బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?

మనం ఎందుకు బాధలు పడుతున్నాం? చనిపోయినప్పుడు ఏమి జరుగుతుంది? కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలి ... లాంటి ఎన్నో అంశాల గురించి బైబిలు ఏమి చెబుతుందో తెలుసుకోవడానికి రూపొందించిన బైబిలు అధ్యయన సహాయకమే ఈ పుస్తకం.

దేవుడు సంకల్పించింది ఇదేనా?

ఈ రోజుల్లో ఇన్ని సమస్యలు ఎందుకున్నాయని మీరు ఆలోచిస్తుండవచ్చు. ఒక పెద్ద మార్పు జరగనుందని, దానివల్ల మీరు ప్రయోజనం పొందవచ్చని బైబిలు చెబుతోందనే విషయం మీకు తెలుసా?

ఒకటవ అధ్యాయం

దేవుని గురించిన సత్యం ఏమిటి?

దేవునికి మీమీద శ్రద్ధ ఉందని మీకనిపిస్తుందా? ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయనకెలా సన్నిహితం కావచ్చనే దాని గురించి తెలుసుకోండి.

రెండవ అధ్యాయం

బైబిలు—దేవుడు ఇచ్చిన గ్రంథం

వ్యక్తిగత సమస్యలతో వ్యవహరించడానికి బైబిలు మీకు ఎలా సహాయం చేస్తుంది? అందులోని ప్రవచనాల్ని మీరు ఎందుకు నమ్మవచ్చు?

మూడవ అధ్యాయం

భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటి?

భూమిపట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఎప్పటికైనా నెరవేరుతుందా? అయితే, ఎప్పుడు నెరవేరుతుంది?

నాల్గవ అధ్యాయం

యేసుక్రీస్తు ఎవరు?

దేవుడు వాగ్దానం చేసిన మెస్సీయ యేసేనని మనకెలా తెలుసు? ఆయన ఎక్కడనుండి వచ్చాడు? ఆయన యెహోవాకు అద్వితీయ కుమారుడని ఎలా చెప్పవచ్చు? వీటికి జవాబులు తెలుసుకోండి.

ఐదవ అధ్యాయం

విమోచన క్రయధనం—దేవుడిచ్చిన అతిగొప్ప బహుమానం

విమోచన క్రయధనం అంటే ఏంటి? మీరు దాన్నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?

ఆరవ అధ్యాయం

చనిపోయినవారు ఎక్కడ ఉన్నారు?

చనిపోయినవాళ్లు ఎక్కడున్నారు? మనుషులు ఎందుకు చనిపోతున్నారు? వీటి గురించి బైబిలు ఏమి చెబుతుందో తెలుసుకోండి.

ఎనిమిదవ అధ్యాయం

దేవుని రాజ్యం అంటే ఏమిటి?

ప్రభువు ప్రార్థన చాలామందికి తెలుసు. “నీ రాజ్యము వచ్చుగాక” అనే మాటలకు అర్థమేమిటి?

తొమ్మిదవ అధ్యాయం

మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామా?

మన చుట్టూ జరిగే విషయాలు, ప్రజల స్వభావం మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామని ఎలా రుజువు చేస్తున్నాయో పరిశీలించండి.

పదవ అధ్యాయం

ఆత్మ ప్రాణులు—మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తారు?

బైబిల్లో దేవదూతలు, దయ్యాల గురించి ఉంది. ఈ ఆత్మ ప్రాణులు నిజమైనవాళ్లేనా? వాళ్లు మీ జీవితం మీద ప్రభావం చూపించగలరా?

పదకొండవ అధ్యాయం

దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడు?

లోకంలోని బాధలన్నిటికీ దేవుడే కారణమని చాలామంది అనుకుంటారు. మరి మీరు ఏమంటారు? బాధలకు దేవుడు చెప్పే కారణాలను తెలుసుకోండి.

పన్నెండవ అధ్యాయం

దేవునికి సంతోషం కలిగించే విధంగా జీవించడం

దేవునికి సంతోషం కలిగించే విధంగా జీవించడం సాధ్యమే. నిజానికి మీరు ఆయనకు స్నేహితులు కూడా అవ్వవచ్చు.

పదమూడవ అధ్యాయం

జీవం విషయంలో దేవుని దృక్కోణం

గర్భస్రావం, రక్తమార్పిడులు, జంతువుల ప్రాణం వంటి విషయాల్లో దేవుని దృక్కోణం ఏంటి?

పధ్నాలుగవ అధ్యాయం

మీ కుటుంబ జీవితాన్ని ఎలా సంతోషభరితం చేసుకోవచ్చు?

యేసు చూపించిన ప్రేమ భర్తలకు, భార్యలకు, తల్లదండ్రులకు, పిల్లలకు మంచి ఆదర్శం. ఆయన నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

పదిహేనవ అధ్యాయం

దేవుడు ఆమోదించే ఆరాధన

సత్యారాధకులకు ఉండాల్సిన 6 గుర్తులను పరిశీలించండి.

పదహారవ అధ్యాయం

సత్యారాధన పక్షాన స్థిరంగా నిలబడండి

మీ నమ్మకాల గురించి ఇతరులతో చెబుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవచ్చు? వాళ్లకు కోపం తెప్పించకుండా మీ నమ్మకాల గురించి ఎలా మాట్లాడవచ్చు?

పదిహేడవ అధ్యాయం

ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి

మీ ప్రార్థనలను దేవుడు వింటున్నాడా? అది తెలుసుకోవాలంటే ప్రార్థన గురించి బైబిలు ఏమి చెబుతుందో అర్థంచేసుకోవాలి.

పద్దెనిమిదవ అధ్యాయం

బాప్తిస్మం, దేవునితో మీ సంబంధం

క్రైస్తవ బాప్తిస్మం పొందడానికి ఎలా అర్హులు కావచ్చు? అది దేన్ని సూచిస్తుంది? బాప్తిస్మం ఎలా ఇవ్వాలి? వంటివాటి గురించి తెలుసుకోండి.

పంతొమ్మిదవ అధ్యాయం

దేవుని ప్రేమలో నిలిచి ఉండండి

దేవుడు చేసిన వాటన్నిటి పట్ల ప్రేమ, కృతజ్ఞత ఎలా చూపించవచ్చు?

అనుబంధం

దేవుని పేరు—దానిని ఉపయోగించడం, దాని అర్థం

చాలా బైబిలు అనువాదాల్లో నుండి దేవుని పేరు తీసేశారు. ఎందుకు? దేవుని పేరు ఉపయోగించడం ప్రాముఖ్యమేనా?

అనుబంధం

మెస్సీయ రావడాన్ని దానియేలు ప్రవచనం తెలియజేసిన విధానం

500 ఏళ్లకన్నా ముందే మెస్సీయ ఎప్పుడు వస్తాడో దేవుడు ఖచ్చితంగా తెలియజేశాడు. ఆసక్తికరమైన ఆ ప్రవచనం గురించి తెలుసుకోండి!

అనుబంధం

యేసుక్రీస్తు—వాగ్దానం చేయబడిన మెస్సీయ

మెస్సీయ గరించి బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నీ యేసు నెరవేర్చాడు. వివరాలతో సహా ఆ ప్రవచనాలు ఎలా నెరవేరాయో మీ బైబిల్లోనే చూడండి.

అనుబంధం

తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలకు సంబంధించిన సత్యం

బైబిలు త్రిత్వ సిద్ధాంతం గురించి చెబుతుందని చాలామంది నమ్ముతుంటారు. అది నిజమేనా?

అనుబంధం

నిజ క్రైస్తవులు సిలువను ఎందుకు ఆరాధించరు?

యేసు నిజంగా సిలువమీద చనిపోయాడా? సమాధానం నేరుగా బైబిల్లోనే చదవండి.

అనుబంధం

ప్రభువు రాత్రి భోజనం—దేవుణ్ణి మహిమపరిచే ఆచరణ

క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకోవాలని క్రైస్తవులకు ఆజ్ఞ ఉంది. అది ఎప్పుడు జరుపుకోవాలి? దాన్ని ఎలా జరుపుకోవాలి?

అనుబంధం

మానవుల్లో అదృశ్యమైన, అమర్త్యమైన భాగం ఏదైనా నిజంగా ఉందా?

చనిపోయినప్పుడు మనలోని ఏదో అదృశ్య భాగం శరీరాన్ని విడిచివెళ్లి జీవిస్తూనే ఉంటుందని చాలామంది అనుకుంటారు. దాని గురించి దేవుని వాక్యం ఏమి చెబుతుంది?

అనుబంధం

షియోల్‌, హేడిస్‌ అంటే ఏమిటి?

కొన్ని బైబిలు అనువాదాలు షియోల్‌, హేడిస్‌ అనే మాటలకు బదులు “సమాధి” లేదా “నరకం” వంటి పదాలు వాడాయి. ఇంతకీ వాటి అసలు భావం ఏమిటి?

అనుబంధం

తీర్పుదినం—అంటే ఏమిటి?

నమ్మకంగా ఉండే మానవులందరికీ తీర్పుదినం ఎలా ఆశీర్వాదాలు తీసుకొస్తుందో తెలుసుకోండి.

అనుబంధం

1914—బైబిలు ప్రవచనాల్లో గమనార్హమైన సంవత్సరం

1914 గమనార్హమైన సంవత్సరం అనడానికి బైబిల్లో ఎలాంటి రుజువులు ఉన్నాయి?

అనుబంధం

ప్రధానదూతయైన మిఖాయేలు ఎవరు?

శక్తిమంతుడైన ఈ ప్రధానదూత ఎవరో బైబిలు చెబుతుంది. ఆయన గురించి, ఆయన ఇప్పుడు ఏంచేస్తున్నాడనే దాని గురించి ఎక్కువగా తెలుసుకోండి

అనుబంధం

“మహా బబులోనును” గుర్తించడం

ప్రకటన పుస్తకం, “మహా బబులోను” అనే స్త్రీ గురించి మాట్లాడుతుంది. ఆమె నిజమైన స్త్రీనా? ఆమె గురించి బైబిలు ఏమి చెబుతుంది?

అనుబంధం

యేసు డిసెంబరులో జన్మించాడా?

యేసు పుట్టిన సమయంలో వాతావరణం ఎలా ఉండేదో పరిశీలించండి. అది మనకు ఏమి చెబుతుంది?

అనుబంధం

మనం సెలవుదినాలను ఆచరించాలా?

నేటి ప్రసిద్ధ సెలవుదినాలు ఎలా ఆరంభమయ్యాయి? ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు.