కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కావలికోట నం. 2 2017 | దేవుని అత్యంత గొప్ప బహుమానాన్ని మీరు అందుకుంటారా?

మీరేమంటారు?

దేవుడు మనకు ఇచ్చిన అతి గొప్ప బహుమానం ఏంటి?

బైబిలు ఇలా చెప్తుంది:“దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు, ఎంతగా అంటే వాళ్లకోసం తన ఒక్కగానొక్క కొడుకును ఇచ్చాడు.”యోహాను 3:16.

కావలికోట దేవుడు యేసును మనకోసం చనిపోవడానికి భూమి మీదకు ఎందుకు పంపించాడు, మనం ఆ బహుమానానికి ఎలా కృతజ్ఞత చూపించవచ్చు అనే విషయాలు వివరిస్తుంది.

 

ముఖపేజీ అంశం

ఇలాంటి బహుమానం ఇంకెక్కడా లేదు

బైబిలు వెలకట్టలేని ఒక బహుమానాన్ని వర్ణిస్తుంది. దాన్ని పొందిన వారికి శాశ్వత జీవితం వస్తుంది. అలాంటి విలువైన బహుమానం వేరొకటి ఉంటుందా?

ముఖపేజీ అంశం

దేవుడు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమానం ఎందుకు అంత అమూల్యమైంది?

ఒక బహుమానాన్ని మిగతా బహుమానాలకన్నా విలువైనదిగా చేసే విషయాలు ఏంటి? ఆ విషయాలు గురించి ఆలోచించడం వల్ల విమోచన క్రయధనం పైన మన కృతజ్ఞత పెరుగుతుంది.

ముఖపేజీ అంశం

దేవుడు ఇచ్చిన అత్యంత గొప్ప బహుమానానికి మీరు ఎలా స్పందిస్తారు?

క్రీస్తు ప్రేమ మనం ఏమి చేసేలా బలంగా పురికొల్పుతుంది?

క్రైస్తవ మతగురువులు పెళ్లికి, లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలా?

కొన్ని మతాలకు చెందిన మతనాయకులు, గురువులు బ్రహ్మచారులుగా ఉండాలనే నియమం ఉంది. కానీ దీని గురించి లేఖనాలు ఏమి చెప్తున్నాయి?

బానిసత్వం నుండి విడుదల​—⁠అప్పుడు, ఇప్పుడు

పూర్వకాలాల్లో దేవుని ప్రజలు బానిసత్వాన్ని తప్పించుకున్నారు. కానీ విచారకరంగా లక్షలమంది ఇంకా ఈ అన్యాయాన్ని భరిస్తూ ఉన్నారు.

ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని రుచి చూడండి

ఇవ్వడం మీకు, ఇతరులకు మంచి చేస్తుంది. ఇవ్వడం వల్ల సహకారం, స్నేహం పెరుగుతాయి. ఆనందంగా ఇవ్వాలంటే మీరు ఏమి చేయవచ్చు?

బైబిలు ఏం చెప్తుంది?

చివరి రోజులు, ప్రమాదకరంగా, కష్టంగా ఉంటాయని బైబిలు చెప్తుంది. మనం జీవించే కాలంలో ఇలాంటి విషయాలే జరుగుతున్నాయా?

ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి

యేసు బలి, “అనేకుల కోసం విమోచన క్రయధనం” ఎలా అయ్యింది?

విమోచన క్రయధనం మనల్ని పాపం నుండి ఎలా విడుదల చేస్తుంది?