కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

తల్లిదండ్రులారా​—⁠తెలివి సంపాదించుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి

తల్లిదండ్రులారా​—⁠తెలివి సంపాదించుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి

మీ పిల్లలు దేవుని తెలివిని సంపాదించుకునేలా సహాయం చేసే ముఖ్యమైన మార్గం ఏంటంటే, మీటింగ్స్‌ నుండి వాళ్లు ప్రయోజనం పొందేలా చేయడం. పిల్లలు మీటింగ్స్‌లో చూసినవి, విన్నవి, కామెంట్స్‌లో చెప్పినవి యెహోవా గురించి తెలుసుకునేలా, ఆయనకు మంచి ఫ్రెండ్‌ అయ్యేలా చేస్తాయి. (ద్వితీ 31:12, 13) మీరు తల్లిదండ్రులైతే, మీ పిల్లలు మీటింగ్స్‌ నుండి ఎక్కువ ప్రయోజనం పొందేలా ఏం చేయవచ్చు?

  • ఏం చేసైనా సరే, రాజ్యమందిరంలో జరిగే మీటింగ్స్‌కి నేరుగా వెళ్లడానికి చూడండి.—కీర్త 22:22

  • మీటింగ్‌కి ముందు లేదా తర్వాత బ్రదర్స్‌, సిస్టర్స్‌తో మాట్లాడడానికి సరిపడా సమయం పిల్లలకు ఇవ్వండి.—హెబ్రీ 10:25

  • మీటింగ్‌లో చర్చించుకునే ప్రచురణలు ఫోన్‌లోనైనా, టాబ్‌లోనైనా లేదా ముద్రిత రూపంలోనైనా మీ కుటుంబంలో ప్రతీఒక్కరి చేతుల్లో ఉండేలా చూసుకోండి

  • మీ పిల్లలు సొంత మాటల్లో కామెంట్‌ చెప్పేలా ప్రిపేర్‌ అవ్వడానికి సహాయం చేయండి.—మత్త 21:15, 16

  • మీటింగ్స్‌ గురించి, అక్కడ నేర్చుకునే వాటిగురించి మంచిగా మాట్లాడండి

  • మీ పిల్లలు రాజ్యమందిరంలో క్లీనింగ్‌ చేసేలా, వృద్ధులతో మాట్లాడేలా చూసుకోండి

మీ పిల్లలు యెహోవాకు స్నేహితులయ్యేలా చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి రావచ్చు. ఒక్కోసారి అది మీ తలకు మించిన భారంగా అనిపించవచ్చు. అప్పుడు మీరు సహాయం కోసం యెహోవావైపు చూడండి.—యెష 40:29.

తల్లిదండ్రులారా, యెహోవా ఇచ్చే బలం మీద ఆధారపడండి వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • జాక్‌, లీయా బాగా అలసిపోవడం వల్ల ఏం జరిగింది?

  • బలం కోసం తల్లిదండ్రులు ఎందుకు యెహోవావైపు చూడాలి?

  • జాక్‌, లీయా యెహోవావైపు ఎలా చూశారు?