కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయనం కోసం చిట్కా

మీరు పాటించాలనుకునే రత్నాలను తవ్వండి

మీరు పాటించాలనుకునే రత్నాలను తవ్వండి

మనం బైబిలు చదువుతున్నప్పుడు, పరిశోధన చేయడం ద్వారా రత్నాలను తవ్వొచ్చు. అయితే, ఎక్కువ ప్రయోజనం పొందాలంటే ఎలా పరిశోధన చేయాలి?

లోతుగా తవ్వండి. బైబిలు వృత్తాంతాల్లోని వివరాల్ని లోతుగా తవ్వండి. ఉదాహరణకు ఆ వృత్తాంతాన్ని ఎవరు, ఎవరికి, ఎప్పుడు రాశారు? అప్పుడు పరిస్థితులు ఏంటి? వాటికి ముందు, తర్వాత ఏం జరిగింది? అని ఆలోచించండి.

నేర్చుకోండి. ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తూ పరిశోధన చేయండి: ‘ఆ వృత్తాంతాల్లో ఉన్న వ్యక్తులకు ఏం అనిపించింది? వాళ్లు ఏ లక్షణాలు చూపించారు? వాళ్లలాగే నేను ఏ లక్షణాలు చూపించాలి లేదా ఏ లక్షణాలు చూపించకూడదు?’

నేర్చుకున్నవి పాటించండి. ప్రీచింగ్‌లో లేదా వేరేవాళ్లతో వ్యవహరిస్తున్నప్పుడు మీరు నేర్చుకున్నవి పాటించండి. అలాచేస్తే, దేవుడు ఇచ్చిన తెలివిని చూపించినట్లు అవుతుంది. బైబిలు ఇలా చెప్తుంది, “తెలివిగల వాళ్లందరూ వీటిని గమనిస్తారు.”—కీర్త. 107:43.

  • చిట్కా: మీటింగ్‌ వర్క్‌బుక్‌లోని దేవుని వాక్యంలో ఉన్న సంపద అనే భాగంలో, మనం పాటించాల్సిన విషయాన్ని ఎలా ఇస్తున్నారో గమనించండి. ఈ భాగంలో మాములుగా మనం వేసుకోవాల్సిన ప్రశ్నల్ని, ధ్యానించాల్సిన విషయాల్ని, ఆలోచించాల్సిన చిత్రాల్ని ఇస్తారు.