కంటెంట్‌కు వెళ్లు

తమ ఇళ్లను వదిలేసి వచ్చేసిన ప్రచారకులను బైబిలు నుండి ప్రోత్సహిస్తున్నారు

మే 23, 2022
యుక్రెయిన్‌

అప్‌డేట్‌ #8 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

యుద్ధం కొనసాగుతుండగా సహోదరులు మరింత ఓదార్పును, ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు

అప్‌డేట్‌ #8 | యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులున్నా సహోదర సహోదరీల మధ్య చెరగని ప్రేమ

యుక్రెయిన్‌లో కష్ట పరిస్థితులు కొనసాగుతున్నా, యుక్రెయిన్‌ బ్రాంచిలో ఉన్న బాధ్యతగల సహోదరులు ప్రచారకులకు దేవుని వాక్యం నుండి ఓదార్పు, ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నారు. దానివల్ల తమ ఇళ్లను వదిలి వచ్చేసిన వేలమంది సహోదర సహోదరీలు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. వేర్వేరు ప్రాంతాల నుండి పశ్చిమ యుక్రెయిన్‌కు వచ్చిన సహోదర సహోదరీల్ని ఒక బ్రాంచి కమిటీ సభ్యుడు కలిశాడు. దాని గురించి, ఉజ్‌గొరొడ్‌ నగరంలోని రాజ్యమందిరంలో 30 మందితో కలిసి ఉంటున్న ఒక సహోదరి ఇలా అంది: “యెహోవా నన్ను తన చేతులతో దగ్గరకి తీసుకుని కౌగిలించుకున్నట్టు అనిపించింది.”

27 విపత్తు సహాయక కమిటీల్లో (DRCల్లో) ధైర్యంగా పనిచేస్తున్న దాదాపు 100 మందికి కాపరి సందర్శనాలు చేయడానికి సహోదరులు ఎంతో కృషిచేస్తున్నారు. DRC సభ్యుడైన ఇహోర్‌ ఇలా చెప్తున్నాడు: “నన్ను DRCలో పనిచేయమని చెప్పినప్పుడు నేనూ, నా భార్య అప్పటికే మా ఇల్లు వదిలేసి వేరే ఇంట్లో ఉంటున్నాం. మేము బాగా డీలా పడిపోయినప్పుడు, ఒక బ్రాంచి కమిటీ సభ్యుడు మమ్మల్ని కలిశాడు. ఆయన చాలా బిజీగా ఉన్నా సమయం తీసుకుని, మేము చెప్పేదంతా జాగ్రత్తగా విన్నాడు. మా బాగోగుల విషయంలో ఆయన నిజంగా శ్రద్ధ చూపించినట్టు అనిపించింది. నిజం చెప్పాలంటే, మా పరిస్థితి చాలాసార్లు పసిపిల్లల్లా ఉంటుంది. చుట్టూ జరుగుతున్నదంతా చూడడమే తప్ప మా చేతుల్లో ఏమీ ఉండదు. సమస్యకు ఏ పరిష్కారం కనిపించనప్పుడు, యెహోవాకు ప్రార్థించడం తప్ప మాకు వేరే ఉపాయం లేదు. కానీ అలా ప్రార్థించినప్పుడల్లా, ఆయన మమ్మల్ని ఎన్నోసార్లు నడిపించాడు.”

యుద్ధ ప్రాంతంలో ఉన్న రాజ్యమందిరాల గురించి చూస్తే 4 పూర్తిగా ధ్వంసం అయ్యాయి, 8 బాగా దెబ్బతిన్నాయి, 33 కొద్దిగా దెబ్బతిన్నాయి.

కీవ్‌ దగ్గరలో ఉన్న రాజ్యమందిరం 2019​లో (ఎడమ), నేడు (కుడి)

2022, మే 17 కల్లా యుక్రెయిన్‌ నుండి మాకు ఈ క్రింది సమాచారం అందింది. అయితే ఈ గణాంకాలు స్థానిక సహోదరులు ఇచ్చిన రిపోర్టుల ప్రకారం తయారుచేసినవి. వాస్తవానికి ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్లతో మాట్లాడడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు.

మన సహోదర సహోదరీల పరిస్థితి

  • 37 మంది ప్రచారకులు చనిపోయారు

  • 74 మంది ప్రచారకులకు గాయాలయ్యాయి

  • 45,253 మంది సహోదర సహోదరీలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు

  • 418 ఇళ్లు ధ్వంసం అయ్యాయి

  • 466 ఇళ్లు బాగా దెబ్బతిన్నాయి

  • 1,213 ఇళ్లు కొద్దిగా దెబ్బతిన్నాయి

  • 4 రాజ్యమందిరాలు ధ్వంసం అయ్యాయి

  • 8 రాజ్యమందిరాలు బాగా దెబ్బతిన్నాయి

  • 33 రాజ్యమందిరాలు కొద్దిగా దెబ్బతిన్నాయి

సహాయక చర్యలు

  • యుక్రెయిన్‌లో 27 DRCలు పనిచేస్తున్నాయి

  • 48,806 మంది ప్రచారకులకు DRCల వల్ల సురక్షిత ప్రాంతాల్లో ఉండడానికి చోటు దొరికింది

  • 21,786 మంది ప్రచారకులు వేరే దేశాలకు వెళ్లిపోయారు, అక్కడున్న తోటి ఆరాధకులు వాళ్లకు సహాయం చేస్తున్నారు