానికి సంబంధించిన పనుల్లో ఆర్థికంగా మద్దతిస్తారు