కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది

మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది

సుమారు 3,500 సంవత్సరాల క్రితం, యెహోవా దేవుడు తన ఆరాధకులకు మంచి భవిష్యత్తు పొందాలంటే ఏం చేయాలో చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “నేడు నేను జీవాన్ని-మరణాన్ని, దీవెనను-శాపాన్ని మీ ముందు పెట్టి, భూమ్యాకాశాల్ని సాక్షులుగా ఉంచుతున్నాను. నువ్వు, నీ వంశస్థులు ప్రాణాలతో ఉండేలా జీవాన్ని కోరుకోవాలి.”—ద్వితీయోపదేశకాండం 30:19.

వాళ్లు సరైనదాన్ని ఎంచుకుంటే, మంచి భవిష్యత్తు పొందుతారు. మన భవిష్యత్తు బాగుండాలంటే మనం కూడా సరైనదాన్ని ఎంచుకోవాలి. అంటే ఏం చేయాలి? బైబిలు ఇలా చెప్తుంది: ‘నువ్వు నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, ఆయన మాట వినాలి.’—ద్వితీయోపదేశకాండం 30:20.

యెహోవాను ప్రేమించడం, ఆయన మాట వినడం అంటే ఏంటి?

బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోండి: యెహోవాను ప్రేమించాలంటే ఆయన ఎలాంటివాడో బైబిలు చదివి ముందు తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకునే కొద్దీ, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, మీ మంచి కోరుకుంటున్నాడని అర్థం చేసుకుంటారు. మీరు తనకు ప్రార్థించాలని ఆయన కోరుకుంటున్నాడు. “ఆయనకు మీ మీద శ్రద్ధ ఉంది” కాబట్టి మీ మనసులోని ఆందోళనలన్నీ ప్రార్థనలో తనకు చెప్పమని అడుగుతున్నాడు. (1 పేతురు 5:7) మీరు తనకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తే ‘తాను కూడా మీకు దగ్గరౌతానని’ యెహోవా మాటిస్తున్నాడు.—యాకోబు 4:8.

తెలుసుకున్న వాటిని పాటించండి: దేవుని మాట వినడం అంటే, బైబిల్లో ఆయనిచ్చిన తెలివైన సలహాల్ని పాటించడం. అలా పాటించినప్పుడు ‘మీరు విజయం సాధిస్తారు, తెలివిగా నడుచుకుంటారు.’—యెహోషువ 1:8.