సమూయేలు రెండో గ్రంథం 23:1-39

  • దావీదు చివరి మాటలు (1-7)

  • దావీదు బలమైన యోధుల సాహస కార్యాలు (8-39)

23  ఇవి దావీదు చివరి మాటలు:+ “యెష్షయి+ కుమారుడైన దావీదు మాట,ఎత్తుగా హెచ్చించబడిన వ్యక్తి+ మాట,యాకోబు దేవుని చేత అభిషేకించబడి,+ఇశ్రాయేలీయుల పాటలు మధురంగా పాడిన గాయకుని* మాట.   యెహోవా పవిత్రశక్తి నా ద్వారా మాట్లాడింది;+ఆయన మాట నా నాలుక మీద ఉంది.+   ఇశ్రాయేలు దేవుడు మాట్లాడాడు;ఇశ్రాయేలు ఆశ్రయదుర్గం*+ నాకు ఇలా చెప్పాడు: ‘మనుషుల్ని పాలించే వ్యక్తి నీతిమంతుడై+ ఉండి,దైవభయంతో పరిపాలిస్తే,+   అది సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు ఉండే ఉదయకాంతిలా,+మబ్బుల్లేని పగటిలా ఉంటుంది. వాన వెలిసిన తర్వాత వచ్చే వెలుగులా ఉంటుంది,అది భూమి నుండి గడ్డిని మొలిపిస్తుంది.’+   నా కుటుంబం దేవుని ముందు అలాగే ఉంది కదా? ఎందుకంటే ఆయన నాతో శాశ్వత ఒప్పందం చేశాడు,+అన్ని వివరాలతో దాన్ని భద్రపర్చాడు. అది నాకు పూర్తి రక్షణను, ఎంతో ఆనందాన్ని ఇస్తుంది,ఆయన ఖచ్చితంగా దాన్ని వృద్ధి చేస్తాడు.+   కానీ పనికిమాలిన వాళ్లందరూ ముళ్లపొదల్లా పారేయబడతారు,+వాటిని చేతులతో తీయలేం.   ఒక మనిషి వాటిని ముట్టుకోవాలనుకుంటే,అతని దగ్గర ఇనుప పనిముట్టు, ఈటె కర్ర ఉండాలి,వాటిని అవి ఉన్న స్థలంలోనే అగ్నితో పూర్తిగా కాల్చేయాలి.”  దావీదు దగ్గరున్న బలమైన యోధుల పేర్లు ఇవి:+ తక్మోనీయుడైన యోషేబెష్షెబెతు, అతను ముగ్గురు బలమైన యోధుల్లో అధిపతి.+ అతను ఒకసారి తన ఈటెతో 800 మందిని చంపాడు.  అతని తర్వాతివాడు ఎలియాజరు, అతను అహోహీ కుమారుడైన దోదో+ కుమారుడు. ఫిలిష్తీయుల్ని సవాలు చేసినప్పుడు దావీదుతో ఉన్న ముగ్గురు బలమైన యోధుల్లో ఎలియాజరు ఒకడు. ఫిలిష్తీయులు అక్కడ యుద్ధానికి సమకూడినప్పుడు, ఇశ్రాయేలీయులు పారిపోయారు; 10  కానీ అతను అక్కడే నిలబడి, కత్తి పట్టుకోవడం వల్ల తన చెయ్యి బిగుసుకుపోయి, అలసిపోయేంత వరకు ఫిలిష్తీయుల్ని హతం చేస్తూనే ఉన్నాడు.+ దాంతో ఆ రోజు యెహోవా గొప్ప విజయాన్ని* ఇచ్చాడు;+ అప్పుడు ప్రజలు అతని వెనక వచ్చి, చనిపోయినవాళ్లను దోచుకున్నారు. 11  అతని తర్వాతివాడు హరారీయుడైన ఆగే కుమారుడు షమ్మా. ఒకసారి ఫిలిష్తీయులు లేహీలో ఒక చిక్కుడుకాయల చేను దగ్గర సమకూడారు; ప్రజలు ఫిలిష్తీయుల్ని చూసి పారిపోయారు. 12  కానీ అతను చేను మధ్యలో నిలబడి దాన్ని కాపాడాడు, అతను ఫిలిష్తీయుల్ని హతం చేస్తూ వెళ్లాడు. దాంతో యెహోవా తన ప్రజలకు గొప్ప విజయాన్ని* ఇచ్చాడు.+ 13  ఒకసారి కోతకాలంలో 30 మంది అధిపతుల్లో ముగ్గురు అదుల్లాము గుహ+ వద్దనున్న దావీదు దగ్గరికి వెళ్లారు. అప్పుడు ఫిలిష్తీయుల దళం* రెఫాయీము లోయలో+ మకాం వేసి ఉంది. 14  ఆ సమయంలో దావీదు అక్కడ ఒక సురక్షితమైన స్థలంలో ఉన్నాడు,+ ఫిలిష్తీయుల సైనిక స్థావరం ఒకటి బేత్లెహేములో ఉంది. 15  అప్పుడు దావీదు, “నేను బేత్లెహేము ద్వారం దగ్గరున్న బావి నీళ్లు తాగితే ఎంత బాగుంటుంది!” అంటూ తన కోరికను తెలియజేశాడు. 16  వెంటనే ఆ ముగ్గురు బలమైన యోధులు ఫిలిష్తీయుల శిబిరంలోకి చొరబడి, బేత్లెహేము ద్వారం దగ్గరున్న బావిలో నుండి నీళ్లు తోడి దావీదు దగ్గరికి తీసుకొచ్చారు; కానీ దావీదు ఆ నీళ్లు తాగడానికి ఒప్పుకోకుండా వాటిని యెహోవా ముందు పారబోశాడు.+ 17  అతను ఇలా అన్నాడు: “యెహోవా, నేను ఈ పని చేయడం నా ఊహకందని విషయం! తమ ప్రాణాలకు తెగించి వెళ్లిన ఈ మనుషుల రక్తాన్ని+ నేను తాగాలా?” అలా అతను ఆ నీళ్లు తాగడానికి ఒప్పుకోలేదు. అతని దగ్గరున్న ముగ్గురు బలమైన యోధులు చేసిన పనులు అవి. 18  యోవాబు సహోదరుడూ సెరూయా కుమారుడూ+ అయిన అబీషై+ మరో ముగ్గురు బలమైన యోధుల్లో అధిపతి; అతను ఒకసారి ఈటెతో 300 మందిని చంపాడు. అతనికి ఆ మొదటి ముగ్గురికి ఉన్నలాంటి పేరే ఉంది.+ 19  అతను ఆ ముగ్గురిలో అత్యంత ప్రసిద్ధి చెందినా, అతను వాళ్ల అధిపతైనా, మొదటి ముగ్గురికి సమానుడు కాలేదు. 20  యెహోయాదా కుమారుడైన బెనాయా+ ఎంతో ధైర్యం గలవాడు.* అతను కబ్సెయేలులో+ ఎన్నో సాహస కార్యాలు చేశాడు. అతను మోయాబుకు చెందిన అరీయేలు ఇద్దరు కుమారుల్ని చంపాడు. మంచు కురుస్తున్న ఒకరోజు అతను నీటి గుంటలోకి దిగి ఒక సింహాన్ని చంపాడు.+ 21  అతను చాలా ఎత్తుగా ఉన్న ఒక ఐగుప్తీయుణ్ణి కూడా చంపాడు. ఆ ఐగుప్తీయుడి చేతిలో ఈటె ఉన్నా, అతని మీదికి ఒక కర్రతో వెళ్లి అతని చేతిలో నుండి ఈటెను లాక్కొని దానితోనే అతన్ని చంపాడు. 22  ఈ పనులు యెహోయాదా కుమారుడైన బెనాయా చేశాడు, అతనికి ఆ ముగ్గురు బలమైన యోధులకున్నంత పేరు ఉంది. 23  అతను ఆ ముప్పై మంది కన్నా ఎక్కువ ప్రసిద్ధి చెందినా, ఆ ముగ్గురికి సమానుడు కాలేదు. అయితే, దావీదు అతన్ని తన అంగరక్షకుల మీద నియమించాడు. 24  యోవాబు సహోదరుడైన అశాహేలు+ కూడా ఈ ముప్పై మందిలో ఉన్నాడు: బేత్లెహేముకు చెందిన దోదో కుమారుడైన ఎల్హానాను,+ 25  హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా, 26  పల్తీయుడైన హేలెస్సు,+ తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడు ఈరా,+ 27  అనాతోతీయుడైన+ అబీయెజరు,+ హూషాతీయుడైన మెబున్నయి, 28  అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై,+ 29  నెటోపాతీయుడైన బయనా కుమారుడు హేలెబు, బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబై కుమారుడు ఇత్తయి, 30  పిరాతోనీయుడైన బెనాయా,+ గాయషు+ వాగుల* ప్రాంతానికి చెందిన హిద్దయి, 31  అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు, 32  షయల్బోనీయుడైన ఎల్యాహ్బా, యాషేను కుమారుల్లో యోనాతాను, 33  హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారు కుమారుడు అహీయాము, 34  మాయకాతీయుని కుమారుడైన అహస్బయి కుమారుడు ఎలీపేలెటు, గీలోనీయుడైన అహీతోపెలు+ కుమారుడు ఏలీయాము, 35  కర్మెలీయుడైన హెజ్రో, అర్బీయుడైన పయరై, 36  సోబాకు చెందిన నాతాను కుమారుడు ఇగాలు, గాదీయుడైన బానీ, 37  అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, ఇతను సెరూయా కుమారుడైన యోవాబు ఆయుధాలు మోసేవాడు, 38  ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన+ గారేబు, 39  హిత్తీయుడైన ఊరియా+—మొత్తం 37 మంది.

అధస్సూచీలు

లేదా “మధురమైనవాడి.”
అక్ష., “బండరాయి.”
లేదా “రక్షణను.”
లేదా “రక్షణను.”
లేదా “డేరాల గ్రామం.”
అక్ష., “వీరుని కుమారుడు.”
పదకోశం చూడండి.