యేసే మార్గం, సత్యం, జీవం

యేసుకు సంబంధించి బైబిల్లో నమోదైన ప్రతీ సంఘటన గురించి ఈ పుస్తకంలో చదివి తెలుసుకోండి.

ముందుమాట

మార్గం, సత్యం, జీవం

సువార్త పుస్తకాల్లో ఉన్న యేసు బోధలు, పనులు మీ జీవితాన్ని మార్చేయగలవు.

1వ అధ్యాయం

దేవుని నుండి వచ్చిన రెండు సందేశాలు

నమ్మడానికి కష్టంగా ఉన్న రెండు సందేశాల్ని గబ్రియేలు దూత తీసుకొచ్చాడు.

2వ అధ్యాయం

పుట్టకముందే యేసు ఘనత పొందాడు

ఎలీసబెతు, అలాగే ఇంకా పుట్టని ఆమె కుమారుడు యేసును ఎలా ఘనపర్చారు?

3వ అధ్యాయం

మార్గం సిద్ధం చేసే వ్యక్తి పుట్టాడు

అద్భుతరీతిలో మాటలు తిరిగి రాగానే జెకర్యా ఒక ముఖ్యమైన ప్రవచనం చెప్పాడు.

4వ అధ్యాయం

మరియ పెళ్లికాకుండానే గర్భవతి అయింది

తాను వేరే పురుషుని వల్ల కాదుగానీ పవిత్రశక్తి వల్లే గర్భవతి అయ్యానని మరియ యోసేపుకు చెప్పింది. మరి అతను నమ్మాడా?

5వ అధ్యాయం

యేసు ఎప్పుడు, ఎక్కడ పుట్టాడు?

యేసు డిసెంబరు 25న పుట్టలేదని మనకెలా తెలుసు?

6వ అధ్యాయం

దేవుడు వాగ్దానం చేసిన శిశువు

యోసేపు మరియలు పసివాడైన యేసును ఆలయానికి తీసుకెళ్లారు. అప్పుడు వయసుపైబడిన ఇద్దరు ఇశ్రాయేలీయులు యేసు గురించి ప్రవచించారు.

7వ అధ్యాయం

యేసును చూడడానికి జ్యోతిష్యులు వచ్చారు

జ్యోతిష్యులు తూర్పున ఉన్నప్పుడు చూసిన నక్షత్రం, మొదట యేసు దగ్గరికి నడిపించకుండా, యేసును చంపాలని చూస్తున్న హేరోదు రాజు దగ్గరికి ఎందుకు నడిపించింది?

8వ అధ్యాయం

వాళ్లు దుష్ట పరిపాలకుని నుండి తప్పించుకున్నారు

యేసు చిన్నతనంలో మూడు బైబిలు ప్రవచనాలు నెరవేరాయి.

9వ అధ్యాయం

యేసు నజరేతులో పెరిగాడు

యేసుకు ఎంతమంది తమ్ముళ్లు, చెల్లెళ్లు ఉన్నారు?

10వ అధ్యాయం

యేసు కుటుంబం యెరూషలేముకు వెళ్లడం

యోసేపు, మరియలు యేసు కోసం కంగారుకంగారుగా వెతుకుతున్నారు. తనను ఎక్కడ వెదకాలో వాళ్లకు తెలియనందుకు యేసు ఆశ్చర్యపోయాడు.

11వ అధ్యాయం

బాప్తిస్మమిచ్చే యోహాను మార్గాన్ని సిద్ధం చేశాడు

కొంతమంది పరిసయ్యులు, సద్దూకయ్యులు తన దగ్గరికి వచ్చినప్పుడు యోహాను వాళ్లను గద్దించాడు. ఎందుకు?

12వ అధ్యాయం

యేసు బాప్తిస్మం తీసుకున్నాడు

యేసు ఏ పాపం చేయకపోయినా ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు?

13వ అధ్యాయం

యేసులా ప్రలోభాల్ని తిప్పికొట్టండి

యేసుకు ఎదురైన ప్రలోభాన్ని పరిశీలిస్తే, సాతాను గురించి రెండు ముఖ్యమైన విషయాలు వెల్లడి అవుతున్నాయి.

14వ అధ్యాయం

యేసు శిష్యుల్ని చేసుకోవడం మొదలుపెట్టాడు

కొత్తగా శిష్యులైన ఈ ఆరుగురికి యేసే మెస్సీయ అని ఎలా నమ్మకం కుదిరింది?

15వ అధ్యాయం

యేసు చేసిన మొదటి అద్భుతం

తాను ఏం చేయాలో పరలోక తండ్రే చెప్పాలి కానీ, కుటుంబ సభ్యులు కాదని యేసు తన తల్లికి సూచించాడు.

16వ అధ్యాయం

సత్యారాధన విషయంలో యేసుకున్న ఆసక్తి

బలులు అర్పించడం కోసం జంతువుల్ని కొనుక్కోవడాన్ని ధర్మశాస్త్రం అనుమతించింది కదా, మరి ఆలయంలోని వ్యాపారస్థుల మీద యేసు ఎందుకు కోప్పడ్డాడు?

17వ అధ్యాయం

యేసు రాత్రిపూట నీకొదేముకు బోధించాడు

‘మళ్లీ పుట్టడం’ అంటే అర్థం ఏమిటి?

18వ అధ్యాయం

యేసు ఎక్కువవడం, యోహాను తగ్గిపోవడం

బాప్తిస్మమిచ్చే యోహాను అసూయపడలేదు గానీ అతని శిష్యులు అసూయపడ్డారు.

19వ అధ్యాయం

యేసు సమరయ స్త్రీకి బోధించాడు

యేసు ఇంతవరకు ఎవ్వరికీ చెప్పని ఓ సత్యాన్ని సమరయ స్త్రీకి వెల్లడి చేశాడు.

20వ అధ్యాయం

కానాలో చేసిన రెండో అద్భుతం

యేసు దాదాపు 26 కిలోమీటర్ల దూరం నుండే ఒక అబ్బాయిని బాగుచేశాడు.

21వ అధ్యాయం

యేసు నజరేతులోని సమాజమందిరానికి వెళ్లాడు

యేసు చెప్పిన ఏ విషయం వల్ల, తన సొంత ఊరి ప్రజలు ఆయన్ని చంపాలనుకున్నారు?

22వ అధ్యాయం

నలుగురు శిష్యులు మనుషుల్ని పట్టే జాలర్లు అవుతారు

చేపలు పట్టడం ఆపేసి, మనుషుల్ని పట్టమని యేసు వాళ్లను ఆహ్వానించాడు.

23వ అధ్యాయం

యేసు కపెర్నహూములో అద్భుతాలు చేశాడు

యేసు చెడ్డదూతల్ని వెళ్లగొట్టినప్పుడు, ఆయన దేవుని కుమారుడని వాళ్లు చెప్పేవాళ్లు. యేసు వాళ్లను ఎందుకు గద్దించాడు?

24వ అధ్యాయం

గలిలయలో విస్తృతంగా పరిచర్య చేయడం

యేసు తమను బాగుచేయాలని ప్రజలు కోరుకున్నారు. కానీ తాను వచ్చింది అద్భుతాలు చేయడానికి కాదు గానీ, అంతకంటే ప్రాముఖ్యమైన పని కోసమని ఆయన వివరించాడు.

25వ అధ్యాయం

యేసు కనికరంతో ఒక కుష్ఠురోగిని బాగుచేశాడు

యేసు ఇతరుల్ని బాగుచేస్తున్నప్పుడు, వాళ్లను ముట్టుకోవడం ద్వారా వాళ్లపట్ల తనకు ఎంత శ్రద్ధ ఉందో చూపించాడు. అలా ముట్టుకోవడం చిన్న పనిలా అనిపించవచ్చు గానీ గొప్ప ప్రభావం చూపిస్తుంది.

26వ అధ్యాయం

“నీ పాపాలు క్షమించబడ్డాయి”

పాపానికి, అనారోగ్యానికి సంబంధం ఉందని యేసు ఎలా చూపించాడు?

27వ అధ్యాయం

యేసు మత్తయిని ఆహ్వానించాడు

పాపులతో కలిసి యేసు ఎందుకు భోజనం చేశాడు?

28వ అధ్యాయం

యేసు శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు?

యేసు ద్రాక్షతిత్తుల ఉదాహరణ చెప్పాడు.

29వ అధ్యాయం

విశ్రాంతి రోజున మంచి పనులు చేయవచ్చా?

38 ఏళ్లుగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని బాగు చేసినందుకు సంతోషించాల్సిందిపోయి యూదులు యేసును ఎందుకు విమర్శించారు?

30వ అధ్యాయం

యేసుకు తండ్రితో ఉన్న సంబంధం

యేసు తనను తాను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడని యూదులు అనుకున్నారు. కానీ తాను దేవుని కంటే గొప్పవాణ్ణి కాదని యేసు స్పష్టం చేశాడు.

31వ అధ్యాయం

విశ్రాంతి రోజున ధాన్యం వెన్నులు తుంచడం

యేసు తనను “విశ్రాంతి రోజుకు ప్రభువు” అని ఎందుకు అన్నాడు?

32వ అధ్యాయం

విశ్రాంతి రోజున ఏమి చేయడం సరైనది?

సద్దూకయ్యులకు, పరిసయ్యులకు ఒకరంటే ఒకరికి పడదు, కానీ ఒక విషయంలో మాత్రం వాళ్లు ఒక్కటయ్యారు.

33వ అధ్యాయం

యెషయా ప్రవచనాన్ని యేసు నెరవేర్చాడు

యేసు ఎవర్నైనా బాగుచేసినప్పుడు తాను ఎవరో, తాను ఏం చేశాడో ఇతరులకు చెప్పొద్దని ఎందుకు ఆజ్ఞాపించేవాడు?

34వ అధ్యాయం

యేసు పన్నెండుమంది అపొస్తలుల్ని ఎంచుకున్నాడు

అపొస్తలులకు, శిష్యులకు తేడా ఏంటి?

35వ అధ్యాయం

పేరుగాంచిన కొండమీది ప్రసంగం

కొండమీది ప్రసంగంలో యేసు బోధించిన ముఖ్యమైన విషయాలు, వాటి వివరణ తెలుసుకోండి.

36వ అధ్యాయం

ఒక సైనికాధికారి గొప్ప విశ్వాసం చూపించాడు

సైనికాధికారి చేసిన ఏ పనిని బట్టి యేసు ఆశ్చర్యపోయాడు?

37వ అధ్యాయం

యేసు ఒక విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు

ఆ అద్భుతం చూసినవాళ్లు దాని అసలు ప్రాముఖ్యతను గ్రహించారు.

38వ అధ్యాయం

యోహాను స్వయంగా యేసు నుండే వినాలనుకున్నాడు

యేసు మెస్సీయానా కాదా అని బాప్తిస్మమిచ్చే యోహాను ఎందుకు అడిగాడు? అతనికి సందేహాలు ఉన్నాయా?

39వ అధ్యాయం

స్పందించని తరంవాళ్లకు శ్రమ

తన పరిచర్యకు కేంద్రంగా ఉన్న కపెర్నహూము గురించి మాట్లాడుతూ, తీర్పు రోజున దాని పరిస్థితి సొదొమ పరిస్థితి కన్నా ఘోరంగా ఉంటుందని యేసు అన్నాడు.

40వ అధ్యాయం

క్షమించే విషయంలో ఒక పాఠం

బహుశా వేశ్యగా జీవిస్తున్న స్త్రీతో ఆమె పాపాలు క్షమించబడ్డాయని యేసు అన్నాడు. అంటే దేవుని నియమాన్ని ఉల్లంఘించినా ఫర్వాలేదని యేసు చెప్తున్నాడా?

41వ అధ్యాయం

యేసు ఎవరి శక్తితో అద్భుతాలు చేస్తున్నాడు?

యేసుకు పిచ్చిపట్టిందని ఆయన తమ్ముళ్లు అనుకున్నారు.

42వ అధ్యాయం

యేసు పరిసయ్యుల్ని గద్దించడం

“యోనా ప్రవక్తకు సంబంధించిన సూచన” అంటే ఏంటి?

43వ అధ్యాయం

రాజ్యం గురించిన ఉదాహరణలు

పరలోక రాజ్యం గురించి వేర్వేరు అంశాల్ని వివరించడానికి యేసు ఎనిమిది ఉదాహరణలు చెప్పాడు.

44వ అధ్యాయం

యేసు తుఫానును నిమ్మళింపజేశాడు

యేసు గాలిని, అలల్ని నిమ్మళింపజేయడం ద్వారా దేవుని రాజ్యంలో జీవితం ఎలా ఉంటుందో చూపించాడు. అది ఒక ముఖ్యమైన విషయం.

45వ అధ్యాయం

యేసుకు చెడ్డదూతల మీద అధికారం ఉంది

ఒక వ్యక్తికి ఒకరి కన్నా ఎక్కువమంది చెడ్డదూతలు పడతారా?

46వ అధ్యాయం

ఒక స్త్రీ యేసు వస్త్రాన్ని ముట్టుకొని బాగైంది

హృదయాన్ని కదిలించే ఆ సందర్భంలో యేసు తన శక్తిని, కనికరాన్ని చూపించాడు.

47వ అధ్యాయం

పన్నెండేళ్ల అమ్మాయి తిరిగి బ్రతికింది!

పాప చనిపోలేదుగానీ నిద్రపోతోందని యేసు చెప్పినప్పుడు ప్రజలు నవ్వారు. వాళ్లకు తెలియని ఏ విషయం యేసుకు తెలుసు?

48వ అధ్యాయం

అద్భుతాలు చేశాడు, నజరేతులో తిరస్కరించబడ్డాడు

నజరేతులోని ప్రజలు యేసును తిరస్కరించడానికి కారణం ఆయన బోధలో, ఆయన చేసిన అద్భుతాలో కాదు. మరి ఏంటా కారణం?

49వ అధ్యాయం

గలిలయలో ప్రకటించాడు, అపొస్తలులకు శిక్షణ ఇచ్చాడు

ఏ విధంగా ‘పరలోక రాజ్యం దగ్గరపడింది’?

50వ అధ్యాయం

హింస ఎదురైనా ప్రకటించేలా శిష్యుల్ని సిద్ధం చేశాడు

అపొస్తలులు మరణానికి భయపడాల్సిన అవసరం లేనప్పుడు, ప్రకటనా పనిలో హింస ఎదురైతే పారిపొమ్మని యేసు ఎందుకు చెప్పాడు?

51వ అధ్యాయం

పుట్టినరోజు వేడుకలో హత్య

హేరోదు సలోమే నాట్యానికి ముగ్ధుడై, ఆమె ఏం అడిగినా ఇస్తానని మాటిచ్చాడు. ఇంతకీ ఆమె అడిగిన బహుమానం ఏంటి?

52వ అధ్యాయం

అద్భుతరీతిలో వేలమందికి ఆహారం పెట్టాడు

యేసు చేసిన ఈ అద్భుతం ఎంత ప్రాముఖ్యమైనదంటే, నాలుగు సువార్త వృత్తాంతాలు దాని గురించి చెప్తున్నాయి.

53వ అధ్యాయం

ప్రకృతి శక్తుల్ని నియంత్రించగల పరిపాలకుడు

యేసు నీళ్లమీద నడవడం, గాలుల్ని నిమ్మళింపజేయడం చూసి అపొస్తలులు ఏ పాఠాలు నేర్చుకున్నారు?

54వ అధ్యాయం

యేసు ‘జీవాన్నిచ్చే ఆహారం’

ఎంతో ప్రయాసపడి తనను వెతుక్కుంటూ వచ్చిన ప్రజల్ని యేసు ఎందుకు గద్దించాడు?

55వ అధ్యాయం

యేసు మాటలకు చాలామంది అభ్యంతరపడ్డారు

యేసు బోధించిన ఒక విషయానికి ప్రజలు ఎంతగా అభ్యంతరపడ్డారంటే, ఆయన శిష్యుల్లో చాలామంది ఆయన్ని వదిలి వెళ్లిపోయారు.

56వ అధ్యాయం

ఒక మనిషిని నిజంగా ఏవి అపవిత్రం చేస్తాయి?

నోట్లోకి వెళ్లేది ఒక వ్యక్తిని అపవిత్రం చేస్తుందా లేక బయటికి వచ్చేదా?

57వ అధ్యాయం

యేసు ఒక అమ్మాయిని, చెవిటి వ్యక్తిని బాగుచేశాడు

తనవాళ్లను యేసు కుక్కపిల్లలతో పోల్చినప్పుడు ఒక స్త్రీ ఎందుకు నొచ్చుకోలేదు?

58వ అధ్యాయం

అద్భుతరీతిలో ఆహారం, పరిసయ్యుల పులిసిన పిండి

యేసు ఏ పులిసిన పిండి గురించి మాట్లాడుతున్నాడో చివరికి శిష్యులకు అర్థమైంది.

59వ అధ్యాయం

మానవ కుమారుడు ఎవరు?

రాజ్యపు తాళంచెవులు అంటే ఏంటి? వాటిని ఎవరు ఉపయోగిస్తారు? ఎలా ఉపయోగిస్తారు?

61వ అధ్యాయం

చెడ్డదూత పట్టిన అబ్బాయిని యేసు బాగుచేశాడు

విశ్వాసం లేకపోవడం వల్లే చెడ్డదూతను వెళ్లగొట్టలేకపోయారని యేసు అన్నాడు. ఇంతకీ విశ్వాసం లేనిది ఆ అబ్బాయికా? అతని తండ్రికా? యేసు శిష్యులకా?

62వ అధ్యాయం

వినయం గురించి ఒక ముఖ్యమైన పాఠం

పెద్దవాళ్లు ఒక చిన్న బాబు నుండి పాఠం నేర్చుకున్నారు.

63వ అధ్యాయం

అపొస్తలులకు మరింత ముఖ్యమైన సలహా ఇచ్చాడు

సహోదరుల మధ్య పెద్దపెద్ద సమస్యలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన మూడు చర్యల గురించి యేసు చెప్పాడు.

64వ అధ్యాయం

క్షమించడం ఎంత ప్రాముఖ్యమో నేర్పించాడు

కరుణ చూపించని దాసుని ఉదాహరణ ద్వారా, మనం ఇతరుల్ని క్షమించడం దేవుని దృష్టిలో ఎంత ముఖ్యమైన విషయమో యేసు తెలియజేశాడు.

65వ అధ్యాయం

యెరూషలేముకు వెళ్లే దారిలో బోధించాడు

యేసు ముగ్గురు వ్యక్తులతో కాసేపు మాట్లాడినా, తనను వెంబడించకుండా ఆటంకపరిచే కొన్ని విషయాలేంటో గుర్తించాడు.

66వ అధ్యాయం

గుడారాల పండుగ కోసం యెరూషలేముకు వచ్చారు

యేసు మాటలు వింటున్నవాళ్లు ఆయనకు చెడ్డదూత పట్టాడని ఎందుకు అన్నారు?

67వ అధ్యాయం

“ఇప్పటివరకు ఎవ్వరూ అలా మాట్లాడలేదు”

దాదాపు యూదుల మహాసభ సభ్యులందరూ యేసుకు వ్యతిరేకంగా మాట్లాడారు, కానీ ఒక్క సభ్యుడు మాత్రం యేసు తరఫున మాట్లాడే ధైర్యం చేశాడు.

68వ అధ్యాయం

దేవుని కుమారుడు “లోకానికి వెలుగు”

“సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది” అని యేసు అన్నాడు. దేని నుండి స్వతంత్రుల్ని చేస్తుంది?

69వ అధ్యాయం

వాళ్ల తండ్రి అబ్రాహామా? అపవాదా?

నిజమైన అబ్రాహాము పిల్లల్ని ఎలా గుర్తుపట్టవచ్చో యేసు చెప్పాడు. తన తండ్రి ఎవరో కూడా ఆయన స్పష్టం చేశాడు.

70వ అధ్యాయం

పుట్టుకతోనే గుడ్డివాడైన వ్యక్తికి యేసు చూపు తెప్పించాడు

ఒక వ్యక్తి గుడ్డివాడిగా పుట్టడానికి కారణం అతని పాపమా, అతని తల్లిదండ్రులు చేసిన పాపమా అని శిష్యులు అడిగారు. యేసు ఒక గుడ్డివాడిని బాగుచేసినప్పుడు ప్రజలు రకరకాలుగా స్పందించారు.

71వ అధ్యాయం

పరిసయ్యులు చూపువచ్చిన వ్యక్తిని ప్రశ్నించారు

చూపువచ్చిన భిక్షగాడు చేసిన తర్కానికి పరిసయ్యులకు కోపం వచ్చింది. అతని తల్లిదండ్రులు భయపడినట్టే జరిగింది. పరిసయ్యులు అతన్ని సమాజమందిరం నుండి వెలివేశారు.

72వ అధ్యాయం

70 మంది శిష్యుల్ని ప్రకటించడానికి పంపించాడు

యూదయలో, యేసు 70 మందిని ఇద్దరిద్దరిగా పంపించి, రాజ్యం గురించి ప్రకటించమని చెప్పాడు. వాళ్లు ఎక్కడ ప్రకటించాలి? సమాజమందిరాల్లోనా లేక ప్రజల ఇళ్లల్లోనా?

73వ అధ్యాయం

పొరుగువాడైన సమరయుడు

పొరుగువాడైన సమరయుడి కథ ఉపయోగించి, యేసు ఎలా ఒక శక్తివంతమైన పాఠం నేర్పాడు?

74వ అధ్యాయం

ఆతిథ్యం, ప్రార్థన గురించి పాఠాలు

యేసు మార్త, మరియల ఇంటికి వెళ్లాడు. వాళ్లకు ఆతిథ్యం గురించి ఏ పాఠం నేర్పించాడు? వేటి గురించి ప్రార్థించాలో తన శిష్యులకు ఎలా నేర్పించాడు?

75వ అధ్యాయం

నిజమైన సంతోషం ఎలా పొందవచ్చో యేసు చెప్పాడు

యేసు తనను విమర్శిస్తున్నవాళ్లతో ‘దేవుని వేలు’ గురించి చెప్పాడు, అలాగే దేవుని రాజ్యం వాళ్లను ఎలా దాటి వెళ్లిపోయిందో కూడా చెప్పాడు. అంతేకాదు, ప్రజలు నిజమైన సంతోషాన్ని ఎలా పొందవచ్చో కూడా తెలియజేశాడు.

76వ అధ్యాయం

పరిసయ్యుని ఇంట్లో భోజనం చేశాడు

పరిసయ్యుల, శాస్త్రుల వేషధారణను యేసు బయటపెట్టాడు. వాళ్లు ప్రజల మీద ఎలాంటి పెద్దపెద్ద బరువులు మోపుతున్నారు?

77వ అధ్యాయం

సిరిసంపదల గురించి సలహా ఇచ్చాడు

పెద్దపెద్ద గోదాములు కట్టించుకున్న ఒక ధనవంతుని ఉదాహరణ యేసు చెప్పాడు. సిరిసంపదల కోసం ప్రాకులాడే విషయంలో యేసు ఏ హెచ్చరికను మళ్లీ ఇచ్చాడు?

78వ అధ్యాయం

నమ్మకమైన గృహనిర్వాహకుడు సిద్ధంగా ఉండాలి!

యేసు తన శిష్యుల ఆధ్యాత్మిక సంక్షేమం పట్ల శ్రద్ధ చూపించాడు. వాళ్ల ఆధ్యాత్మిక సంక్షేమం విషయంలో గృహనిర్వాహకుని పాత్ర ఏంటి? సిద్ధంగా ఉండమనే సలహా ఎందుకంత ప్రాముఖ్యమైనది?

79వ అధ్యాయం

నాశనం ఎందుకు దగ్గరపడింది?

తన మాటలు వింటున్నవాళ్లు పశ్చాత్తాపపడకపోతే నాశనం అవుతారని, వాళ్లు ప్రమాదపు అంచున ఉన్నారని యేసు చెప్పాడు. వాళ్లు దేవునితో తమకున్న సంబంధం గురించి యేసు ఏం చెప్తున్నాడో గ్రహించి, దాని నుండి పాఠం నేర్చుకుంటారా?

80వ అధ్యాయం

మంచి కాపరి, గొర్రెల దొడ్లు

కాపరికి, అతని గొర్రెలకు మధ్య ఉన్న సంబంధం, యేసుకు ఆయన శిష్యులతో ఉన్న సంబంధాన్ని చక్కగా వర్ణిస్తుంది. వాళ్లు ఆయన బోధలు విని, ఆయన వెనక వెళ్తారా?

81వ అధ్యాయం

తండ్రితో ఐక్యంగా ఉన్నాడు, కానీ దేవుడు కాదు

యేసు తనను తాను దేవునితో సమానంగా చేసుకుంటున్నాడని విమర్శకులు ఆరోపించారు. ఆయన వాళ్ల తప్పుడు ఆరోపణలను ఎలా తెలివిగా తిప్పికొట్టాడు?

82వ అధ్యాయం

యేసు పెరయలో ప్రకటించాడు

రక్షణ పొందాలంటే ఏం చేయాలో యేసు తన మాటలు వింటున్నవాళ్లకు వివరించాడు. ఆయన ఇచ్చిన సలహా ఆ కాలంలో చాలా ప్రాముఖ్యమైనది. మరి నేటి సంగతేంటి?

83వ అధ్యాయం

విందుకు ఆహ్వానించడం

యేసు ఒక పరిసయ్యుని ఇంటికి భోజనానికి వెళ్లినప్పుడు, గొప్ప విందు గురించిన ఉదాహరణ చెప్పాడు. దేవుని ప్రజలందరికీ ఉపయోగపడే ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని ఆయన తెలియజేశాడు. ఏమిటా పాఠం?

84వ అధ్యాయం

శిష్యులుగా ఉండడం చాలా పెద్ద బాధ్యత

క్రీస్తు శిష్యుడవ్వడం ఒక పెద్ద బాధ్యత. దాంట్లో ఏం ఇమిడివుందో యేసు స్పష్టం చేశాడు. ఆయన్ని అనుసరించాలనుకున్న కొంతమంది ఆయన చెప్పింది విని నిర్ఘాంతపోయి ఉంటారు.

85వ అధ్యాయం

పశ్చాత్తాపపడిన పాపి విషయంలో సంతోషించడం

యేసు సామాన్య ప్రజలతో సహవసిస్తున్నందుకు పరిసయ్యులు, శాస్త్రులు ఆయన్ని విమర్శించారు. అప్పుడు, యేసు కొన్ని ఉదాహరణల ద్వారా, దేవుడు పాపుల్ని ఎలా దృష్టిస్తాడో చెప్పాడు.

86వ అధ్యాయం

తప్పిపోయిన కుమారుడు తిరిగొచ్చాడు

యేసు చెప్పిన తప్పిపోయిన కుమారుడి ఉదాహరణ నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

87వ అధ్యాయం

ముందుచూపుతో ఉండండి, తెలివిగా నడుచుకోండి

పథకం వేసి అవినీతికి పాల్పడిన ఒక గృహనిర్వాహకుడి ఉదాహరణ ఉపయోగించి, యేసు ఒక ఆసక్తికరమైన సత్యాన్ని బోధించాడు.

88వ అధ్యాయం

ధనవంతుడు, లాజరు

యేసు చెప్పిన ఉదాహరణ అర్థమవ్వాలంటే, ముందు ఆ ఉదాహరణలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎవర్ని సూచిస్తున్నారో అర్థం చేసుకోవాలి.

89వ అధ్యాయం

యూదయకు వెళ్తూ పెరయలో బోధించాడు

మనకు వ్యతిరేకంగా పదేపదే తప్పు చేస్తున్న వ్యక్తిని సైతం క్షమించేలా సహాయం చేసే ఒక లక్షణం గురించి యేసు నొక్కిచెప్పాడు.

90వ అధ్యాయం

“చనిపోయినవాళ్లను బ్రతికించేది, జీవాన్ని ఇచ్చేది నేనే”

“నా మీద విశ్వాసం చూపించే వ్యక్తి ఎప్పటికీ చనిపోడు” అని యేసు చెప్పిన మాటలకు అర్థమేంటి?

91వ అధ్యాయం

లాజరు తిరిగి బ్రతికాడు

యేసు చేసిన ఈ అద్భుతంలో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. వాటివల్ల, ఆయన్ని వ్యతిరేకించేవాళ్లు సైతం ఆ అద్భుతాన్ని కాదనలేకపోయారు.

92వ అధ్యాయం

పదిమంది కుష్ఠురోగుల్లో ఒక్కరే కృతజ్ఞత చూపించారు

బాగైన వ్యక్తి యేసుకు మాత్రమే కాదు, మరొకరికి కూడా కృతజ్ఞతలు చెప్పాడు.

93వ అధ్యాయం

మానవ కుమారుడు బయల్పర్చబడే రోజు

క్రీస్తు ప్రత్యక్షత ఆకాశంలో మెరుపు కనిపించినట్లే ఉంటుంది అంటే అర్థమేంటి?

94వ అధ్యాయం

ప్రార్థన, వినయం చాలా ముఖ్యమైనవి

అన్యాయస్థుడైన న్యాయమూర్తి, విధవరాలి ఉదాహరణలో యేసు ఒక ముఖ్యమైన లక్షణం గురించి నొక్కిచెప్పాడు.

95వ అధ్యాయం

విడాకుల గురించి, పిల్లల్ని ప్రేమించడం గురించి బోధించాడు

పిల్లలతో వ్యవహరించే విషయంలో శిష్యులకు, యేసుకు చాలా తేడా ఉంది. ఎందుకు?

96వ అధ్యాయం

ధనవంతుడైన నాయకుడికి యేసు జవాబిచ్చాడు

ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కన్నా సూది రంధ్రం గుండా ఒంటె దూరడం తేలిక అని యేసు ఎందుకు అన్నాడు?

97వ అధ్యాయం

ద్రాక్షతోటలో పనిచేయడానికి వచ్చినవాళ్ల ఉదాహరణ

ముందున్నవాళ్లు ఎలా వెనక్కి వెళ్తారు? వెనకున్నవాళ్లు ఎలా ముందుకు వస్తారు?

98వ అధ్యాయం

అపొస్తలులు గొప్ప స్థానాల కోసం మళ్లీ ఆరాటపడ్డారు

రాజ్యంలో ప్రత్యేక స్థానాలు కావాలని యాకోబు యోహానులు యేసును అడిగారు. నిజానికి, గొప్ప స్థానాల కోసం ఆరాటపడింది వాళ్లిద్దరు మాత్రమే కాదు.

99వ అధ్యాయం

గుడ్డివాళ్లను బాగుచేశాడు, జక్కయ్యకు సహాయం చేశాడు

యేసు యెరికో నుండి వెళ్తున్నప్పుడు గుడ్డివాడిని బాగుచేశాడని ఒక వృత్తాంతం చెప్తుంది. యెరికో దగ్గరికి వస్తున్నప్పుడు బాగుచేశాడని ఇంకో వృత్తాంతం చెప్తుంది. ఆ రెండు వృత్తాంతాలు సరైనవే అని ఎలా చెప్పవచ్చు?

100వ అధ్యాయం

పది మినాల ఉదాహరణ

“ఎవరి దగ్గరైతే ఉందో, వాళ్లకు ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది; కానీ ఎవరి దగ్గరైతే లేదో, వాళ్ల దగ్గర ఉన్నది కూడా తీసేయబడుతుంది” అని యేసు చెప్పిన మాటలకు అర్థమేంటి?

101వ అధ్యాయం

బేతనియలోని సీమోను ఇంట్లో భోజనం చేయడం

లాజరు సహోదరియైన మరియ చేసిన పని ఒక వివాదాన్ని రేపింది, కానీ యేసు ఆమెను సమర్థించాడు.

102వ అధ్యాయం

రాజు గాడిదపిల్ల మీద యెరూషలేములోకి ప్రవేశించాడు

ఐదు వందల సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనాన్ని ఆయన నెరవేర్చాడు.

103వ అధ్యాయం

ఆలయాన్ని మళ్లీ శుభ్రం చేశాడు

యెరూషలేములోని వర్తకులు న్యాయంగానే వ్యాపారం చేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. మరి యేసు వాళ్లను దోపిడీదొంగలు అని ఎందుకు అన్నాడు?

104వ అధ్యాయం

యూదులు దేవుని స్వరం విన్నారు​—⁠మరి విశ్వాసం ఉంచారా?

యేసు మీద విశ్వాసం ఉంచడానికి, దానికి తగ్గట్లు చర్య తీసుకోవడానికి తేడా ఉందా?

105వ అధ్యాయం

అంజూర చెట్టు ద్వారా విశ్వాసం గురించి పాఠం నేర్పించాడు

విశ్వాసానికి ఎంత శక్తి ఉందో, దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎందుకు తిరస్కరించాడో యేసు తన శిష్యులకు వివరించాడు.

106వ అధ్యాయం

ద్రాక్షతోట గురించిన రెండు ఉదాహరణలు

ద్రాక్షతోటలో పనిచేయమని తన ఇద్దరు కుమారుల్ని అడిగిన ఒక వ్యక్తి గురించి, అలాగే చెడ్డవాళ్లకు తన ద్రాక్షతోటను కౌలుకిచ్చిన ఒక వ్యక్తి గురించి యేసు చెప్పాడు. ఆ ఉదాహరణల అర్థం ఏంటో తెలుసుకోండి.

107వ అధ్యాయం

ఒక రాజు తన కుమారుడి పెళ్లి విందుకు ఆహ్వానించాడు

నిజానికి, యేసు చెప్పిన ఆ ఉదాహరణ ఒక ప్రవచనం.

108వ అధ్యాయం

మతనాయకులు యేసును చిక్కుల్లో పెట్టలేకపోయారు

యేసు ముందుగా పరిసయ్యుల, తర్వాత సద్దూకయ్యుల నోళ్లు మూయించాడు. ఆ తర్వాత గుంపుగా కలిసి వచ్చిన ఆ వ్యతిరేకుల నోళ్లు మూయించాడు.

109వ అధ్యాయం

యేసు తన వ్యతిరేకుల్ని నిందించాడు

మతనాయకులు బోధిస్తున్నవాటిని యేసు ఎందుకు ఒప్పుకోలేదు?

110వ అధ్యాయం

యేసు ఆలయంలో గడిపిన చివరి రోజు

యేసు ఒక పేద విధవరాలిని చూపించి ప్రాముఖ్యమైన పాఠం నేర్పించాడు.

111వ అధ్యాయం

అపొస్తలులు యేసును ఒక సూచన అడిగారు

యేసు చెప్పిన ప్రవచనం మొదటి శతాబ్దంలో కొంతవరకు నెరవేరింది. అయితే భవిష్యత్తులో కూడా దానికి ఏదైనా విస్తృత నెరవేర్పు ఉందా?

112వ అధ్యాయం

మెలకువగా ఉండడం గురించి పాఠం​—⁠పదిమంది కన్యలు

తన శిష్యుల్లో సగం మంది బుద్ధిగలవాళ్లని, సగం మంది బుద్ధిలేనివాళ్లని యేసు చెప్తున్నాడా?

113వ అధ్యాయం

కష్టపడి పనిచేసే విషయంలో పాఠం​—⁠తలాంతులు

“ఎవరి దగ్గరైతే ఉందో, వాళ్లకు ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది” అని యేసు అన్నాడు. ఆయన చెప్పిన ఉదాహరణ ఆ మాటల్ని వివరిస్తుంది.

114వ అధ్యాయం

క్రీస్తు వచ్చినప్పుడు గొర్రెలకు, మేకలకు తీర్పు తీరుస్తాడు

శాశ్వతమైన తీర్పు దేని ఆధారంగా జరుగుతుందో వివరించడానికి యేసు ఆలోచింపజేసే ఉదాహరణ చెప్పాడు.

115వ అధ్యాయం

యేసు చివరి పస్కాను ఆచరించే సమయం దగ్గరపడింది

యేసును అప్పగిస్తే సరిగ్గా 30 వెండి నాణేలు ఇస్తామని మతనాయకులు యూదాకు మాటిచ్చారు. 30 నాణేలే ఎందుకు?

116వ అధ్యాయం

చివరి పస్కాలో వినయం నేర్పించాడు

యేసు ఒక సేవకుడు చేసే పనిని చేసినప్పుడు అపొస్తలులు ఆశ్చర్యపోయారు.

117వ అధ్యాయం

ప్రభువు రాత్రి భోజనం

తన అనుచరులు ప్రతీ సంవత్సరం నీసాను 14న తన మరణాన్ని గుర్తుచేసుకోవడం కోసం, యేసు ఒక ఆచరణ ప్రారంభించాడు.

118వ అధ్యాయం

తమలో ఎవరు గొప్ప అని శిష్యులు వాదించుకున్నారు

ఆ రోజు సాయంత్రం యేసు నేర్పిన పాఠాన్ని అపొస్తలులు కాసేపటికే మర్చిపోయారు.

119వ అధ్యాయం

యేసే మార్గం, సత్యం, జీవం

దేవుణ్ణి సమీపించే మార్గం గురించి యేసు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని బోధించాడు.

120వ అధ్యాయం

శిష్యులు ఫలించాలి, యేసుకు స్నేహితులుగా ఉండాలి

యేసు శిష్యులు ఏ విధంగా ‘ఫలిస్తారు’?

121వ అధ్యాయం

“ధైర్యం తెచ్చుకోండి! నేను లోకాన్ని జయించాను”

లోకం యేసును చంపింది కదా, మరి ఆయన లోకాన్ని జయించినట్టు ఎలా అవుతుంది?

122వ అధ్యాయం

యేసు మేడగదిలో చేసిన ముగింపు ప్రార్థన

మనుషులకు రక్షణ తీసుకురావడం కన్నా మరింత ప్రాముఖ్యమైన దాన్ని నెరవేర్చానని యేసు స్పష్టం చేశాడు.

123వ అధ్యాయం

యేసు తీవ్రమైన దుఃఖంతో చేసిన ప్రార్థన

“ఈ గిన్నె నా దగ్గర నుండి తీసేయి” అని యేసు ఎందుకు ప్రార్థించాడు? తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా ఇవ్వడానికి ఆయన వెనకాడుతున్నాడా?

124వ అధ్యాయం

యూదా యేసును అప్పగించాడు

అది అర్ధరాత్రి సమయమైనా, యేసు ఎక్కడున్నాడో యూదా కనిపెట్టగలిగాడు.

125వ అధ్యాయం

యేసును అన్న దగ్గరికి, తర్వాత కయప దగ్గరికి తీసుకెళ్లారు

యేసు మీద జరిపిన విచారణ చట్టవిరుద్ధమైనది.

126వ అధ్యాయం

యేసు ఎవరో తెలీదని పేతురు అన్నాడు

విశ్వాసం, భక్తి ఉన్న పేతురు అంత త్వరగా యేసుకు ఎలా వెన్ను చూపగలిగాడు?

127వ అధ్యాయం

యేసును పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు

యూదా మతనాయకులు తమ అసలు ఉద్దేశాన్ని బయటపెట్టారు.

128వ అధ్యాయం

పిలాతుకు, హేరోదుకు యేసులో ఏ తప్పూ కనిపించలేదు

యేసుకు తీర్పు తీర్చమని పిలాతు హేరోదు దగ్గరికి ఎందుకు పంపించాడు? యేసుకు తీర్పు తీర్చే అధికారం పిలాతుకు లేదా?

129వ అధ్యాయం

“ఇదిగో! ఈ మనిషి!” అని పిలాతు అన్నాడు

యేసు చూపించిన అద్భుతమైన లక్షణాలకు పిలాతు సైతం ముగ్ధుడయ్యాడు.

130వ అధ్యాయం

యేసుకు మరణశిక్ష విధించి తీసుకెళ్లారు

ఏడుస్తున్న స్త్రీలతో యేసు, తన కోసం కాకుండా వాళ్ల కోసం, వాళ్ల పిల్లల కోసం ఏడ్వమని ఎందుకు అన్నాడు?

131వ అధ్యాయం

యేసును కొయ్యకు వేలాడదీశారు

యేసు తనతోపాటు వేలాడదీయబడిన ఒక నేరస్తునికి గొప్ప వాగ్దానం చేశాడు.

132వ అధ్యాయం

“ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడు”

అద్భుతరీతిలో పట్టపగలే చీకటి కమ్ముకోవడం, భూకంపం రావడం, ఆలయంలోని తెర చిరిగిపోవడం, అన్నీ ఒకే విషయాన్ని చూపిస్తున్నాయి.

133వ అధ్యాయం

యేసు శరీరాన్ని సమాధి చేశారు

సూర్యాస్తమయానికి ముందే యేసును ఎందుకంత హడావిడిగా సమాధి చేశారు?

134వ అధ్యాయం

యేసు బ్రతికాడు!

యేసు పునరుత్థానమైన తర్వాత, మొదటిగా ఒక స్త్రీకి కనిపించాడు గానీ అపొస్తలులకు కాదు.

135వ అధ్యాయం

పునరుత్థానమైన యేసు చాలామందికి కనిపించాడు

తాను పునరుత్థానం అయ్యానని యేసు తన శిష్యుల్ని ఎలా ఒప్పించాడు?

136వ అధ్యాయం

గలిలయ సముద్రం ఒడ్డున శిష్యులకు కనిపించాడు

తన మీదున్న ప్రేమను ఎలా నిరూపించుకోవచ్చో యేసు పేతురుకు మూడుసార్లు గుర్తుచేశాడు.

137వ అధ్యాయం

పునరుత్థానమైన యేసును పెంతెకొస్తుకు ముందు వందలమంది చూశారు

యేసు పునరుత్థానమైన తర్వాత, పరలోకానికి వెళ్లేముందు తన శిష్యులు ఏం పొందుతారో, దాన్ని వాళ్లెలా ఉపయోగించాలో పదేపదే నొక్కిచెప్పాడు.

138వ అధ్యాయం

క్రీస్తు దేవుని కుడిపక్కన కూర్చున్నాడు

శత్రువుల మీద చర్య తీసుకునే సమయం వచ్చేవరకు యేసు ఏం చేస్తాడు?

139వ అధ్యాయం

యేసు భూమిని పరదైసుగా మార్చి, తన పని పూర్తిచేస్తాడు

తన తండ్రికి రాజ్యాన్ని అప్పగించే ముందు యేసు చేయాల్సింది చాలా ఉంది.

యేసును అనుకరిస్తూ, ఆయనలా . . .

యేసు ఎనిమిది లక్షణాల్ని తన జీవితంలో చాలాసార్లు చూపించాడు.

లేఖనాల పట్టిక

సువార్తల్లోని ప్రతీ వచనాన్ని ఈ పుస్తకంలోని ఏ అధ్యాయాల్లో చర్చించారో ఈ పట్టిక సహాయంతో తెలుసుకోండి.

యేసు చెప్పిన ఉదాహరణలు (చిన్నకథలు)

యేసు చెప్పిన ఉదాహరణల్లో, ఏ ఉదాహరణను ఏ అధ్యాయంలో చర్చించారో గమనించండి.

మెస్సీయకు సంబంధించిన కొన్ని ప్రవచనాలు

మెస్సీయకు సంబంధించిన బైబిలు ప్రవచనాలు యేసు జీవితంలో ఎలా నెరవేరాయో, వాటి వివరాలు ఈ పుస్తకంలోని ఏ అధ్యాయాల్లో ఉన్నాయో తెలుసుకోండి.

యేసు జీవించిన, పరిచర్య చేసిన ప్రాంతాలు

యేసు ఎక్కడెక్కడ పరిచర్య చేశాడో ఈ మ్యాప్‌లో చూడవచ్చు.