కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

నలిగిన మనస్సుగలవాళ్లను యెహోవా కాపాడతాడు

నలిగిన మనస్సుగలవాళ్లను యెహోవా కాపాడతాడు

మనందరం ఎప్పుడోకప్పుడు బాధపడతాం. అలా బాధపడుతున్నామంటే దేవుని మీద విశ్వాసం తగ్గిందని కాదు. ఎందుకంటే, యెహోవా కూడా కొన్నిసార్లు బాధపడ్డాడు. (ఆది 6:5, 6) కానీ మీరు తరచూ లేదా ఎప్పుడూ బాధలోనే మునిగిపోతే అప్పుడేంటి?

సహాయం కోసం యెహోవావైపు చూడండి. మన ఫీలింగ్స్‌ని, మనసులో ఉన్న ఆలోచనల్ని యెహోవా పట్టించుకుంటాడు. మనం ఎప్పుడు సంతోషంగా ఉన్నామో, ఎప్పుడు బాధగా ఉన్నామో యెహోవాకు తెలుసు. మనం ఫలానా విధంగా ఎందుకు ఆలోచిస్తున్నామో, మనకు ఎందుకు అలా అనిపిస్తుందో కూడా ఆయన అర్థంచేసుకుంటాడు. (కీర్త 7:9బి) అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవాకు మనమంటే చాలా పట్టింపు ఉంది. అలాగే మనం బాధ నుండి లేదా కృంగుదల నుండి బయటపడడానికి ఆయన సహాయం చేస్తాడు.—కీర్త 34:18.

మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నిరాశలో ఉన్నప్పుడు లేదా డీలా పడినప్పుడు, మన సంతోషం ఆవిరైపోవడమే కాదు, యెహోవాతో మనకున్న స్నేహం కూడా దెబ్బతినవచ్చు. అందుకే మన హృదయాన్ని, ఆలోచనల్ని భద్రంగా కాపాడుకోవాలి.—సామె 4:23.

మన సహోదరులు శాంతిగా ఉన్నారు . . . డిప్రెషన్‌లో ఉన్నా వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • డిప్రెషన్‌ను తట్టుకోవడానికి నిక్కీ ఏయే పనులు చేసింది?

  • డాక్టర్‌ సహాయం తీసుకోవాలని నిక్కీకి ఎందుకు అనిపించింది?—మత్త 9:12

  • సహాయం కోసం నిక్కీ యెహోవా మీద ఏయే విధాలుగా ఆధారపడింది?