కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనవాళ్లు చనిపోతే కలిగే దుఃఖాన్ని తట్టుకోవడం ఎలా?

దుఃఖం వల్ల కలిగే మానసిక వేదన

దుఃఖం వల్ల కలిగే మానసిక వేదన

“సోఫియాకు, a నాకు పెళ్లై 39 కన్నా ఎక్కువ సంవత్సరాలు అయ్యింది. తర్వాత ఒక దీర్ఘకాలిక వ్యాధి ఆమె ప్రాణాన్ని తీసుకుంది. నా స్నేహితుల నుండి నాకు చాలా సహాయం దొరికింది, నన్ను నేను ఎప్పుడూ బిజీగా ఉంచుకున్నాను. కానీ ఒక సంవత్సరమంతా నేను నేనుగా లేను. నా భావోద్వేగాలు ఎప్పుడు ఎలా మారతాయో తెలిసేదికాదు. ఆమె చనిపోయి మూడు సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికీ కొన్నిసార్లు ఊహించని విధంగా, ఒక్కసారిగా తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతాను.”—శ్రీధర్‌.

మీ ప్రియమైన వాళ్లు ఎవరైనా చనిపోయారా? అలా అయితే మీకు కూడా శ్రీధర్‌కు అనిపించినట్లే అనిపిస్తుండవచ్చు. మీ భార్య లేదా భర్త, బంధువు లేదా దగ్గరి స్నేహితుడు చనిపోతే కలిగే ఒత్తిడి, నొప్పి దేనివల్ల కలగదు. మరణం వల్ల కలిగే మానసిక వేదనను అధ్యయనం చేసే నిపుణులు ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. ది అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ సైక్యాట్రీ అనే పత్రికలో ఒక ఆర్టికల్‌ ఇలా చెప్తుంది “మరణం శాశ్వతమైన, తీవ్రమైన నష్టం.” మరణంలో ప్రియమైన వాళ్లను పోగొట్టుకుని భరించలేని బాధను అనుభవించాల్సి వచ్చినవాళ్లు ఇలా అనుకోవచ్చు: ‘ఈ బాధ ఇంకా ఎంతకాలం ఉంటుంది? నేను ఎప్పటిలా మళ్లీ ఆనందంగా ఉండగలనా? నాకు ఉపశమనం ఎలా దొరుకుతుంది?’

తేజరిల్లు! పత్రికలో ఈ ప్రశ్నలకు జవాబులు పరిశీలిస్తాం. మీరు ఎంతగానో ప్రేమించే వాళ్లు ఈ మధ్య కాలంలో చనిపోతే, రోజులు గడుస్తుండగా మీకు ఎలా ఉంటుందో తర్వాత ఆర్టికల్‌ చర్చిస్తుంది. మిగతా ఆర్టికల్‌లు, మీ దుఃఖాన్ని కొంతవరకైనా తగ్గించుకోవడానికి మీరు ఏమి చేయవచ్చో చెప్తాయి.

ఇప్పుడు చూడబోయే విషయాలు మరణం వల్ల మానసిక వేదనను అనుభవిస్తున్న వాళ్లకు కావాల్సిన ఉపశమనాన్ని, సహాయాన్ని ఇస్తాయని మేము ఆశిస్తున్నాము.

a ఈ ఆర్టికల్‌లో కొన్ని అసలు పేర్లు కావు.