కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

FPG/The Image Bank via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

హార్‌మెగిద్దోన్‌ రాబోతోందని రాజకీయ నాయకులు హెచ్చరిస్తున్నారు—బైబిలు ఏం చెప్తుంది?

హార్‌మెగిద్దోన్‌ రాబోతోందని రాజకీయ నాయకులు హెచ్చరిస్తున్నారు—బైబిలు ఏం చెప్తుంది?

 క్రిమియాను, రష్యాను కలిపే ఒక ముఖ్యమైన బ్రిడ్జిని పేల్చిన రెండు రోజుల తర్వాత 2022, అక్టోబరు 10 సోమవారం ఉదయం యుక్రెయిన్‌లోని రష్యా, ప్రతీకార చర్యగా మిసైల్‌ దాడుల్ని చేసింది.

  •   ‘[అమెరికా ప్రెసిడెంట్‌ జాన్‌. ఎఫ్‌] కెన్నెడీ సమయంలో జరిగిన క్యూబా మిసైల్‌ సంక్షోభం తర్వాత మనం హార్‌మెగిద్దోన్‌కి ఇంత దగ్గరగా ఎప్పుడూ లేము. ఒక్కసారి అణ్వాయుధాల్ని వాడామా, ఇకది హార్‌మెగిద్దోన్‌కే దారితీస్తుందని నాకు అనిపిస్తుంది.’—అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌, అక్టోబరు 6, 2022.

  •   “త్వరలో హార్‌మెగిద్దోన్‌ రాబోతుందని నాకు అనిపిస్తుంది, అది మొత్తం భూగ్రహానికే ఒక పెద్ద ముప్పు.”—అణ్వాయుధాల్ని ఉపయోగించడం వల్ల వచ్చే పర్యవసానాల గురించి అడిగినప్పుడు యుక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ వొలిడిమిర్‌ జెలెన్‌స్కీ అన్న మాటలు, బిబిసి న్యూస్‌, అక్టోబరు 8, 2022.

 అణ్వాయుధాల్ని ఉపయోగించడం వల్ల హార్‌మెగిద్దోన్‌ నిజంగా మొదలౌతుందా? బైబిలు ఏం చెప్తుంది?

అణ్వాయుధాల్ని ఉపయోగించడం వల్ల హార్‌మెగిద్దోన్‌ మొదలౌతుందా?

 లేదు. “హార్‌మెగిద్దోన్‌” అనే పదం బైబిల్లో కేవలం ఒకేఒక్కసారి ప్రకటన 16:16 లో ఉంది. అది దేశాల మధ్య జరిగే యుద్ధాన్ని సూచించడం లేదు గానీ, ‘దేవునికి అలాగే భూమంతటా ఉన్న రాజులకి’ మధ్య జరిగే యుద్ధాన్ని సూచిస్తుంది. (ప్రకటన 16:14) దేవుడు హార్‌మెగిద్దోన్‌ యుద్ధం ద్వారా మనుషుల పరిపాలనను అంతం చేస్తాడు.—దానియేలు 2:44.

 హార్‌మెగిద్దోన్‌ యుద్ధం వల్ల భూమికి ఏం జరగబోతుందో ఎక్కువ తెలుసుకోవడానికి హార్‌మెగిద్దోను యుద్ధం అంటే ఏమిటి? అనే ఆర్టికల్‌ చదవండి.

అణుయుద్ధం వల్ల భూమి, మనుషులు నాశనం అవుతారా?

 అవ్వరు. భవిష్యత్తులో మానవ పరిపాలకులు అణ్వాయుధాల్ని బహుశా ఉపయోగించవచ్చు. కానీ, దేవుడు భూమి నాశనం అవ్వడానికి అనుమతించడు. బైబిలు ఇలా చెప్తుంది:

  •   “భూమి ఎప్పటికీ నిలిచివుంటుంది.”—ప్రసంగి 1:4.

  •   “నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు దానిలో శాశ్వతంగా జీవిస్తారు.”—కీర్తన 37:29.

 అయితే, బైబిలు ప్రవచనం అలాగే ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు త్వరలోనే ఈ భూమ్మీద పెద్దపెద్ద మార్పులు జరుగుతాయని చూపిస్తున్నాయి. (మత్తయి 24:3-7; 2 తిమోతి 3:1-5) భవిష్యత్తు గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోవడానికి మేము ఇచ్చే ఉచిత బైబిలు స్టడీ కోర్సును తీసుకోండి.