కావలికోట—అధ్యయన ప్రతి అక్టోబరు 2019

ఈ సంచికలో డిసెంబరు 2-29, 2019 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉంటాయి.

1919—వంద సంవత్సరాల క్రితం

1919లో ముందెప్పటికన్నా ఎక్కువ ప్రకటించేలా యెహోవా తన ప్రజలకు శక్తిని ఇచ్చాడు. కానీ దానికన్నా ముందు, బైబిలు విద్యార్థుల పరిస్థితిలో పెద్ద మార్పు జరగాల్సివుంది.

దేవుని తీర్పులు​—అమలు చేసే ముందు సరిపడా సమయం ఇస్తాడా?

నేడు కనీవినీ ఎరుగని ఒక భయంకరమైన “తుఫాను” రాబోతుందని యెహోవా హెచ్చరిస్తున్నాడు. ఇంతకీ ఆయన ఆ పనిని ఎలా చేస్తున్నాడు?

‘అంత్యదినాల’ చివర్లో ఎక్కువ సేవచేయండి

‘అంత్యదినాల’ చివర్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి? వాటికోసం ఎదురుచూస్తుండగా మనం ఏం చేయాలని యెహోవా కోరుకుంటున్నాడు?

“మహాశ్రమ” కాలంలో నమ్మకంగా ఉండండి

“మహాశ్రమ” కాలంలో యెహోవా మన నుండి ఏం కోరుకుంటాడు? ఆ సమయంలో మనం నమ్మకంగా ఉండడానికి మనం ఇప్పుడే ఎలా సిద్ధపడవచ్చు?

మీరు ఏం అయ్యేలా యెహోవా చేయగలడు?

బైబిలు కాలాల్లో, తన ఇష్టాన్ని చేయాలనే కోరికను, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని యెహోవా తన సేవకులకు ఇచ్చాడు. నేడు మనం ఆయన్ని సేవించడానికి కావాల్సినవాటిని ఎలా ఇస్తాడు?

యెహోవాను మాత్రమే ఆరాధించండి

మనం యెహోవాను మాత్రమే ఆరాధిస్తున్నామో లేదో తెలుసుకోవడానికి మన జీవితంలో రెండు రంగాల్ని పరిశీలించండి.