కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు ఏం చెప్తుంది?

బైబిలు ఏం చెప్తుంది?

చనిపోయాక మనకు ఏమౌతుంది?

కొంతమంది ఇలా అనుకుంటారు: మనం చనిపోయాక ఏదోక విధంగా జీవిస్తూ ఉంటామని అనుకుంటారు. ఇంకొంతమంది, చనిపోయాక ఏమీ ఉండదని అనుకుంటారు. మీరేం నమ్ముతారు?

బైబిలు జవాబు

“చచ్చినవారు ఏమియు ఎరుగరు.” (ప్రసంగి 9:5) మరో మాటలో చెప్పాలంటే, చనిపోయాక మనం ఇక ఎక్కడా ఉండం.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది

  • మొదటి మనిషి ఆదాము చనిపోయాక మట్టిలో కలిసిపోయాడు. (ఆదికాండము 2:7; 3:19) ఆయనలానే అందరూ చనిపోయాక మట్టిలో కలిసిపోతారు.—ప్రసంగి 3:19, 20.

  • మనుషులు చనిపోయాక వాళ్లు చేసిన పాపాల నుండి విముక్తి పొందుతారు. (రోమీయులు 6:7) బ్రతికి ఉండగా చేసిన తప్పులకు చనిపోయాక శిక్ష ఉండదు.

చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారా?

మీరేమంటారు?

  • అవును

  • కాదు

  • చెప్పలేం

బైబిల్లో ఏముందంటే . . .

‘పునరుత్థానము కలుగబోవుచున్నది.’—అపొస్తలుల కార్యములు 24:14, 15.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది

  • బైబిల్లో చాలాసార్లు మరణాన్ని నిద్రతో పోల్చారు. (యోహాను 11:11-14) మనం నిద్రపోయే వాళ్లను లేపినట్లే దేవుడు చనిపోయినవాళ్లను లేపుతాడు.—యోబు 14:13-15.

  • చనిపోయి తిరిగి బ్రతికిన చాలామంది గురించి బైబిల్లో ఉంది. అవి చదివితే చనిపోయినవాళ్లు ఖచ్చితంగా లేస్తారని నమ్మవచ్చు.—1 రాజులు 17:17-24; లూకా 7:11-17; యోహాను 11:39-44. (w16-E No.1)