యెహోవాకు సన్నిహితమవండి

తనకు సన్నిహితమవమని దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. అదెలా చేయవచ్చో బైబిలు ఉపయోగించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం సహాయం చేస్తుంది.

పీఠిక

ఎప్పటికీ నిలిచివుండే బంధాన్ని మీరు యెహోవా దేవునితో ఏర్పర్చుకోవచ్చు.

అధ్యాయం 1

‘ఇదిగో! మన దేవుడు’

దేవుని పేరు ఏమిటో ముందే తెలిసినా మోషే ఆయన పేరు గురించి ఎందుకు అడిగాడు?

అధ్యాయం 2

మీరు నిజంగా ‘దేవునికి సన్నిహితం’ కాగలరా?

భూమ్యాకాశాలను సృష్టించిన యెహోవా దేవుడు మనకు ఒక అహ్వానం ఇస్తున్నాడు, ఒక వాగ్దానం చేస్తున్నాడు.

అధ్యాయం 3

“యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు”

బైబిలు, పరిశుద్ధతను అందంతో ఎందుకు ముడిపెడుతుంది?

అధ్యాయం 4

“యెహోవా . . . మహాబలము గలవాడు”

దేవుని శక్తి చూసి మనం భయపడాలా? అవును, కాదు రెండూ సరైన జవాబులే.

అధ్యాయం 5

సృష్టి శక్తి—“భూమ్యాకాశములను సృజించిన యెహోవా”

ఎంతో పెద్దదైన సూర్యుడు మొదలుకొని అతి చిన్నదైన తేనె పిట్ట వరకు, దేవుడు సృష్టించినవన్నీ ఆయన గురించి ఏదోక ముఖ్యమైన విషయం నేర్పిస్తాయి.

అధ్యాయం 6

నాశక శక్తి—“యెహోవా యుద్ధశూరుడు”

సమాధానకర్తయైన దేవుడు ఎలా యుద్ధం చేయగలడు?

అధ్యాయం 7

రక్షణ శక్తి—“దేవుడు మనకు ఆశ్రయము”

దేవుడు తన సేవకులను రెండు విధాలుగా కాపాడుతున్నాడు, వాటిలో ఒకటి రెండవ దానికన్నా చాలా ప్రాముఖ్యమైనది.

అధ్యాయం 8

పునరుద్ధరణ శక్తి—యెహోవా “సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు”

యెహోవా ఇప్పటికే స్వచ్ఛారాధనను పునరుద్ధరించాడు. భవిష్యత్తులో ఆయన వేటిని పునరుద్ధరిస్తాడు?

అధ్యాయం 9

‘క్రీస్తు దేవుని శక్తిగా ఉన్నాడు’

యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు, బోధలు యెహోవా గురించి ఏమి చెబుతాయి?

అధ్యాయం 10

మీ బలాన్ని ఉపయోగించడంలో ‘దేవునిపోలి నడుచుకోండి’

మీరు అనుకున్నదాని కన్నా ఎక్కువ శక్తే మీకు ఉండవచ్చు. దాన్ని సరైన విధంగా ఉపయోగించడం ఎలా?

అధ్యాయం 11

“ఆయన చర్యలన్నియు న్యాయములు”

దేవుని న్యాయం మనల్ని ఆయనకు ఎందుకు దగ్గర చేస్తుంది?

అధ్యాయం 12

“దేవునియందు అన్యాయము కలదా?”

అన్యాయాన్ని యెహోవా అసహ్యించుకుంటే, లోకం ఎందుకు అన్యాయాలతో నిండిపోయింది?

అధ్యాయం 13

‘యెహోవా ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది’

న్యాయ వ్యవస్థ మనలోని ప్రేమను ఎలా పెంచుతుంది?

అధ్యాయం 14

యెహోవా “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము” సమకూరుస్తున్నాడు

సరళమైనదే అయినా లోతైన ఒక బోధ దేవునికి సన్నిహితమవడానికి మీకు సహాయం చేయగలదు.

అధ్యాయం 15

యేసు ‘భూలోకమున న్యాయము స్థాపిస్తాడు’

యేసు గతంలో ఎలా న్యాయాన్ని స్థాపించాడు? అది ఇప్పుడెలా చేస్తున్నాడు? అందుకు భవిష్యత్తులో ఏమి చేస్తాడు?

అధ్యాయం 16

దేవుని ఎదుట ‘న్యాయముగా నడుచుకోండి’

“తీర్పు తీర్చకుడి” అని యేసు ఎందుకు హెచ్చరించాడు?

అధ్యాయం 17

‘ఆహా, దేవుని జ్ఞాన బాహుళ్యమెంత గంభీరము!’

దేవుని జ్ఞానం ఆయనకున్న విషయ పరిజ్ఞానం, అవగాహన, వివేచన కన్నా ఎందుకు గొప్పది?

అధ్యాయం 18

‘దేవుని వాక్యంలోని’ జ్ఞానము

బైబిలును దేవుడే స్వయంగా రూపొందించకుండా లేదా దేవదూతలను ఉపయోగించి రాయించకుండా మనుషులను ఉపయోగించి ఎందుకు రాయించాడు?

అధ్యాయం 19

‘పరిశుద్ధ మర్మంలోని దేవుని జ్ఞానము’

ఒకప్పుడు దేవుడు దాచివుంచిన, ఇప్పుడు వెల్లడిచేసిన పరిశుద్ధ మర్మం ఏమిటి?

అధ్యాయం 20

‘జ్ఞాన హృదయుడు’—అయినా వినయస్థుడే

విశ్వానికే సర్వోన్నత ప్రభువైన వ్యక్తి వినయస్థునిగా ఉండడం ఎలా సాధ్యం?

అధ్యాయం 21

యేసు ‘దేవుని జ్ఞానమును’ వెల్లడిచేయడం

యేసు బోధలు విన్నప్పుడు, ఆయనను బంధించడానికి వచ్చిన సైనికులు వట్టి చేతులతో ఎందుకు తిరిగివెళ్లారు?

అధ్యాయం 22

“పైనుండివచ్చు జ్ఞానము”ను మీరు ఆచరణలో పెడుతున్నారా?

పైనుండివచ్చు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సహాయపడే నాలుగు విషయాల గురించి బైబిలు వర్ణిస్తుంది.

అధ్యాయం 23

“ఆయనే మొదట మనలను ప్రేమించెను”

“దేవుడు ప్రేమాస్వరూపి” అనే మాటలకు అర్థమేమిటి?

అధ్యాయం 24

ఏదీ ‘మనల్ని దేవుని ప్రేమనుండి ఎడబాపలేదు’

దేవుడు మిమ్మల్ని ప్రేమించడు, విలువైనవారిగా ఎంచడనే అబద్ధాన్ని నమ్మకండి.

అధ్యాయం 25

“మన దేవుని మహా వాత్సల్యము”

దేవునికి మీపట్ల ఉన్న భావాలు, తల్లికి తన బిడ్డపట్ల ఉండే భావాలు ఏ విధంగా ఒకేలాంటివి?

అధ్యాయం 26

“క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడు

దేవునికి అన్నీ గుర్తుంటాయి, అలాంటప్పుడు ఆయన ఏ భావంలో క్షమించి మర్చిపోతాడు?

అధ్యాయం 27

‘ఆహా, ఆయన మంచితనం ఎంత గొప్పది!’

అసలు, దేవుని మంచితనం అంటే ఏమిటి?

అధ్యాయం 28

‘నీవు మాత్రమే విశ్వసనీయుడవు’

దేవుని నమ్మకత్వం కన్నా ఆయన విశ్వసనీయత ఎందుకు గొప్పది?

అధ్యాయం 29

‘క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం’

యేసు ప్రేమకున్న మూడు ముఖరూపాలు యెహోవా ప్రేమను పరిపూర్ణంగా ప్రతిబింబిస్తాయి.

అధ్యాయం 30

‘ప్రేమ కలిగి నడుచుకోండి’

మనం ప్రేమ చూపించే 14 మార్గాల గురించి మొదటి కొరింథీయులు ప్రత్యేకంగా చెబుతుంది.

అధ్యాయం 31

‘దేవునికి సన్నిహితమవండి, అప్పుడాయన మీకు సన్నిహితమవుతాడు’

మిమ్మల్ని మీరు వేసుకునే అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటి? దానికి మీరెలా జవాబిస్తారు?