కంటెంట్‌కు వెళ్లు

మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా?

మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా?

మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా?

బైబిలును ఎందుకు చదవాలి?

బైబిలుతో వేరే ఏ పుస్తకమూ సాటి రాదు. అందులో దేవుడిచ్చిన ప్రేమపూర్వక ఉపదేశాలున్నాయి. (1 థెస్సలొనీకయులు 2:​13) బైబిలు బోధలను మీరు ఆచరణలో పెడితే, చాలా గొప్ప ప్రయోజనాలను పొందగలరు. మీకు దేవుని మీదవున్న ప్రేమ పెరుగుతుంది, “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” ఇచ్చే ఆయనకు మీరు మరింత దగ్గరవుతారు. (యాకోబు 1:​17) ప్రార్థనలో ఆయనను ఎలా సమీపించాలో మీరు తెలుసుకుంటారు. ఇబ్బందుల్లో, దేవుడు సహాయం చేస్తాడని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోగలరు. బైబిలులో పేర్కొనబడిన ప్రమాణాల అనుసారంగా మీరు మీ జీవితాన్ని మలుచుకుంటే, దేవుడు మీకు నిత్యజీవాన్నిస్తాడు.​—⁠రోమీయులు 6:⁠23.

బైబిలులో జ్ఞానోదయాన్ని కలిగించే సత్యాలున్నాయి. బైబిలు పరిజ్ఞానాన్ని పొందేవారు, లక్షలాదిమంది జీవితాలను శాసించే తప్పుడు తలంపుల నుండి విముక్తులవుతారు. ఉదాహరణకు, మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందన్న దాని గురించిన సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, చనిపోయినవారు మనకు హాని కలిగిస్తారేమోనని గానీ, చనిపోయిన మన బంధువులు లేదా స్నేహితులు బాధలననుభవిస్తున్నారేమోనని గానీ భయముండదు. (ప్రసంగి 9:​5, 10) పునరుత్థానాన్ని గురించిన బైబిలు బోధ, ప్రియమైనవారి మరణంతో దుఃఖిస్తున్నవారికి ఓదార్పునిస్తుంది. (యోహాను 11:​25) దుష్ట దూతలను గురించిన సత్యాన్ని తెలుసుకోవడం, చనిపోయినవారిని సంప్రదించడానికి ప్రయత్నించడం వల్ల కలిగే ప్రమాదాలను గురించి మనలను అప్రమత్తులను చేస్తుంది, భూమి మీద ఇన్ని సమస్యలుండడానికి గల కారణమేమిటో అర్థం చేసుకునేందుకు మనకు సహాయం చేస్తుంది.

బైబిలులో ఉన్న దైవిక సూత్రాలు, శారీరక ప్రయోజనాలు చేకూరేలా జీవించడమెలాగో చూపిస్తాయి. ఉదాహరణకు, ఏ అలవాట్లయినా ‘మితంగా’నే ఉండడం మంచి ఆరోగ్యానికి దోహదపడుతుంది. (1 తిమోతి 3:⁠2, 3) “శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా” చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యం పాడయ్యే ప్రమాదాన్ని నివారించుకుంటాం. (1 కొరింథీయులు 7:⁠1) బైబిలులో పొందే దేవుని ఉపదేశాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా, వైవాహిక జీవితంలో సంతోషం, ఆత్మగౌరవం పెరుగుతాయి.​—⁠1 కొరింథీయులు 6:⁠18.

మీరు దేవుని వాక్యాన్ని ఆచరణలో పెడితే, మీరు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటారు. బైబిలు పరిజ్ఞానం, మనశ్శాంతినీ సంతృప్తినీ పొందేందుకు సహాయపడుతుంది, అలాగే మనకు నిరీక్షణనిస్తుంది. కరుణ, ప్రేమ, సంతోషం, సమాధానం, దయ, విశ్వాసం వంటి ఆకర్షణీయమైన లక్షణాలను అలవరచుకునేందుకు మనకు సహాయపడుతుంది. (గలతీయులు 5:​22, 23; ఎఫెసీయులు 4:​24, 32) అలాంటి లక్షణాలు, మనలను మరింత మంచి భర్తగా లేదా భార్యగా, మరింత మంచి తల్లిగా లేదా తండ్రిగా, మరింత మంచి కుమారుడుగా లేదా కుమార్తెగా అయ్యేందుకు సహాయపడతాయి.

మీరు భవిష్యత్తు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కాలప్రవాహంలో మనమిప్పుడు ఎక్కడున్నామో బైబిలు ప్రవచనాలు మనకు చూపిస్తున్నాయి. ఈ ప్రవచనాలు, నేటి లోక పరిస్థితిని వర్ణించడమే కాక, దేవుడు భూమిని త్వరలోనే పరదైసుగా మార్చుతాడని కూడా చూపిస్తున్నాయి.​—⁠ప్రకటన 21:​3, 4.

బైబిలును అర్థం చేసుకోవడానికి సహాయం

బహుశా, మీరు బైబిలు చదవడానికి ప్రయత్నించివుండవచ్చు, కానీ అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నట్లు అనిపించవచ్చు. మీ ప్రశ్నలకు సమాధానాలను బైబిల్లో ఎలా వెతకాలో బహుశా మీకు తెలిసుండకపోవచ్చు. అలాగైతే, మీరు ఒంటరివారు కాదు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనందరికీ సహాయమవసరం. దాదాపు 235 దేశాల్లోని యెహోవాసాక్షులు లక్షలాది మంది ప్రజలకు బైబిలు ఉపదేశాన్ని ఉచితంగా తెలియజేస్తున్నారు. వారు మీకు సహాయం చేయడానికి కూడా సంతోషిస్తారు.

బైబిలును ప్రాథమిక బోధలతో మొదలుపెట్టి అంచెలంచెలుగా అధ్యయనం చేయడమే శ్రేష్ఠమైన పద్ధతి. (హెబ్రీయులు 6:​1, 2) మీరు అధ్యయనాన్ని అలా కొనసాగిస్తుండగా, ‘బలమైన ఆహారాన్ని’ అంటే మరింత లోతైన సత్యాలను తీసుకోగలుగుతారు. (హెబ్రీయులు 5:​14) బైబిలు ప్రామాణికమైనది. దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరు వంటి అనేక బైబిలు ఆధారిత ప్రచురణలు, అనేక అంశాలను గురించి బైబిలు ఏమి చెబుతుందో గ్రహించడానికి మీకు సహాయపడతాయి.

బైబిలును అర్థం చేసుకోవడానికి మీరు ప్రతివారం కొంత సమయం వెచ్చించడానికి ఇష్టపడతారా?

బైబిలు అధ్యయనం సాధారణంగా, మీకు అనుకూలంగా ఉండే సమయంలో, మీకు సౌకర్యంగా ఉండే చోట నిర్వహించబడుతుంది. చాలామంది తమ ఇంట్లోనే అధ్యయనం చేస్తారు. కొందరు టెలిఫోను ద్వారా కూడా అధ్యయనం చేస్తారు. ఈ అధ్యయన కార్యక్రమం అనేక మందికి ఒకేసారి తీసుకునే క్లాసు కాదు, మీకున్న పరిజ్ఞానం, విద్యాస్థాయిలతో సహా మీ పరిస్థితులకు అనుగుణంగా మలచబడే వ్యక్తిగత ఏర్పాటు. పరీక్షలుండవు, మీరు కలవరపడాల్సిన అవసరముండదు. మీ బైబిలు ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి, మీరు దేవునికి దగ్గరవడమెలాగో నేర్చుకుంటారు.

ఇలాంటి అధ్యయనం కోసం మీరు డబ్బు చెల్లించాల్సిన పని లేదు. (మత్తయి 10:⁠8) ఏ మతానికి చెందినవారైనా, ఏ మతాన్నీ అవలంబించనివారైనా సరే, దేవుని వాక్యాన్ని గురించి తమకున్న పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లయితే, అలాంటివారికందరికీ అధ్యయనం ఉచితంగా నిర్వహించబడుతుంది.

ఈ చర్చలో ఎవరెవరు పాల్గొనవచ్చు? మీ కుటుంబమంతా పాల్గొనవచ్చు. మీరు మీ స్నేహితులనెవరినైనా ఆహ్వానించాలనుకుంటే వారు కూడా పాల్గొనవచ్చు. అలా కాదు మీరు ఒక్కరే చేయాలనుకుంటున్నా చేయవచ్చు.

అనేక మంది, బైబిలును అధ్యయనం చేయడం కోసం వారానికి ఒక గంట కేటాయిస్తారు. ఒక వేళ మీరు ప్రతివారం అంతకన్నా ఎక్కువ సమయమే గానీ, లేదా తక్కువ సమయమే గానీ వెచ్చించగలిగితే, మీకు సహాయం చేయడానికి సాక్షులు సిద్ధంగా ఉంటారు.

నేర్చుకోమని ఆహ్వానం

యెహోవాసాక్షులను సంప్రదించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అందుకు ఈ క్రింద ఉన్న చిరునామాల్లో ఒకదానికి వ్రాయడమే ఒక మార్గం. అప్పుడు, ఎవరైనా మీతో ఉచిత బైబిలు అధ్యయనం నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.

మన నుండి దేవుడు ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరు గురించి నాకు మరింత సమాచారాన్ని పంపండి.

□ నాకు బైబిలు అధ్యయనం నిర్వహించడానికి నన్ను ఈ చిరునామాలో సంప్రదించండి.

ఏ సూచనా లేని లేఖనాలు పరిశుద్ధ గ్రంథము నుండి తీసుకోబడ్డాయి.