యిర్మీయా 30:1-24

  • పునరుద్ధరణ, స్వస్థత వాగ్దానాలు (1-24)

30  యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:  “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను నీకు చెప్పే మాటలన్నీ ఒక పుస్తకంలో రాయి.  ఎందుకంటే, యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు, “ఇదిగో! బందీలుగా వెళ్లిన నా ప్రజల్ని, అంటే ఇశ్రాయేలు, యూదా ప్రజల్ని నేను సమకూర్చే రోజులు రాబోతున్నాయి”+ అని యెహోవా అంటున్నాడు. “నేను వాళ్ల పూర్వీకులకు ఇచ్చిన దేశానికి వాళ్లను తిరిగి తీసుకొస్తాను, వాళ్లు మళ్లీ దాన్ని సొంతం చేసుకుంటారు.” ’ ”+  ఇశ్రాయేలు, యూదాలతో యెహోవా మాట్లాడిన మాటలు ఇవి.   యెహోవా ఇలా అంటున్నాడు: “భయంతో అరిచే అరుపులు మాకు వినిపించాయి;భయమే గానీ శాంతి లేదు.   దయచేసి ఈ విషయం అడిగి తెలుసుకోండి: పురుషుడు బిడ్డను కనగలడా? మరైతే ప్రతీ బలమైన పురుషుడు బిడ్డను కనే స్త్రీలా+తన కడుపు* మీద ఎందుకు చేతులు పెట్టుకుని ఉన్నాడు? ప్రతీ వ్యక్తి ముఖం ఎందుకు పాలిపోయింది?   అయ్యో! అది చాలా భయంకరమైన రోజు.+ అలాంటి రోజు ఇంకొకటి లేదు,అది యాకోబుకు వేదన కలిగే రోజు. అయితే అతను దాన్నుండి రక్షించబడతాడు.”  సైన్యాలకు అధిపతైన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆ రోజు, నేను నీ మెడ మీది నుండి కాడిని విరగ్గొడతాను, నీ కట్లను తెంపేస్తాను; ఇక పరదేశులు అతన్ని* బానిసగా చేసుకోరు.  వాళ్లు తమ దేవుడైన యెహోవాను, నేను వాళ్లమీద నియమించే తమ రాజైన దావీదును సేవిస్తారు.”+ 10  యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: “నా సేవకుడివైన యాకోబూ, భయపడకు;ఇశ్రాయేలూ, బెదిరిపోకు.+ ఎందుకంటే నేను, దూరం నుండి నిన్ను,తాము బందీలుగా ఉన్న దేశం నుండి నీ సంతానాన్ని కాపాడతాను.+ యాకోబు తిరిగొస్తాడు, ఏ ఇబ్బందీ లేకుండా ప్రశాంతంగా ఉంటాడు,వాళ్లను భయపెట్టేవాళ్లు ఎవ్వరూ ఉండరు.”+ 11  “ఎందుకంటే, నిన్ను కాపాడడానికి నేను నీతో ఉన్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు. “అయితే నేను నిన్ను ఏయే దేశాల మధ్యకు చెదరగొట్టానో ఆ దేశాలన్నిటినీ పూర్తిగా నాశనం చేస్తాను;+నిన్ను మాత్రం పూర్తిగా నాశనం చేయను.+ అయితే తగిన మోతాదులో నీకు క్రమశిక్షణ ఇస్తాను,*నిన్ను శిక్షించకుండా మాత్రం ఉండను.”+ 12  ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు: “నీ దెబ్బకు మందు లేదు,+ నీ గాయం నయం కానిది. 13  నీ వ్యాజ్యాన్ని వాదించేవాళ్లు ఎవరూ లేరు,నీ పుండు ఏ విధంగానూ నయం కాదు. నీకు చికిత్స లేదు. 14  నీ ప్రియులు నిన్ను మర్చిపోయారు.+ వాళ్లు ఇక నీ కోసం వెదకట్లేదు. ఎందుకంటే నీ గొప్ప దోషాన్ని బట్టి, నువ్వు చేసిన లెక్కలేనన్ని పాపాల్ని బట్టి+నేను, శత్రువు కొట్టినట్టు నిన్ను కొట్టాను,+క్రూరుడు శిక్షించినట్టు శిక్షించాను. 15  నీ గాయాన్ని బట్టి ఎందుకు అరుస్తున్నావు? నీ నొప్పి నయం కానిది! నీ గొప్ప దోషాన్ని బట్టి, నువ్వు చేసిన లెక్కలేనన్ని పాపాల్ని బట్టి+నేను నీకు అలా చేశాను. 16  అయితే నిన్ను మింగేసేవాళ్లంతా మింగేయబడతారు,+నీ శత్రువులు కూడా చెరలోకి వెళ్తారు.+ నిన్ను కొల్లగొట్టేవాళ్లు కొల్లగొట్టబడతారు,నిన్ను దోచుకునే వాళ్లంతా దోచుకోబడేలా చేస్తాను.”+ 17  “ ‘సీయోను కోసం వెదికేవాళ్లే లేరు’+ అని అంటూవాళ్లు నిన్ను తిరస్కరించినా, నేను మళ్లీ నిన్ను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాను, నీ గాయాల్ని నయం చేస్తాను”+ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 18  యెహోవా ఇలా అంటున్నాడు: “ఇదిగో నేను యాకోబు డేరాల దగ్గరికి వచ్చి, చెరలో ఉన్నవాళ్లను సమకూర్చబోతున్నాను,+నేను అతని గుడారాల మీద జాలిపడతాను. ఆ నగరం దాని కొండ మీద మళ్లీ కట్టబడుతుంది,+పటిష్ఠమైన బురుజు దాని స్థానంలో నిలబడుతుంది. 19  వాళ్లు కృతజ్ఞతలు చెప్తారు, సంతోషంతో కేకలు వేస్తారు.+ నేను వాళ్ల సంఖ్యను ఎక్కువ చేస్తాను, వాళ్లు కొద్దిమందిగా ఉండరు;+నేను వాళ్లను చాలా ఎక్కువమందిని* చేస్తాను,వాళ్లు తక్కువవాళ్లుగా ఉండరు.+ 20  అతని కుమారులు మళ్లీ ఒకప్పటిలా తయారౌతారు,అతని సమాజం నా ముందు స్థిరంగా స్థాపించబడుతుంది.+ అతన్ని అణచివేసే వాళ్లందర్నీ నేను శిక్షిస్తాను.+ 21  అతని నాయకుడు అతని ప్రజల నుండే వస్తాడు,అతని పరిపాలకుడు అతని ప్రజల నుండే వస్తాడు. నేను అతన్ని నా దగ్గరికి రానిస్తాను, అతను నా దగ్గరికి వస్తాడు.” “లేదంటే, నా దగ్గరికి వచ్చే సాహసం ఎవరు చేస్తారు?” అని యెహోవా అంటున్నాడు. 22  “మీరు నాకు ప్రజలుగా ఉంటారు,+ నేను మీకు దేవునిగా ఉంటాను.”+ 23  ఇదిగో! యెహోవా ఆగ్రహం తుఫానులా విరుచుకుపడబోతుంది;+భయంకరమైన సుడిగాలిలా అది గిరగిరా తిరుగుతూ దుష్టుల తలమీద విరుచుకుపడుతుంది. 24  తన హృదయంలో అనుకున్నది నెరవేర్చే వరకు, దాన్ని పూర్తిచేసే వరకుయెహోవా కోపాగ్ని వెనక్కి తిరగదు.+ చివరి రోజుల్లో మీరు దీన్ని అర్థం చేసుకుంటారు.+

అధస్సూచీలు

లేదా “నడుము.”
లేదా “వాళ్లను.”
లేదా “నిన్ను సరిదిద్దుతాను.”
లేదా “గౌరవించబడేలా” అయ్యుంటుంది.