బైబిలు గురించి మీ అభిప్రాయం ఏంటి?
అది . . .
-
మనుషులు సొంతగా రాసిన పుస్తకం.
-
కట్టుకథలు ఉన్న పుస్తకం.
-
దేవుడు ఇచ్చిన పుస్తకం.
బైబిలు ఏం చెప్తుందంటే . . .
“లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు.”—2 తిమోతి 3:16, కొత్త లోక అనువాదం.
దాన్ని నమ్మడం వల్ల మీరు పొందేవి . . .
జీవితంలో ముఖ్యమైన ప్రశ్నలకు సరైన జవాబులు.—సామెతలు 2:1-5.
రోజువారీ జీవితంలో ఉపయోగపడే సలహాలు.—కీర్తన 119:105.
మంచి రోజులు వస్తాయనే ఆశ.—రోమీయులు 15:4.
బైబిలు చెప్పేది ఎందుకు నమ్మవచ్చు?
మూడు కారణాలు పరిశీలించండి.
-
చక్కని పొందిక. బైబిల్ని 1,600 కన్నా ఎక్కువ సంవత్సరాల కాలంలో దాదాపు 40 మంది వేర్వేరు వ్యక్తులు రాశారు. వాళ్లలో చాలామంది ఒకరినొకరు ఎప్పుడూ కలుసుకోలేదు. అయినా బైబిలంతా పొందికగా ఉంది, అందులో ఒకే ముఖ్యాంశం ఉంది!
-
నిజాయితీ. సాధారణంగా చరిత్రకారులు తమ దేశం ఓడిపోవడం గురించి రాయరు. కానీ బైబిలు రచయితలు తమ తప్పుల్ని, తమ దేశ ప్రజల తప్పుల్ని నిజాయితీగా రాశారు.—2 దినవృత్తాంతాలు 36:15, 16; కీర్తన 51:1-4.
-
నెరవేరిన మాటలు. బబులోను అనే ప్రాచీన నగరం నాశనమౌతుందని దాదాపు 200 సంవత్సరాల ముందే బైబిలు ప్రవచించింది. (యెషయా 13:17-22) బబులోను ఎలా పతనం అవుతుందో చెప్పడమే కాదు, దాన్ని జయించే రాజు పేరు కూడా బైబిలు ముందే చెప్పింది!—యెషయా 45:1-3.
బైబిల్లో ఉన్న ఎన్నో ప్రవచనాలు అచ్చు గుద్దినట్టు నెరవేరాయి. దేవుడు ఇచ్చిన పుస్తకం అంటే ఇలాగే ఉండాలి కదా!—2 పేతురు 1:21.
ఈ ప్రశ్న గురించి ఆలోచించండి . . .
దేవుని వాక్యం వల్ల మీ జీవితం ఎలా మెరుగౌతుంది?
యెషయా 48:17, 18; 2 తిమోతి 3:16, 17 లో దానికి జవాబు ఉంది.