కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

Comstock Images/Stockbyte via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

మీరు ఏ నాయకుణ్ణి ఎన్నుకుంటారు?—బైబిలు ఏం చెప్తుంది?

మీరు ఏ నాయకుణ్ణి ఎన్నుకుంటారు?—బైబిలు ఏం చెప్తుంది?

 ఎవర్ని నాయకులుగా ఎంచుకోవాలనే ముఖ్యమైన నిర్ణయం గురించి చాలామంది ఆలోచిస్తున్నారు.

 బైబిలు ఏం చెప్తుంది?

మానవ నాయకులకు పరిమితులు ఉన్నాయి

 మానవ నాయకులందరికీ ఉన్న ఒక పరిమితి ఏంటో బైబిలు చెప్తుంది.

  •   “రాజుల మీద గానీ, మనుషుల మీద గానీ నమ్మకం పెట్టుకోకండి, వాళ్లు రక్షణను తీసుకురాలేరు. వాళ్ల ఊపిరి వెళ్లిపోతుంది, వాళ్లు తిరిగి మట్టికి చేరుకుంటారు; ఆ రోజే వాళ్ల ఆలోచనలు కూడా నశించిపోతాయి.”—కీర్తన 146:3, 4.

 ఎంతో సామర్థ్యం ఉన్న మంచి నాయకులు కూడా ఏదోక రోజు చనిపోతారు. వాళ్లు చేసిన మంచి పనుల్ని, వాళ్ల తర్వాత వచ్చినవాళ్లు కొనసాగిస్తారని కూడా ఏ గ్యారెంటీ లేదు.—ప్రసంగి 2:18, 19.

 నిజం ఏంటంటే, మనుషులకు తమను తాము పరిపాలించుకునే సామర్థ్యమే లేదు అని బైబిలు చెప్తుంది.

  •   “తన అడుగును నిర్దేశించుకునే అధికారం కూడా అతనికి లేదు.”—యిర్మీయా 10:23.

 మన కాలంలో ఎవరైనా మంచి నాయకులుగా ఉండగలరా?

దేవుడు నియమించిన నాయకుడు

 ఎంతో సామర్థ్యమున్న, నమ్మదగిన నాయకుణ్ణి దేవుడు నియమించాడని బైబిలు చెప్తుంది. ఆయనే యేసు క్రీస్తు. (కీర్తన 2:6) యేసు దేవుని రాజ్యానికి రాజు. దేవుని రాజ్యం పరలోకం నుండి పరిపాలించే ఒక ప్రభుత్వం.—మత్తయి 6:10.

 యేసు నాయకత్వం కింద ఉండడానికి మీరు ఒప్పుకుంటారా? ఈ ప్రశ్న గురించి ఆలోచించడం ఎంత ప్రాముఖ్యమో బైబిలు చెప్తుంది:

  •   “కుమారుణ్ణి ఘనపర్చండి, లేకపోతే దేవునికి కోపం వస్తుంది, అప్పుడు మీరు నాశనం చేయబడి నీతి మార్గం నుండి తొలగించబడతారు, ఎందుకంటే ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది. ఆయన్ని ఆశ్రయించే వాళ్లందరూ సంతోషంగా ఉంటారు.”—కీర్తన 2:12.

 మీరు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదే. 1914​లో యేసు పరిపాలించడం మొదలుపెట్టాడని, అతి త్వరలో మానవ ప్రభుత్వాల స్థానంలో దేవుని రాజ్యం వస్తుందని బైబిలు ప్రవచనాలు చెప్తున్నాయి.—దానియేలు 2:44.

 యేసు నాయకత్వాన్ని మీరు ఒప్పుకుంటున్నట్టు ఎలా చూపించవచ్చో తెలుసుకోవడానికి “దేవుని రాజ్యానికి మద్దతివ్వాలని ఇప్పుడే నిర్ణయించుకోండి!” అనే ఆర్టికల్‌ చూడండి.