కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

దేవునిపట్ల, సాటిమనుషులపట్ల ప్రేమను ఎలా వృద్ధిచేసుకోవచ్చు?

దేవునిపట్ల, సాటిమనుషులపట్ల ప్రేమను ఎలా వృద్ధిచేసుకోవచ్చు?

దేవుణ్ణి, సాటిమనిషిని ప్రేమించాలని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే, క్రైస్తవులు ఇప్పుడు ధర్మశాస్త్రం కింద లేకపోయినా అందులో ఉన్న రెండు ముఖ్యమైన ఆజ్ఞల్ని ఇప్పుడు కూడా పాటించాలని యెహోవా కోరుకుంటున్నాడు. (మత్త 22:37-39) అలాంటి ప్రేమ వారసత్వంగా రాదు. దాన్ని వృద్ధి చేసుకోవాలి. ఎలా? ప్రతీరోజు బైబిలు చదవడం ఒక మంచి పద్ధతి. లేఖనాల ద్వారా దేవుని వ్యక్తిత్వంలోని వివిధ కోణాలను మనం పరిశీలించినప్పుడు, “యెహోవా మంచితనాన్ని” తెలుసుకోగలుగుతాము. (కీర్త 27:4, NW) దానివల్ల మనకు ఆయన మీద ప్రేమ పెరుగుతుంది, మనం ఆయనలా ఆలోచిస్తాము. అప్పుడు, ఇతరుల పట్ల స్వయం త్యాగపూరిత ప్రేమను చూపించాలనే ఆజ్ఞతోపాటు, దేవుని ఆజ్ఞల్ని పాటించాలని కదిలించబడతాము. (యోహా 13:34, 35; 1 యోహా 5:3) బైబిల్ని ఇష్టంగా చదవడానికి ఇక్కడ మూడు సలహాలు ఉన్నాయి:

  • మీ ఊహాశక్తికి పదునుపెట్టండి, జ్ఞానేంద్రియాలను చక్కగా ఉపయోగించండి. మీరు అక్కడే ఉన్నట్లు ఊహించుకోండి. మీరు ఏం చూడగలుగుతున్నారు? ఏం వినగలుగుతున్నారు? ఏ వాసనలు చూడగలుగుతున్నారు? అప్పుడు మీకు ఎలాంటి భావాలు కలుగుతున్నాయి?

  • చదివే పద్ధతిని మార్చి చూడండి. కొన్ని పద్ధతులు: గట్టిగా చదవండి, లేదా ఒక ఆడియో రికార్డింగ్‌ వింటూ దాన్ని గమనించండి. బైబిల్లో అధ్యాయాల్ని వరుసగా చదివే బదులు, ఒక వ్యక్తి గురించి గానీ, ఒక విషయం గురించి గానీ చదవండి. ఉదాహరణకు, యేసు గురించి చదవాలనుకుంటే పవిత్ర లేఖనాల నూతనలోక అనువాదంలో ఎ7 లేదా బి12 అనుబంధాన్ని ఉపయోగించండి. ఏ అధ్యాయం నుండి దినవచనం తీసుకున్నారో, ఆ అధ్యాయం మొత్తాన్ని చదవండి. బైబిలు పుస్తకాలను వాటి వరుస క్రమంలో చదవండి.

  • అర్థం చేసుకుంటూ చదవండి. బైబిల్ని చదవడం పూర్తి చేసేయాలనే ఉద్దేశంతో ఒకేసారి చాలా అధ్యాయాలు చదివే బదులు, నెమ్మదిగా అర్థం చేసుకుంటూ, ధ్యానిస్తూ రోజుకి ఒక్క అధ్యాయం చదివినా చాలు. మీరు చదువుతున్న విషయాల సందర్భాన్ని పరిశీలించండి. అందులో ప్రతీ విషయం గురించి ఆలోచించండి. మ్యాప్‌లను, మార్జినల్‌ రెఫరెన్సులను ఉపయోగించుకోండి. మీకు అర్థంకాని ఒక్క విషయాన్నైనా పరిశోధించండి. వీలైతే, చదవడానికి ఎంత సమయం తీసుకున్నారో, ధ్యానించడానికి కూడా అంతే సమయం తీసుకోండి.