కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW.ORG వెబ్‌సైట్‌

మొబైల్‌ ఫోన్‌లో JW.ORGని ఉపయోగించండి

మొబైల్‌ ఫోన్‌లో JW.ORGని ఉపయోగించండి

పూర్తి-సైజు కంప్యూటర్‌ స్క్రీన్‌పై ఉండే వెబ్‌ పేజీలు మరియు ప్రత్యేకతలు, స్మార్ట్‌ఫోన్‌ లేక ట్యాబ్లెట్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. అయితే, చిన్న మొబైల్‌ఫోన్‌లు వాడే వాళ్లు కూడా ఈ వెబ్‌సైట్‌ను ఎక్కువగా ఉపయోగించుకునేందుకు వీలుగా స్క్రీన్లు, మెనూలూ బిన్నంగా ఉంటాయి. jw.orgలో మీకు కావల్సినవాటిని కనుగొనేందుకు కింది సలహాలు మీకు సహాయపడతాయి.

 మొబైల్‌ నావిగేషన్‌ మెనూలను ఉపయోగించండి

పూర్తి-సైజు స్క్రీనుపై ముఖ్యమైన భాగాలు స్క్రీన్‌ పైభాగంలో ఎప్పటికీ కనబడుతూనే ఉంటాయి. మరియు రెండో-లెవల్‌ మెనూ స్క్రీన్‌ ఎడమ పక్క నిలువుగా కనబడుతుంది.

అయితే, ఓ మొబైల్‌ఫోన్‌ చిన్న స్క్రీన్‌పై అన్ని నావిగేషన్‌ మెనూలు నిలువుగా కనబడతాయి, అంతేకాక, స్క్రీన్‌ మీద వెబ్‌సైట్‌ సమాచారం ఎక్కువగా కనబడేందుకు వీలుగా, అవసరం లేనప్పుడు మెనూలు దాచబడి ఉంటాయి.

  • నావిగేషన్‌ మెనూలను చూపించేందుకు లేక దాచేందుకు మెనూ బటన్‌ను క్లిక్‌ చేయండి. ఏ టాపిక్‌ చూడాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆప్షన్లు, మెనూ కింది భాగంలో ఎంపిక చేసుకోవచ్చు.

  • ఒకే విభాగంలో రెండో-లెవల్‌ మెనూ ఆప్షన్లను చూసేందుకు లిస్టును పొడిగించు అనే బటన్‌ను క్లిక్‌ చేయండి. ఆ ఆప్షన్‌లో మీరు చూడాలనుకున్న పేజీకి వెళ్లేందుకు మరలా మెనూ ఆప్షన్‌ పేరును క్లిక్‌ చేయండి.

  • ఒకే విభాగంలో రెండో-లెవల్‌ మెనూ ఆప్షన్లను చూపంచకుండా ఉండేందుకు లిస్టును తొలగించు అనే బటన్‌ను క్లిక్‌ చేయండి.

  • హోమ్‌ పేజీకి తిరిగి వెళ్లేందుకు JW.ORG బటన్‌ను క్లిక్‌ చేయండి.

  • అందుబాటులో ఉన్న భాషల లిస్టును చూసేందుకు భాషను ఎంచుకోండి అనే బటన్‌ను క్లిక్‌ చేయండి.

  • సైట్‌సర్చ్‌ అనే ప్రత్యేకతను ఉపయోగించుకొని విషయాలను కనుగొనేందుకు వెతుకు బటన్‌ను క్లిక్‌ చేయండి. (ఈ ఆప్షన్‌ తెలుగులో అందుబాటులో లేదు.)

 ఒక ప్రచురణలో ఆర్టికల్స్‌ లేక చాప్టర్స్‌ను పరిశీలించండి

ఒక ప్రచురణలో పూర్తి-సైజు స్క్రీన్‌పై ఆర్టికల్‌ లేక చాప్టర్‌ను చదివేటప్పుడు, విషయ సూచిక ఎప్పుడూ కనబడుతూనే ఉంటుంది. అయితే, మొబైల్‌ఫోన్‌ చిన్న స్క్రీన్‌పై విషయ సూచిక కనబడదు.

  • విషయ సూచికను చూసేందుకు లిస్టును చూపించు అనే బటన్‌ను క్లిక్‌ చేయండి. ఆ ఆర్టికల్‌ లేక చాప్టర్‌లో ఉండే విషయాలను చూసేందుకు శీర్షికను క్లిక్‌ చేయండి.

  • ముందటి ఆర్టికల్‌ లేక చాప్టర్‌ను చూసేందుకు ముందు బటన్‌ను క్లిక్‌ చేయండి.

  • తర్వాతి ఆర్టికల్‌ లేక చాప్టర్‌ను చూసేందుకు తరువాత బటన్‌ను క్లిక్‌ చేయండి.

  • బైబిలు విషయ సూచిక కనబడకుండా ప్రస్తుతం చదువుతున్న ఆర్టికల్‌ లేక చాప్టర్‌ను కొనసాగించేందుకు లిస్టును చూపించకు అనే బటన్‌ను క్లిక్‌ చేయండి.

 ఆన్‌లైన్‌ బైబిలును ఎలా చూడాలో పరిశీలించండి

ప్రచురణలు అనే టాబ్‌ కింద > బైబిలులోకి వెళ్లి భాషను ఎంపిక చేసుకుని వెతుకు అనే బటన్‌ను క్లిక్‌ చేయండి. ఆ తరువాత ఆన్‌లైన్‌లో చదవండి అనే బటన్‌ను క్లిక్‌ చేయండి. లేక హోమ్‌ పేజీలో ఉండే బైబిలు ఆన్‌లైన్‌లో చదవండి అనే లింకును క్లిక్‌ చేసి, భాషను ఎంపిక చేసుకుని వెతుకు అనే బటన్‌ను క్లిక్‌ చేయండి.

బైబిల్‌ నావిగేషన్‌ బార్‌పై, డ్రాప్‌-డౌన్‌ లిస్టులో నుండి ఓ బైబిలు పుస్తకాన్ని మరియు అధ్యాయాన్ని ఎంచుకొని, గో బటన్‌ను క్లిక్‌ చేయండి.

అధ్యాయంలో కిందికి వెళ్తుండగా, మీరు సులభంగా మరో అధ్యాయానికి వెళ్లేందుకు బైబిల్‌ నావిగేషన్‌ బార్‌, మెనూబార్‌ పైనే నిలిచి ఉంటుంది.

  • మెనూబార్‌ పైనుండి బైబిల్‌ నావిగేషన్‌ బార్‌ను తీసివేసేందుకు అన్‌పిన్‌ బటన్‌ను క్లిక్‌ చేయండి. బైబిల్‌ సమాచారాన్ని చూసేందుకు ఇది స్క్రీన్‌పై ఎక్కువ స్థలాన్ని కల్పిస్తుంది. వేరే చాప్టర్‌ను ఎంచుకునేందుకు ఇప్పుడున్న పేజీ పైభాగానికిగానీ కింది భాగానికిగానీ వెళ్లండి.

  • బైబిల్‌ నావిగేషన్‌ బార్‌ను మెనూబార్‌పై ఉంచేందుకు పిన్‌ బటన్‌ను క్లిక్‌ చేయండి.

  • బైబిలు విషయ సూచికను, అనుబంధం మరియు పరిచయ మాటలతో సహా చూసేందుకు లిస్టును చూపించు అనే బటన్‌ను క్లిక్‌ చేయండి.

  • ముందటి అధ్యాయాన్ని చూసేందుకు ముందు అనే బటన్‌ను క్లిక్‌ చేయండి.

  • తర్వాతి అధ్యాయాన్ని చూసేందుకు తరువాత అనే బటన్‌ను క్లిక్‌ చేయండి.

  • బైబిలు విషయ సూచిక కనబడకుండా ఉండేందుకు లిస్టును చూపించకు అనే బటన్‌ను క్లిక్‌ చేయండి.

 ఎదైనా ఆర్టికల్‌కు సంబంధించిన ఆడియోను వినండి

మీరు చదివే ఆర్టికల్‌కు ఆడియో అందుబాటులో ఉంటే ఆడియో బార్‌ కనబడుతుంది.

  • ఆడియోని వినేందుకు ప్లే అనే బటన్‌ను క్లిక్‌ చేయండి.

  • ఆడియోని కాసేపు ఆపేందుకు పాజ్‌ అనే బటన్‌ను క్లిక్‌ చేయండి. ఆడియోలో మిగిలిన భాగాన్ని వినేందుకు ప్లేని మళ్లీ క్లిక్‌ చేయండి.

  • ఆడియోలో వివిధ చోట్లకు వెళ్లేందుకు ఆడియో పాయింటర్‌ని ముందుకుగానీ వెనక్కుగానీ లాగండి.

మీరు ఆడియోను ప్లే చేయడం మొదలుపెడితే ఆర్టికల్‌ను కిందికి జరపండి. అయినప్పటికీ ఆడియోబార్‌ మెనూబార్‌ పైనే నిలిచి ఉంటుంది. ఇది మీరు చూసే ఆర్టికల్‌లో స్థానాన్ని మిస్‌ అవ్వకుండానే ఆడియోను కాసేపు ఆపేందుకు లేక తిరిగి వినేందుకు సహాయపడుతుంది.