కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయనం కోసం చిట్కా

అధ్యయనం కోసం చిట్కా

మన అవగాహనలో వచ్చిన మార్పుల్ని ఎప్పటికప్పుడు ఎలా తెలుసుకోవచ్చు?

మనం చాలా ఆసక్తికరమైన కాలాల్లో జీవిస్తున్నాం. యెహోవా బైబిల్లో ఉన్న సత్యాల్ని మనం అర్థంచేసుకునేలా క్రమక్రమంగా తెలియజేస్తున్నాడు. (దాని. 12:4) అయినా సరే, కొన్నిసార్లు లేఖన అవగాహనలో వచ్చిన మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మనకు కష్టంగా ఉండవచ్చు. మరి ఆ మార్పుల్ని, వాటి వివరాల్ని ఎక్కడ తెలుసుకోవచ్చు?

వాచ్‌ టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌లో “Beliefs Clarified” అనే అంశంలోకి వెళ్తే, ఇప్పటివరకు వచ్చిన మార్పుల గురించి సంవత్సరాల వారీగా ఉన్న లిస్టు కనిపిస్తుంది. దాని కిందున్న అంశాలన్నీ తెలుసుకోవడానికి వాచ్‌టవర్‌ లైబ్రరీలో లేదా వాచ్‌టవర్‌ ఆన్‌లైన్‌ లైబ్రరీలో “understanding clarified” అని టైప్‌ చేయండి. టైప్‌ చేస్తున్నప్పుడు “” కూడా చేర్చండి.

• యెహోవాసాక్షుల పరిశోధన పుస్తకంలో కుదించిన లిస్టు ఉంటుంది. దానికోసం “యెహోవాసాక్షులు” అనే అంశంలో “అభిప్రాయాలు, నమ్మకాలు” కింద “మన నమ్మకాల వివరణ” చూడండి.

వ్యక్తిగత అధ్యయన ప్రాజెక్టులో, ఈ మధ్య వచ్చిన ఒక అవగాహనను ఎంచుకొని, ఆ అవగాహన ఏంటో, దానికి గల లేఖనాధార కారణాలు ఏంటో పరిశీలించండి.