కంటెంట్‌కు వెళ్లు

చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారా?

చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారా?

మీ అభిప్రాయం ఏంటి?

  • బ్రతుకుతారు.

  • బ్రతకరు.

  • చెప్పలేం.

ఒక ప్రాచీన గ్రంథంలో ఇలా ఉంది:

చనిపోయినవాళ్లను “దేవుడు తిరిగి బ్రతికిస్తాడు.”—అపొస్తలుల కార్యాలు 24:15, కొత్త లోక అనువాదం.

దాన్ని నమ్మడం వల్ల మీరు పొందేవి

ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు ఓదార్పు.—2 కొరింథీయులు 1:3, 4.

చనిపోతామనే భయం నుండి విడుదల.—హెబ్రీయులు 2:15.

చనిపోయిన మీ వాళ్లను మళ్లీ చూస్తారనే ఆశ.—యోహాను 5:28, 29.

ఆ మాటలు ఎందుకు నమ్మవచ్చు?

మూడు కారణాలు పరిశీలించండి.

  • జీవాన్ని ఇచ్చింది దేవుడే. యెహోవా దేవుడు “జీవపు ఊట” అని ఆ ప్రాచీన గ్రంథం చెప్తుంది. (కీర్తన 36:9; అపొస్తలుల కార్యాలు 17:24, 25) ప్రతీ ప్రాణికి జీవాన్నిచ్చిన దేవుడు చనిపోయినవాళ్లకు మళ్లీ జీవాన్నిచ్చి బ్రతికించగలడు.

  • గతంలో దేవుడు కొంతమందిని మళ్లీ బ్రతికించాడు. దేవుడు మళ్లీ బ్రతికించిన ఎనిమిదిమంది ఇదే భూమ్మీద జీవించారని ఆ గ్రంథంలో రాసివుంది. వాళ్లలో పిల్లలు, పెద్దలు, స్త్రీపురుషులు ఉన్నారు. కొంతమంది చనిపోయిన కాసేపటికే బ్రతికించబడ్డారు, ఒకతను మాత్రం సమాధి చేయబడిన నాలుగు రోజులకు బ్రతికించబడ్డాడు!—యోహాను 11:39-44.

  • దేవుడు మళ్లీ అలా బ్రతికించాలని కోరుకుంటున్నాడు. మనుషులు చనిపోవడం యెహోవాకు అస్సలు ఇష్టంలేదు, మరణాన్ని ఆయన శత్రువులా చూస్తున్నాడు. (1 కొరింథీయులు 15:26) ఆ శత్రువును జయించాలని, అంటే చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికించడం ద్వారా మరణాన్ని ఓడించాలని ఆయన ఎంతో కోరుకుంటున్నాడు. తన జ్ఞాపకంలో ఉన్నవాళ్లను బ్రతికించాలని, వాళ్లు మళ్లీ భూమ్మీద జీవిస్తుంటే చూడాలని ఆయన ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు.—యోబు 14:14, 15.

ఈ ప్రశ్న గురించి ఆలోచించండి . . .

మనం ఎందుకు ముసలివాళ్లమై చనిపోతున్నాం?

ఆదికాండం 3:17-19; రోమీయులు 5:12 లో దానికి జవాబు ఉంది.